భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
కళను కాపాడే కళ్లకు ఆరోగ్య భరోసా
శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
15 మందికి త్వరలోనే క్యాటరాక్ట్ శస్ర్తచికిత్స
హస్తకళాకారుల చేతుల్లో కళ బతకాలంటే... వారి కళ్లల్లో వెలుగులు చిరకాలం నిలవాలన్న సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హస్త కళాకారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం వేదికగా కళాకారులకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ ఇప్పటి వరకు కొండపల్లి, నరసాసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. కళాకారుల ఆరోగ్యమే వారి కళకు బలమనే భావనతో నిరంతరం ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. కంటి పరీక్షల నుంచి అవసరమైన మందులు, కళ్లద్దాలు, శస్త్రచికిత్సల వరకు పూర్తిస్థాయి వైద్య సహాయాన్ని ఉచితంగా అందిస్తూ హస్తకళాకారుల జీవితాల్లో ఆరోగ్య భరోసా నింపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఆ ప్రాంత లేస్, నేత కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో మొత్తం 143 మంది కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 110 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించగా, వారికి ఉచితంగా కళ్లద్దాలను అందించనున్నారు. మరో 18 మంది కళాకారులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
GEN-Z నాయకులకు రేవంత్ మంత్రి పదవి ఇవ్వాలి!
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే Gen Z కి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి గారు ముందు తెలంగాణలో తన మంత్రివర్గంలో Gen Z కి అవకాశం ఇవ్వాలి.
తన దగ్గరే ఉన్న విద్యాశాఖనో, హోంశాఖనో Gen Z యువ నాయకులకు అప్పగించి, యువతపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
#GenZ #Telangana
Prime Minister @narendramodi has praised the Andhra Pradesh Panchayati Raj Department’s #JalDharaJalaHarathi programme, recognizing its outstanding work with national-level appreciation.
This recognition reflects the government’s commitment to strengthening rural infrastructure and ensuring safe drinking water reaches every household.
Kudos to @PawanKalyan Garu for his visionary leadership and effective implementation.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
Polavaram water has finally reached Pithapuram… a dream turning into reality. 👏
For the farmers of Pithapuram, this is more than the arrival of water. It is the arrival of hope, confidence and a brighter future.
This is the power of committed leadership!
#PawanKalyanAneNenu
ISRO Mission ShaktiSAT selectee Kandula Jessy receives a laptop and books
On the instructions of Deputy Chief Minister Sri @PawanKalyan, KAUDA Chairman Sri Talatam Satya presented a laptop, space science books, a school bag, and chocolates to Kandula Jessy, a Class 10 student selected for ISRO's prestigious Mission ShaktiSAT, encouraging her to excel in space research.
గబ్బర్ సింగ్ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ గారు బ్రెయిన్ స్ట్రోక్తో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతుండటం బాధాకరం.
ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి కార్యాలయం అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో నేరుగా మాట్లాడి, రమేష్ గారికి అత్యుత్తమ వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరింది.
అలాగే శ్రీ @NagaBabuOffl గారు తన పి.ఏ. ద్వారా ₹2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం వారి మానవత్వానికి నిదర్శనం. దర్శకుడు శ్రీ @harish2you గారు కూడా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తున్నారు.
రమేష్ గారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.
నిన్నటి రోజున ఈ ప్రాంతంలో వెళ్తుండగా రోడ్డు దుస్థితిని స్వయంగా గమనించిన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు తక్షణమే స్పందించి నేడు రోడ్డును చదును చేయించి, గ్రావెల్ వేయించి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించారు 🔥
@PawanKalyan@JanaSenaParty@pantham_nanaji
Justice For True Telangana Journalists!
జర్నలిస్టుల జీవితాలతో కల్వకుంట్ల కవిత చెలగాటం.
@RaoKavitha
తన పార్టీ ఆవిర్భావ సందర్భంగా న్యూస్ ఛానెళ్లకు ప్రమోషన్, లైవ్ పేరుతో యాడ్స్ ఇస్తామని కొంత అమౌంట్ నిర్ధారించారు. పార్టీ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు యాడ్ అమౌంట్లు ఇవ్వకపోగా కనీసం స్పందన లేదట. యాడ్ అమౌంట్ వస్తుందని మీడియా ఛానెళ్ల రిపోర్టర్ల జీతాలు కూడా నిలిపేశాయట యాజమాన్యాలు. యాడ్ అమౌంట్లు తీసుకురాలేని వాళ్ళు రోజంతా కవిత కథనాలు ఎందుకు నడిపారని యాజమాన్యాలు రిపోర్టర్లను నిలదీస్తున్నారట.
యాజమాన్యాలకు, మీకు మధ్య సామాన్య న్యూస్ రిపోర్టర్లు నలిగిపోతున్నారు. రిపోర్టర్లు అందరూ పైరవీలు చెయ్యరు, మీకు తెలిసినట్టు యాజమాన్యాలు ఇచ్చే జీతాలే కాకుండా నాయకుల దగ్గర ఇంటర్వ్యూల ఎర చూపి డబ్బులు వసూలు చేసే యాంకర్లు, రిపోర్టర్లలా అందరూ ఉండరు. వీరికి జీతం తప్పా వేరే ఆధారం ఉండదు. ఉత్తుత్తి ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉద్ధరింపు మాటలు బానే చెప్తారు. ముందు మీ మాట నమ్మి పని చేసినవారిని మోసం చెయ్యకుండా నిలబడండి.
కోడి చెరువు కబ్జాపై నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఆక్రమణలు చెయ్యలేదు, నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదని తెలిపారు.
మీ వ్యూస్ కోసమో, న్యూస్ లో ఉండాలనో నిరాధరంగా పవన్ కళ్యాణ్ గారిపై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. నిజాయితీపరులపై ఇలాంటి ఆరోపణలు మానుకుని ఇకనైనా ఆలోచించి మాట్లాడాలి.
- జనసేన తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ @JSPshankargoud గారు.
#JSPTelangana #JanaSenaTelangana
హైడ్రా టీమ్ ఎంక్వైరీకి వెళ్ళి స్పష్టంగా ఇచ్చిన రిపోర్ట్ - చెరువుని నాశనం చెయ్యలేదు, నీటిని అడ్డుకోలేదు, నిబంధనలకు అనుగుణంగానే ఉంది.
ఇక జాగృతి దొంగలు, స్వయంప్రకటిత మేధావులు ఇలా గుర్తింపు కోసం పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడవటం మానేసి నిజంగా జరిగే కబ్జాలు, భూ దోపిడీలపై మాట్లాడితే కొంతైనా మనుగడ ఉంటుంది.
@AshwiniVaishnaw@tgbharath@ncbn@SCRailwayIndia@SCoRAILWAYVSKP
🚆 Why not develop Dupadu Railway Station in Kurnool with 3 platforms and start more train services from here? 🏗️
📍 Dupadu has the potential to become a major railway junction and a key connectivity hub, linking Kurnool directly to the Kolkata railway corridor. 🌏
This development would improve regional connectivity, boost economic growth 📈, create new opportunities 💼, and make rail travel more convenient for thousands of passengers every day. 🚉✨
#DevelopDupadu #Kurnool #AndhraPradesh #IndianRailways #RailInfrastructure #RailConnectivity #Rayalaseema #InfrastructureDevelopment 🚄
గిరి పుత్రులకు మాటిచ్చారు... మూడు గ్రామాల్లో కోటి రూపాయల వసతులు కల్పించారు
•బల్లగరువు పర్యటన సందర్భంగా ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•ఉపాధి నిధులతో అంగన్వాడీ కేంద్రాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు
గిరిజన గ్రామాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు- అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా గిరిపుత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, సీసీ రోడ్లు తదితర వసతులు ఉపముఖ్యమంత్రివర్యుల చొరవతో అందుబాటులోకి వచ్చాయి. గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు అనంతగిరి మండలం, బల్లగరువుకు వెళ్లారు. పర్యటనలో భాగంగా వెలగపాడు, కొరపర్తి తదితర గ్రామాల్లో గిరిజనులతో మమేకం అయ్యారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కార్యరూపం ఇస్తూ, నేడు పనులు పూర్తి చేశారు.
గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయా గ్రామాలను సందర్శించిన సమయంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సరైన భవనం లేక చిన్నారులు పడుతున్న ఇబ్బందులు గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. చిన్నారులు, మహిళల కోరిక మేరకు మూడు అంగన్వాడీ భవనాలను రూ. 55 లక్షలు వెచ్చించి నిర్మించారు. అందులో బల్లగరువు, వెలగపాడుల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. గిరిజనాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం సహకారంతో కొరపర్తిలో అంగన్వాడీ భవనానికి ప్రహరీ గోడ, ఎంపీపీ స్కూలు భవనం పునరుద్ధరణ, తాగునీటి కోసం బోరు, నీటి సరఫరా నిమిత్తం పైపు లైన్లు, గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.