@reliancejio and @JioCare just a month back I have taken a new 5G mobile at tirupati where I stay. From there the iam not able to make calls. And not receiving calls. And internet speed is like 2g. And customer care is saying it will take 3 months to fix the issue in our area.
But surveyor is excluding the rear wheel from claim saying damage is not visible. How can all damages are visible outside. The wheel costs around 5k which i need to bear even after having an insurance.
Pls look into the issue
Claim no OC-26-1802-1826-00000787
@bajajgeneral
Dear bajaj,Recently i have applied for insurance claim for an accident to my bike. Among the damaged parts rear wheel bent is one which is confirmed by showroom mechanic which is causing skid of bike which is potential threat for a rider.
వాడు
వాడు పుడతాడు, వాడు మాగాడేలే అని మొలతాడుతో వదిలేస్తారు.
వాడు నడుస్తాడు, పడతాడు, ఏడిస్తే వాడే ఊర్కుంటాడులే అని వదిలేస్తారు.
వాడు బడికెళ్తాడు, ఎవరో ఏడిపిస్తే, ఏంట్రా ఆడదానిలా ఏడుస్తున్నావ్ అని ఎదిరిస్తారు.
వాడు డప్పు వాయిస్తాడు, ఏరా చావుమేళంలో చేరుతావా అని చిన్నవయసులోనే కలల్ని, కళల్ని చిదిమేస్తారు.
వాడికి యుక్తవయసులో నిద్రలో నిక్కరు తడిసిపోతుంది, మనసు కంగారు పడుతుంది, వాడికెవరూ అది ప్యూబర్టీ అని వివరించరు.
వాడేదో చదవాలనుకుంటాడు, ఇది చదివితే నీకు పిల్లనెవడిస్తాడు అని బెదిరిస్తారు.
వాడేదో ఉద్యోగం అని తిరుగుతాడు, ఇంకా పెళ్ళవ్వలేదా అని పొడుస్తారు.
వాడేదో పెళ్ళానికి సాయం చేస్తాడు, ఆడారోడా అని వెక్కిరిస్తారు.
వాడి పెళ్ళాం పురిటినొప్పుల్లా పిల్లలకోసం వాడి గుండెబరువు కనపడదు, కనపడనిది లేనట్లే.
వాడికేదో జన్యువుల వలన జుట్టూడిపోతుంది, అదేదో శాపం అన్నట్లు వాడిని అదోలా చూస్తారు.
వాడెప్పుడూ పాపం వాడిది కొలుచుకుని, పోల్చుకుని మధనపడిపోతుంటాడు, దానికి పదును ఉంటే చాలు పొడవుతో పనిలేదని ఎవరూ చెప్పరు.
వాడేదో సంపాదిస్తాడు, అన్ని వాయిదాలూ కట్టి వాడి వ్యాయామం వాయిదా వేస్తుంటాడు.
వాడికి డయాబెటీసు, హైపర్టెన్షను అన్నీ ముందే వస్తాయి, రాకపోతే టెన్షన్ పడిపోతాడు, నేనంత టెన్షన్ పడట్లేదేమో అనీ.
వాడి పిల్లలు హాస్టల్‌కి పోతేనో, విదేశాలు పోతేనో, ఒంటరిగా స్నానం చేసేటప్పుడు వాళ్ల పేర్లు నోరారా పలుకుతాడు, వాడికెవరూ డబ్బులకోసం తప్పితే జాబులు రాయరు.
వాడి అమ్మానాన్నల్ని మలివయసులో ఎత్తి దించుతాడు, అది వాడి బాధ్యత అంటారు, వాడేదో అలసట లేని యంత్రం అయినట్లు.
వాడికేవో మనసులో మాటలుంటాయి, వాటికి ముసుగేసి కప్పేస్తాడు, పైకెప్పుడూ ముసిముసిగా నవ్వుతుంటాడు.
వాడి బాధ లోకం చూడడు, వాడు చెప్పడు, ఇక చూడనిది, చెప్పనిది, లేనిది అది.