రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పెండింగ్ బకాయిల కోసం ఈరోజు 1000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా కేటాయించే 700 కోట్ల రూపాయలను, ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా 1000 కోట్ల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాము.
ఈ నిధులతో అక్టోబర్ 2025 వరకు పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఉద్యోగుల మెడికల్ బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడమైనది.
ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను.
రాష్ట్ర సచివాలయంలో నేడు ఆర్టీసీ జేఏసీ నాయకులతో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు , శ్రీధర్ బాబు గారు , వివేక్ వెంకటస్వామి గారు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చించాము.
కార్మికుడు శంకర్ గౌడ్ గారి మరణం అత్యంత బాధాకరం. సమస్యలు ఎంత క్లిష్టమైనవైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న చేదు అనుభవాలు పునరావృతం కాకూడదన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం. ఇక్కడ ఎవరూ శత్రువులు కాదు. పేదలకు, మహిళలకు ప్రధాన రవాణా సాధనమైన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన అంశాలపై సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటాము.
కార్మికుల సమస్యలను పరిష్కరించి, సంస్థను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వంపై నమ్మకంతో కార్మికులు సంయమనం పాటించాలని కోరుతున్నాను.
The Congress-DMK alliance has a proud history of social justice in Tamil Nadu. We are committed to carrying it forward.
My message to the people of Tamil Nadu: Protect your identity, your language, your rights.
Vote for the INDIA alliance.
Vote for Congress.
నన్ను రాజకీయంగా ఆదరించి, గుండెల్లో పెట్టుకున్న నా మధిర, ఖమ్మం ప్రాంత ప్రజలు, అభిమానులు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల సమక్షంలో నా కుమారుడు సూర్య విక్రమాదిత్య - సాక్షిల వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
హైదరాబాద్లో వివాహం జరిగినప్పటికీ, నన్ను ఈ స్థాయికి చేర్చిన నా సొంత మనుషుల ఆశీస్సులు నా బిడ్డలకు ఎల్లప్పుడూ ఉండాలనే తపనతో, మన ఖమ్మం గడ్డపై ఈ వేడుకను నిర్వహించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ఎండను సైతం లెక్కచేయకుండా, వేలాదిగా తరలివచ్చి నూతన వధూవరులను దీవించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అపారమైన అభిమానం, మీరు చూపిన ఈ వెలకట్టలేని ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
Extremely grateful to the people of Madhira and Khammam for gracing my son Surya Vikramaditya and Sakshi’s wedding reception.
Thank you for your selfless love.
The Congress alliance government in Puducherry will be built on guarantees that support the people:
• ₹2000/month support for unemployed youth
• 30,000 new jobs in public & private sectors
• Free bus travel for women
• Govt job age limit relaxed up to 40 years
• ₹20 lakh health insurance for every family
These aren’t empty promises - they’re the foundation of dignity and security.
Let’s build a Puducherry together that truly reflects the voice of its people.
Rupee: ₹95 → ₹100
Stocks: Crashing
Economy: Collapsed
Jobs: Gone
Income: Falling
Savings: Wiped out
Cylinders: Unavailable
Why?
PM = Compromised
He is desperate to protect himself and his financial structure. But 140 crore Indians know - PM Modi has surrendered India’s future.
ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ శ్రీమతి మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు.
గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించాను. ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్ధాపన చేశామని తెలిపాను. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పాను.
జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు.
#ManekaGandhi
#AnimalWelfare
#AnimalRights #TelanganaGovernment
వైయస్ దయవల్ల 2004లో హరీష్ రావు మంత్రి అయ్యారు
2009లో చంద్రబాబు దయవల్ల కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు
నేను zptc MLC సొంతంగా గెలిచా
ఆ తర్వాతే రాజకీయ పార్టీలో చేరాను
2009లో పొత్తులో భాగంగా మా జిల్లాలో భుజాలపై వేసుకొని కేసీఆర్ గెలిపించా
నా కాలి గోటికి కూడా మీరు సరిపోరు - CM
పార్లమెంట్ ఆవరణలో ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని నేను, పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశాం.
#PriyankaGandhi#CongressParty#TelanganaCongress#AICC
मैंने संसद में कहा कि मोदी सरकार ने भारत की ऊर्जा सुरक्षा से समझौता किया है - माइक बंद कर दिया गया।
मैंने मोदी जी का नाम एपस्टीन फ़ाइल में होने का जैसे ही ज़िक्र किया - माइक बंद कर दिया गया।
मैंने पेट्रोलियम मंत्री हरदीप सिंह पुरी और एपस्टीन से जुड़े सवाल उठाए - माइक बंद कर दिया गया।
मैंने उनकी बेटी की कंपनी में सोरोस के पैसे लगे होने पर बात करने की कोशिश की - माइक बंद कर दिया गया।
सौ बातों की एक बात, जो दबाए न दबेगी - नरेंदर सरेंडर हो गया है।
హైదరాబాద్ నగర నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న సంకల్పంతో, మురికి కూపంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలన్న గొప్ప తలంపుతో, మూసీ దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కాలుష్య వెతలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న మానవత్వంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “మూసీ పునరుజ్జీవం - రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్” ప్రాజెక్టు తలపెట్టింది.
ఈ ప్రాజెక్టు పై కొందరు వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాం.
ప్రముఖులు, పర్యావరణవేత్తలు, మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల సమక్షంలో ప్రభుత్వ విజన్ ను, వాస్తవ అంశాలను స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించాం.
ఈ రోజు “MUSI INVITES” పేరుతో
కార్యక్రమం నిర్వహించి మా ఆలోచనను సమాజం ముందు పెట్టాం. మూసీ పునరుజ్జీవం ఇప్పుడు ఛారిత్రక అవసరం. మా ప్రభుత్వం ప్రజలను నొప్పించి, పేదలను ఇబ్బంది పెట్టి ఏ పని చేయదు. ప్రతి అభివృద్ధి వెనుక కొంత మందికి ఇబ్బంది కలగడం సహజం. ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆ పరిష్కారం పై ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి మేం సిద్ధం.
మూసీ పరీవాహకంలో మురికి వాడల్లో పేదలు ఆత్మగౌరవాన్ని వదులుకుని బతకాలా!? వారు స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించాలన్నది మా ఆకాంక్ష. నది పునరుజ్జీవనంతో పాటు, పేదలకు ఆత్మగౌరవంతో కూడిన పునరావాసం కల్పించడానికి సిద్ధం గా ఉన్నాం.
మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్ప, ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు అనేది మా ప్రభుత్వం నమ్ముతుంది.
చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్ కు ప్రణాళికలు వేసుకోవడం విజ్ఞుల లక్షణం. మూసీ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం.
#MusiRejuvenation
#MusiRiverfront
#Hyderabad
#CleanMusi
#TelanganaDevelopment
కలెక్టర్లు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి.
ఇటీవల బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లాల కలెక్టర్లు నేడు సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని వారికి సూచించడం జరిగింది.
ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయడం కీలకమని, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పని చేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది.
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలనలో ప్రజాకేంద్రంగా పాలన సాగాలని , ప్రజలకు మేలు చేసే పనులనే జిల్లా పాలకులుగా చేపట్టాలని తెలియజేయడం జరిగింది.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాల ఫలాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించవలసిన బృహత్తర బాధ్యత కలెక్టర్లపైనే ఉందని స్పష్టం చేయడం జరిగింది.