హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
2026లో ఇంటికి సోలార్ ప్యానెల్స్ పెట్టాలనుకుంటే ప్రభుత్వం ఎంత సహాయం చేస్తోంది? 🔥
ఇందులో 'ఈ పథకం అంటే ఏమిటి?' అనే దగ్గరి నుండి 'ROI లెక్కింపు' వరకు పూర్తి వివరాలు ఉన్నాయి. థ్రెడ్ మొత్తాన్ని చదివి ఇప్పుడే బుక్‌మార్క్ (Bookmark) చేసుకోండి.
PM Surya Ghar Muft Bijli Yojana ద్వారా మీకు లభించే ప్రయోజనాలు ఇవి... 👇1/8
✅ ప్రధాన స్కీమ్: PM Surya Ghar Muft Bijli Yojana
💠 నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
💠 సబ్సిడీ:
• 1 kW → ₹30,000
• 2 kW → ₹60,000
• 3 kW & above → గరిష్టంగా ₹78,000
సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది. 2/8
✅ ఎవరు అర్హులు?
💠 మీ స్వంత ఇల్లు ఉండాలి
💠 ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ పెట్టాలనుకోవాలి
💠 రెసిడెన్షియల్ వినియోగదారులు. 3/8
✅ ఎలా అప్లై చేయాలి? (సింపుల్ స్టెప్స్)
💠https://t.co/keVDazmFFp వెబ్‌సైట్‌కి వెళ్లండి
💠మీరు లేదా మీ సోలార్ వెండర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోండి
💠అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
💠ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత సబ్సిడీ మీ అకౌంట్లోకి వస్తుంది. 4/8
✅ ఇంకా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?
💠 తక్కువ వడ్డీకి కొలాటరల్-ఫ్రీ లోన్ సౌకర్యం
💠 మీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది
💠 మిగిలిన విద్యుత్‌ని గ్రిడ్‌కి అమ్మి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. 5/8
✅ ముఖ్య గమనిక:
💠 సబ్సిడీ 3 kW వరకు ఎక్కువగా లభిస్తుంది
💠 3 kW కంటే ఎక్కువ సిస్టమ్ పెట్టినా గరిష్ట సబ్సిడీ ₹78,000 మాత్రమే
💠 కొన్ని రాష్ట్రాలు అదనపు టాప్-అప్ సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. 6/8
✅ మీరు సోలార్ పెట్టాలనుకుంటే ఏం చేయాలి?
💠 మీ నెలవారీ విద్యుత్ వినియోగం ఎంతో చూసుకోండి
💠 మంచి సోలార్ వెండర్‌ని సంప్రదించండి
💠 PM Surya Ghar పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలుపెట్టండి. 7/8
✅సోలార్ పెట్టడం వల్ల మీకు లాంగ్ టర్మ్‌లో ఎంతో లాభం ఉంటుంది.
✅ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి.
మీ ఇంటికి సోలార్ పెట్టాలనుకుంటున్నారా? లేదా ఏమైనా సందేహాలు ఉన్నాయా?
కామెంట్స్‌లో చెప్పండి 👇
#PMSuryaGhar
పవన్ కళ్యాణ్ ఏదో TASK FORCE వేశాడు అన్నారు కదా..ఆ TASK FORCEకి నా విజ్ఞప్తి
ఆ టాస్క్ ఫోర్స్ వేసిన అదే వ్యక్తి మాట్లాడిన మాటలు వినండి హింసకి ప్రేరేపించాడో లేదో మీకే తెలుస్తుంది
1.ఒకరిని తిట్టడం
2.Death Threats ఇవ్వడం
3.ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యడం
4.మహిళలను టార్గెట్ చెయ్యడం
5.మత విశ్వాసాలను అవమానించడం
6.ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బ తీయడం
7.హింసకు ప్రేరేపించడం
ఇవన్నీ రాజ్యాంగ స్వేచ్ఛలోకి రావు. .ఇవి చట్టపరంగా నేరాలు . .I Totally Agree With You..నేను కూడా స్వాగతిస్తున్నా !కానీ,
👉పైన చెప్పిన పాయింట్స్ అన్నీ #PawanKalyan అతిక్రమించాడు . .చట్టపరంగా నిన్ను ఇప్పుడు జైల్లో పెట్టాలి కదా నువ్వు అన్నట్లుగానే #PawanKalyan
తమరు పాటించి ఇతరులకు చెప్పండి 🤷♂️🤷♂️🤷♂️
నువ్వు శుద్ధపూస అయినట్లు మాకు నీతులు చెప్పడం కాదు🤦🏻🤦🏻🤦🏻
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
ముందు పవన్ కళ్యాణ్ ను జైల్లో పెట్టండి ..
రెండు ఏళ్లకే సహనం కోల్పోయావు , నువ్వేం రాజకీయ నాయకుడివి అయ్యా ... 🃏
నువ్వు సోషల్ మీడియాకి ఎక్కువ
మెయిన్ మీడియాకి తక్కువ @PawanKalyan :- @DrPradeepChinta ఫైర్ 💥🔥🔥💥💥
మొత్తానికి వీడియో దొరికేసింది మావ 🥲... ❗
జనసేన పార్టీ అధినేత Pawan Kalyan నీ వాళ్ళ జనసైనికులు నీ బుల్ బుల్ బాలయ్య
" అలగా నా కొడుకులు... అలగా జాతి "
అని గౌరవ బిరుదులు ఇచ్చిన వీడియో 🤷♂️🥲
Note : 0:35 sec లో వినండి
2004లో YSR జలయజ్ఞంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు.
8,000 కోట్ల రూపాయలు కేటాయించి, టన్నెల్స్ పనులు మొదలుపెట్టారు.
చంద్రబాబు క్రెడిట్ దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు.
పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల కోసం ఎంతో ముఖ్యమైన ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కి చిత్తశుద్ధి లేదు.
కేవలం రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడు.
- తాటిపర్తి చంద్రశేఖర్
*మంత్రి నారాయణ గారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన..YSR కాంగ్రెస్ పార్టీ..*
*MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
• వ్యవస్థలను మేనేజ్ చేసి.. అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి తెలిసిన విద్య.
• భారతదేశ వ్యాప్తంగా S I R ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం . ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. అమలు చేస్తూ.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు..
• S I R అనేది.. ఎన్నికల ప్రక్రియలో భాగం
• ఈ S I R ప్రక్రియ ను ERO ( మున్సిపల్ కమిషనర్ ) ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO), ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత వారిపై.. ఉంటుంది .
• ఈ ప్రక్రియలో ఎక్కడా రాజకీయ నాయకుల ప్రమేయం.. గాని.. ప్రజా ప్రతినిధులు ఇన్వాల్వ్ కావడం..గాని జరగకూడదన్న విషయం పై ఎలక్షన్ కమిషన్ .. గట్టి ఆదేశాలు జారీ చేసియున్నది.
• అయితే నిన్నటి రోజున.. మంత్రి నారాయణ గారు, మేయర్ డిప్యూటీ మేయర్లతో కలిసి.. BLO లు, మున్సిపల్ కమిషనర్ లతో సమావేశం నిర్వహించి ఏవిధంగా ఓటర్లని.. తొలగించాలా.. ఎవిధంగా కొత్త ఓట్లను నమోదు చేయాలా.. అన్న సూచనలు చేయడం ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
• ఇందుకు సంబంధించి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం నుంచి.. స్టేట్ చీఫ్ ఎలెక్ట్రోరల్ ఆఫీసర్ గారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందని..అదే ఫిర్యాదును నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి.. పంపించడం జరిగిందన్నారు.
• మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలాంటి ప్రక్రియలో జోక్యం చేసుకున్న సంఘటనలు ఎక్కడ జరగలేదన్నారు.
• ఈరోజు మంత్రి నారాయణ గారు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో ఇన్వాల్వ్ కావడం.. తనకు సంబంధించిన ఓట్లను యాడ్ చేసుకోవడం.. నచ్చని ఓట్లను తొలగించడం.. చేస్తుండడం సరికాదన్నారు.
• మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ పాల్గొని . BLO లు.. అందరూ.. హాజరయ్యేలా.. ఆదేశాలు ఇవ్వడం.. పెద్ద చట్టాల ఉల్లంఘన అన్నారు.
• ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చట్టపరంగా ఏ విధంగా ముందుకు పోవాలో.. పార్టీ నిర్ణయం మేరకు..ముందుకు పోవడం జరుగుతుందని తెలిపారు.
నెల్లూరు రాంజీ నగర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ముందస్తు జన్మదిన వేడుకలు..పర్వతరెడ్డి లోకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో.... ఎంతో అట్టహాసంగా జరిగాయి.*
*చంద్రశేఖర్ రెడ్డి గారి ముందస్తూ..జన్మదిన వేడుకల్లో రికార్డు స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి.. యువత తమ సేవా గుణాన్ని చాటుకున్నారు.*
#HBDMLCChandrasekharReddy
కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై దాడులు.. ప్రశ్నించే గొంతు నొక్కడమే... *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు, వైస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, రూరల్ ఇన్ చార్జ్ *ఆనం విజయకుమార్ రెడ్డి* గారు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.
*కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారి కామెంట్స్
• చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యాసంస్థల పై దాడులు చేయడం అంటే.. ప్రశ్నించే వారిని అణగదొక్కడమేనన్నారు.
• మెగా డియస్సీలో ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రశ్నించడమే చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన తప్పా చెప్పాలన్నారు.
• నెల్లూరు జిల్లాలో ఉన్న 70 కాలేజీలను వదిలిపెట్టి.. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపై దాడులు చేయడం చూస్తుంటే.. కూటమి ప్రభుత్వ నేతలు .. రాజకీయాల్లో ఏ స్థాయికి దిగజారి పోయారు అర్థమవుతుందన్నారు.
• కృష్ణ చైతన్య విద్యాసంస్థలు ఎంతోమంది పేద విద్యార్థులు ఉచిత విద్యనందిస్తూ.. సేవాభావంతో ముందుకెళ్తున్నాయని తెలిపారు.
• అలాంటి విద్యా సంస్థలపై ఈరోజు ప్రభుత్వం చేసిన దాడులు.. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలేనన్నారు.
• ఇలాంటి వాటికి చంద్రశేఖర్ రెడ్డి గారుగాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని.. భయపడిపోదని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పని చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
👉 గత కొన్ని రోజుల్లో ప్రభుత్వం చేసిన తప్పులను.. అలాగే మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను.. ప్రజల ముందుంచి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
• ఈ క్రమంలో రెండు రోజుల కిందట కృష్ణ చైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన ఆరు జూనియర్ కళాశాలల బ్రాంచ్ లపై..సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 వరకు అధికారులు సోదాలు నిర్వహించారని తెలిపారు.
• కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ విధమైన దుర్మార్గ వైఖరిని అవలంబించిందన్నారు..
• ఈ ఘటన జరిగిన తర్వాత అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. మేము విద్యాసంస్థలు నడుపుతున్నాం కాని .. ఎన్నడు ఈ విధంగా .. సిబ్బంది, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు నిర్వహించడం చూడలేదంటున్నారు.
• నిన్నటి రోజున మంత్రి నారాయణ గారు.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు
• వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు.. నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి.. ఉన్న అనుమతులు రద్దు చేయడం కానీ.. కొత్త అనుమతులు ఇవ్వకపోవడం గాని జరిగిందా.. లేదు కదా మరి ఏ విధంగా మీరు నష్టపోయారో మంత్రి నారాయణ చెప్పాలన్నారు..
• కూటమి ప్రభుత్వం వచ్చిన గత రెండేళ్ల కాలం నుంచి ఎంతో మంది వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు బనాయించి.. వేధింపులకు గురిచేయడం జరిగిందన్నారు.
• అక్రమ కేసులు పెట్టడానికి.. అవకాశం లేని .. వారి ఆస్తులపై దాడులు చేయడం.. లేనిపక్షంలో వారికి సంబందించిన విద్యాసంస్థలు పై దాడులు చేసి ఆర్థికంగా, మానసికంగా, ఇబ్బంది పెట్టడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు.
• వైఎస్ఆర్సిపి పిలిపివ్వకుండానే నిన్నటి రోజున స్వచ్ఛందంగా..శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు. నెల్లూరు నగరానికి 19 మంది ఎమ్మెల్సీలు తరలివచ్చి నాకు సంఘీభావం తెలిపి .. ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ఖండించడం జరిగిందన్నారు.
• ఎమ్మెల్సీలు ఎవరు మంత్రి నారాయణ గురించి ఎక్కడ ప్రస్తావించలేదని.. కేవలం ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, దుశ్చర్యలను ప్రశ్నించారని అన్నారు.
• మంత్రి నారాయణ.. ఈ విధమైన దాడులు చేయించారని మేము ఎక్కడ అనలేదన్నారు.
• గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా కూటమి నేతలు వ్యవహరిస్తూన్నారని అన్నారు.
• నెల్లూరుకు శాసనమండలి సభ్యులు వస్తే.. వారిని అగౌరవపరిచేలాగా.. రోడ్ షో చేయడానికి వచ్చారని మాట్లాడటం.. కూటమి నేతల కుసంస్కారానికి నిదర్శనమన్నారు.
• వైఎస్ఆర్సిపి నాయకులు, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు.. ఎన్ టీం లాగా పెయిడ్ బ్యాచ్ కాదని.. జగన్మోహన్ రెడ్డి గారికి.. ఏ కష్టం వచ్చినా ముందుండి నిలబడి పోరాడే సైనికులన్న విషయాన్ని గుర్తించుకోవాలని కూటమి నేతలను హెచ్చరించారు.
• ఒక..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కష్టం వస్తే.. ఎవరు పిలవకుండానే ఎమ్మెల్సీలు అంతా ఏకమై వచ్చి.. నెల్లూరులో విద్యాసంస్థలపై జరిగిన దాడిని ఖండించడం జరిగిందన్నారు.
• ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఉన్న ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.
• వైయస్ఆర్సీపీ అంటేనే ప్రజాపక్షమని.. ప్రజల కోసం నిరంతరం పాటుపడే నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేనన్నారు.