@naralokesh అన్నా,
మేము గత 6 నెలలుగా ప్రభుత్వ అధికారులను 22A తొలగింపు కోసం సంప్రదిస్తున్నాం. మా ప్రైవేట్ భూమిని 22A కింద ఉంచారు
మేము ఎవరిని కలిసినా - సబ్ రిజిస్ట్రార్ అయినా, డిప్యూటీ MRO అయినా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అయినా - అందరూ ఇది ప్రైవేట్ భూమి అని, 22A కి సంబంధం లేదని
#25yrsOfBasavatarakamHospital
కొడుకు తల్లి పేరు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తుంటే, కూతురు తండ్రి పేరు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో రాజకీయ అంశాలపై పనిచేస్తున్నాం, బసవతారకం ఆస్పత్రిని బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును నా సతీమణి భువనేశ్వరి ట్రస్టీగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు సేవ చేసిన ఆనందం మరెందులోనూ లేదు. బాలకృష్ణ, భువనేశ్వరి అందిస్తోన్న సేవల్ని అభినందిస్తున్నాను.
#ChandrababuNaidu
#RepublicSummit2026
విద్యా రంగం మొత్తం ప్రక్షాళన చేసాం. మంత్రిగా నేను ఏమి డేటా చూస్తున్నానో, కింద ఉన్న హెడ్ మాస్టర్ కూడా అదే డేటా చూస్తూ, నిర్ణయాలు తీసుకున్నాం. అదే ఈ రోజు పదవ తరగతి ఫలితాలు, ప్రైవేటుకి ధీటుగా వచ్చాయి. ఈ రోజు దాదాపుగా 85 వేల మంది ప్రైవేటు స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో చేరారు.
#NaraLokesh
#AndhraPradesh
ఎన్టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు తన పుట్టిన రోజును సోమవారం ఎన్టిఆర్ ట్రస్ట్‌లో తలసేమియా పిల్లలతో జరుపుకున్నారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారికి చాక్లెట్లు, గిఫ్ట్ హాంపర్స్ను పంచిపెట్టారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు.
#NaraBhuvaneswari
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో, నాటి ప్రధాని వాజ్‌పేయి గారు ప్రారంభించారు. నేడు దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది.
#25yrsOfBasavatarakamHospital#NandamuriBalakrishna
🚨 breaking news🚨
ఏపీ చంద్రబాబు గారిని సచివాలయంలో కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ ఎన్.ఎస్. బోసురాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బసవన్న గౌడ గారు కలిశారు.
జూన్ 25న నిర్వహించ తలపెట్టిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ నిమంత్రణ పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల అంశాలపై వారు మర్యాదపూర్వకంగా చర్చించారు.
#APCM #NCBN #Tungabhadra #APUpdates
#RepublicSummit2026
న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్ కు అతిధిగా హాజరైన విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సీఎం చంద్రబాబు గారి లక్ష్యానికి అనుగుణంగా కేబినెట్ అంతా పనిచేస్తోందన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో ఏపీ విజయరహస్యం స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అని వివరించారు.
#NaraLokesh
#AndhraPradesh
రాష్ట్రంలో రైతులకు అవసరమైన మేరకే కాకుండా, అవసరానికి మించి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా ఎరువుల కొరత అనేదే లేకుండా అధికారులు, కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించాము.
ఇంటికి వెళ్తే ఉంటాది చూడు! ఈ అమాయక భర్త బాబు గారికి!
అధికారిక పర్యటనలతో ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... పల్నాడు జిల్లాలోని లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు గుడిపల్లి నాగభూషణం పొలాన్ని సందర్శించారు. ఎప్పట్లాగే అక్కడ కలియతిరిగి, ఎంతో ఆసక్తిగా అన్నీ అడిగి తెలుసుకున్నారు.
అక్కడే రైతు నాగభూషణం తయారు చేసిన సాంప్రదాయ కోల్డ్‌ప్రెస్డ్ వేరుశెనగ నూనె గానుగను సీఎం పరిశీలించారు. ఆ రైతు ఎంతో గర్వంగా, "సార్, మేము ఎంతో సహజ పద్ధతిలో ఈ వేరుశెనగ నూనెను తయారు చేస్తున్నాం, మీరు కూడా ఒకసారి వాడి చూడండి" అని కోరాడు.
సరిగ్గా అక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది!
రాష్ట్ర పాలనలో ఎంతో కఠినంగా, క్రమశిక్షణతో ఉండే చంద్రబాబు గారు, ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనాలన్నా, ఖర్చులు పెట్టాలన్నా భార్య అనుమతి తప్పనిసరి అని నవ్వుతూ ఒప్పుకున్నారు. వెంటనే అక్కడికక్కడే అందరి ముందూ తన మొబైల్ తీసి, భువనేశ్వరి గారికి ఫోన్ చేశారు.
అయితే, ఇక్కడే మన సీఎం గారు ఒక సాదాసీదా అమాయక భర్త లెక్కన పప్పులో కాలేశారు! ఎందుకంటే... సరిగ్గా ఈరోజే ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు!
ఆ విషయం మర్చిపోయి.. పైగా స్పీకర్ ఫోన్ ఆన్ చేసి, ఆమెనే పర్మిషన్ అడిగి, జేబులోంచి డబ్బిచ్చి మరీ ఆ ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ నూనె కొన్నారు బాబు గారు!
సాధారణంగా భార్య పుట్టినరోజు వస్తే ఏ భర్త అయినా వజ్రాల హారం, పట్టుచీరలు లేదా ఖరీదైన కానుకల గురించి ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇవ్వాళ ఆయన ఇంటికి వెళ్ళాక జరిగే హోం మినిస్టర్ నుండి వచ్చే రిటర్న్ గిఫ్టులు మనం ఈజీగా ఊహించుకోవచ్చు:
"వావ్... నిజంగా మీరేనండీ! భార్య పుట్టినరోజున సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఒక లీటర్ వంట నూనె కొనిచ్చే ఏకైక మొగుడు బహుశా ఈ ప్రపంచంలో మీరే అయ్యుంటారు!" అని భువనమ్మ అనడం గ్యారెంటీ!
హాస్యాన్ని పక్కన పెడితే...
బాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి రైతుల్లో పెద్ద నవ్వుల్ని, ఉత్సాహాన్ని నింపింది. పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ, భూసారాన్ని పెంచేలా నాగభూషణం చేస్తున్న సేంద్రీయ వ్యవసాయాన్ని సీఎం ఎంతో అభినందించారు. జీవామృతం, వేపాస్త్రం తయారీ కేంద్రాలను పరిశీలించి, తోటలో స్వయంగా కోసిన బొప్పాయి పండును రుచి చూశారు.
ఏది ఏమైనప్పటికీ, భార్య పుట్టినరోజు నాడు ఒక సామాన్య రైతు దగ్గర నూనె కొనుగోలు చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచారు సీఎంగా. మరి ఈ 'అమాయక భర్త ముచ్చట' పై భువనమ్మ గారి అసలు రియాక్షన్ ఏంటో.. ఆమె ఎప్పుడో ఒకప్పుడు నోరు విప్పేదాకా వేచి చూడాల్సిందే!
@ncbn@ManagingTrustee
నాదెండ్ల అంగన్వాడీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. కేంద్రంలో ఉన్న పిల్లలు, ఆవరణలో పెంచుతున్న మొక్కలు, ప్రభుత్వం అందిస్తున్న ఆహారం గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
#ChandrababuNaidu#AndhraPradesh