విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిరహార దీక్ష చేయడం జరిగింది. 2021 జనవరిలో తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటి నుంచి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. 2014 వరకు వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ @INCIndia హయాంలో ఒక వెలుగు వెలిగింది. బీజేపీ హయాంలోనే స్టీల్ ప్లాంట్‌కి కష్టాలు మొదలయ్యాయి. అదానీకి మేలు చేసేందుకు స్టీల్ ప్లాంట్‌ను చంపేస్తున్నారు. గత 6 నెలలుగా కార్మికులను తొలగించే ప్రక్రియ సాగుతుంది. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్‌లో 34వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ఈ 11 ఏళ్లలో కారణం లేకుండా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు ప్లాంట్‌లో ఉద్యోగులు 20వేల మంది మాత్రమే ఉన్నారు.
ఇప్పుడు బీజేపీ @BJP4India అజెండా ఒకటే. స్టీల్ ప్లాంట్ భూములను అదానీకి అప్పగించాలి. అందుకే ఉద్యోగులను సైలెంట్‌గా తొలగిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విలువ రూ.4లక్షల కోట్లు. ఇంత విలువ జేసే భూములను అదానీకి అప్పనంగా అప్పజెప్పాలి అనుకుంటున్నారు. విశాఖ స్టీల్‌పై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. బీజేపీ మంత్రులు ప్రైవేటీకరణ లేదు అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు మాత్రం ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పు లేదు అంటారు. ఇందులో ఏది నిజం ? ఏది అబద్ధం ? రూ.11వేల కోట్లు పరిహారం ఇచ్చి ఆదుకున్నాం అనేది పచ్చి అబద్ధం. ఒక చేత్తో పరిహారం ఇచ్చి మరో చేత్తో బ్యాంక్ అప్పుల రూపేనా వెనక్కు తీసుకున్నారు. మరి పరిహారం ఇచ్చి ఆదుకున్నాం అని ఎందుకు గొప్పలు చెప్తారు?
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదు. మా ప్రాణాలు అడ్డుపెట్టైనా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్లాంట్. కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీనే @INC_Andhra . మోడీనీ, చంద్రబాబు @ncbn ను, పవన్ కళ్యాణ్‌ను @PawanKalyan హెచ్చరిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 2 వేల మందిని వెంటనే విధుల్లో తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్SAILలో విలీనం చేయాలి. ఈనెల 20 నుంచి తలపెట్టిన సమ్మెకు కాంగ్రెస్ తరపున మద్దతు ఇస్తున్నారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే 21 న ఇదే స్టీల్ ప్లాంట్ వద్ద ఆమరణ నిరహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నాను.
విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం కూడా లేదు. దిక్కున్న చోట చెప్పుకోండనే తీరున యాజమాన్యం వ్యవహరిస్తోంది. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం.అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం.
కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి అల్టిమేటం ఇస్తున్నాం. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. 2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలి.
లేకుంటే రేపటి నుంచి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ బయటే "ఆమరణ దీక్ష" కు దిగుతాం. ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం.