నిశీథి నాదం — ఒక అనుభవం, ఒక అనుభూతి
మనసు లోతుల్లో ఏదో కదలిక మొదలవుతుంది. పేజీ తిరగేసే కొద్దీ గుండె వేగం పెరుగుతుంది. చదవడం ఆపాలని అనిపించదు, ఆగాలని కూడా తెలుసు, కానీ ఆగలేరు. అదే "నిశీథి నాదం" చదివే అనుభవం. @koteshmamilla@AkshataPub
జీవితం అనే సముద్రంలో అందరిలాగే నువ్వు కొట్టుకుపోవడం ఖాయం. మరి ఆ సముద్రాన్ని ఎలా ఈదడం..?
అది తెలియాలి అంటే ఈ పుస్తకం చదవాల్సిందే...
Pre Orders Open
కావలసిన వారు సంప్రదించండి: +91 9515746908 (WhatsApp)
రచయత: @aravindpatel679
9 కథలు
9 కథకులు
"అనఘ" పుస్తకం ఇప్పుడు అమెజాన్‌లో కూడా లభ్యమవుతోంది.
రచయితగా నాకు అత్యంత ఆత్మ సంతృప్తినిచ్చిన కథ "ప్రేమతో.. నీ మహాలక్ష్మీ"ని తెలుగు పాఠకులు అందరూ చదవాలని కోరుకుంటున్నాను.
ఇప్పటికే చదివిన వారు కాల్స్, మెసేజ్‌ల ద్వారా అభినందిస్తున్నారు. "ప్రేమతో.." కథ చదివాక ఓ పాఠక మిత్రుడు గుంటూరు నుంచి ఓ చక్కని పెన్ గిఫ్ట్‌గా పంపారు.
"అనఘ" పుస్తకావిష్కరణ రోజు పబ్లిషర్ శ్రీమతి సోనీగారు కథలో ప్రధాన పాత్ర అయిన డయానా/మహాలక్ష్మీ గురించి దాదాపు పదిహేను నిమిషాలు మాట్లాడారు. నేను ప్రేమతో రాసిన కథ మీకు, రాజేష్ గారికి నచ్చినందుకు ధన్యవాదాలు మేడమ్.
సో, డియర్ ఫ్రెండ్స్!
ఆర్డర్ చేయటానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
https://t.co/4CDHvgooP4
@AkshataPub@rajessrao
ఒక కొత్త ప్రారంభం.
పుస్తకాల ప్రపంచంలో కొత్త అడుగు వేస్తూ “అక్షత పబ్లికేషన్స్” ను ప్రారంభిస్తున్నాం. మంచి కథలు, భావోద్వేగాలు, కొత్త రచయితలకు అవకాశాలు. ఇవే మా ప్రధాన లక్ష్యం. పాఠకులకు మంచి పుస్తకాలు అందించడం మా లక్ష్యం. మీ అందరి ఆశీస్సులు, ప్రోత్సాహం మాకు కావాలి.
#Telugu#Akshata
"డయానా చూడటానికి ఎలా ఉంటది?" అడిగాడు సంజయ్. "చాలా అందంగా ఉంటుంది, నేచురల్ బ్యూటీ" అంటూ ఇయర్ ఫోన్స్ చెవిలోంచి తీసాడు రిషి.
"ఇంకా..?" అన్నాడు సంజయ్. "ఇంకా.. చాలా మంచమ్మాయి. సోషల్ మీడియా వాడదు, అనవసరమైన మాటలు మాట్లాడదు, ఎవరి గురించి చెడుగా చెప్పదు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు" అన్నాడు.
"ఓకే, నువు ఏం చేయలేదా?" అని అడిగాడు సంజయ్. రిషి అతని వైపు చూసి "నో, అలా థింక్ చేయలేదు" అన్నాడు. "థింక్ చెయ్. వర్జిన్‌గా చనిపోయి నువ్వు పైకి వెళ్ళాక.. ఒరేయ్ బడుద్దాయి మీ కోసమే కదరా అమ్మాయిలను సృష్టించాను. ఏమీ చేయకుండా పైకి ఎందుకు వచ్చి చచ్చావ్! అని ఆ దేవుడు నీ పిర్ర మీద తంతాడు చూడు!" అన్నాడు సంజయ్.
"నన్ను ఓల్డ్ ఫ్యాషన్డ్ అనుకున్నా పర్లేదు, శీలం పోగొట్టుకుంటే అది నా భార్యతోనే" అన్నాడు రిషి.
****
కొన్ని కథలు రాసేటప్పుడు పెన్ను మాత్రమే కదులుతుంది. మరికొన్ని రాసేటప్పుడు మనసులో అలజడి రేగుతుంది, ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. నాకు అలాంటి అనుభవం "ప్రేమతో.. నీ మహాలక్ష్మీ" కథనం రాసేటప్పుడు కలిగింది.
నా మనసుకి చాలా దగ్గరైన "మహాలక్ష్మీ" కథ ఇప్పుడు "అనఘ" పుస్తకం ద్వారా తెలుగు పాఠకులకు చేరువ చేస్తున్న @AkshataPub వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@rajessrao ఆల్ ది బెస్ట్ సర్ 💐
https://t.co/ruuWYWcrVO
Our 2nd novel
One is the Key. One is the Spark. But as the planet’s core begins to fail, they must decide: will they cling to the ghosts of their past, or will they unite to find a new home among the stars?
#scifi#novel#ComingSoon#dystopian