#LegendaryNTRJayanthi
ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. తెలుగుజాతి ఆత్మగౌరవంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అణగారిన వర్గాలకు అండగా పసుపు జెండాని నిలబెట్టారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు. ప్రజల కోసం..ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మరణంలేని మహా మనిషి ఎన్టీఆర్కు జోహార్లు. తాతా..మీరే తెలుగు ప్రజల కీర్తి..మీరే మాకు నిత్యనూతన స్ఫూర్తి..
#LegendaryNTRJayanthi
"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... మహాపురుషులౌతారు" అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాతుడు, మహామనిషి శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ వినీలాకాశంలో రాముడుగా, కృష్ణుడుగా చెరగని ముద్ర వేసిన ఆయన రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారు. తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త ఆయన. ఆ యుగ పురుషుడికి మరొక్కమారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
Seconds before his throat was slit, they ordered him to chant “Jai Jagan.”
He chose “Jai Chandrababu, Jai Telugu Desam” and gave his life for it.
Thota Chandraiah. A warrior. A martyr.
@ncbn garu carried his body at the funeral.
Lokesh garu secured a govt job for his son by special cabinet resolution.
And today, he holds that son’s hand, walks him to CBN garu, hugs him close.
This is family. This is “Karyakarthe Adhinetha.” This is Telugu Desam.
This is @naralokesh 🔥🫡
#Mahanadu2026 #AndhraPradesh
గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించాను. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం.
#PattadarPassbooks