జనసేన: మేము ఆంధ్రాలో కాంగ్రెస్ను గెలవనివ్వలేదు!
కాంగ్రెస్: సరే… మేము ఓడిపోయాం. మరి నువ్వు రెండు చోట్ల గెలిచావా?
జనసేన: మీరైతే అసలు గెలవలేదుగా!
కాంగ్రెస్: నువ్వు ఇంటర్ పాస్ అయ్యావా బాబూ? 😂
జనసేన: .......... 🏃♂️💨
వైసీపీ: అరేయ్… అసలు మీ ఇద్దరినీ కొట్టింది మేమే కదా!
మేము కొడితే ఒక పార్టీని రాష్ట్రం నుంచి తరిమేశాం… ఇంకో పార్టీ అధినేతను రెండు చోట్లా ఓడించాం! 🔥
#PawanKalyan గారు… త్రినాథ్ కుమార్, రాఘవేంద్రనాయుడు, పృథ్వీ…పై కేసు పెట్టకండని ఎందుకు ఆదేశాలు ఇచ్చారు?
ఈ ముగ్గురికీ మీకున్న సంబంధం ఏమిటి?
మీతో వారికి ఉన్న సాన్నిహిత్యం ఏమిటి?
మీ పేరు చెప్పుకుని తిరిగే వీరు వైయస్ జగన్ గారి కుటుంబంపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు కాకుండా తెరవెనుక మీరు చేస్తున్న కుట్రల వెనుక ఆంతర్యం ఏమిటి?
మీ వ్యక్తిగత జీవితంపై ఎవరైనా మాట్లాడితే వ్యక్తిగత గోప్యత, మహిళల గౌరవం, సంస్కారం గుర్తుకొస్తాయి. మరి వైయస్ జగన్ కుటుంబానికి ఆ గౌరవం ఇవ్వాలని మీకు తెలియదా?
మీరు మాట్లాడే సనాతన ధర్మం, మహిళా గౌరవం, సంస్కారం మీ వ్యక్తిగత రాజకీయాల కోసమేనా?
పవన్ గారూ… మైక్ ముందు నీతులు చెప్పడం కాదు… మీకు సన్నిహితులైనా సైకో మూకల వ్యవహారంపై సమాధానం చెప్పండి.
న్ను ఇబ్బంది పెట్టిన వారిలో ఎవరినీ వదలను.
2.Oలో మీ అందరికీ బుద్ధి చెబుతా
నేను జైలులో ఉన్నా నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. – కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి.
విజయనగరం జిల్లా మొత్తంలో తెలుగుదేశంకి, వైఎస్సార్సీపీకి తేడా కేవలం 6800 ఓట్లు మాత్రమే
గాలి శాశ్వతం కాదు, కృషే శాశ్వతం
ఓడినా, గెలిచినా ఎందుకు ఓడిపోయామో ఆలోచించుకోండి, మీ తప్పులు సరిచేసుకోండి
సర్పంచ్ ఎలక్షన్ చాలా కీలకం. ముందు మీరు నాయకులు అవ్వాలి, మీ గౌరవం పెరగాలి
మీకు ఏ కష్టం వచ్చినా - పెళ్లైనా, చావైనా, ఏ అవసరమైనా నేను ఉన్నా, మీ గౌరవాన్ని కాపాడుతా
సర్పంచ్ లో ఏకగ్రీవం మాత్రం ఇవ్వకండి
-బొత్స సత్యనారాయణ
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
అన్ని అల్లర్లు, అరాచకాలు చేసిన ఎలక్షన్ రిజల్ట్స్ YSRCP కి అనుకూలంగా ఉన్నాయి ప్రజల్లో అధికార పార్టీ పై వ్యతిరేకత భారీ గా ఉంది
ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కీలకం ఇంచార్జి లు ఇంకొంచెం సీరియస్ గా తీసుకుంటే ఇందులో కూడా YCP దే హవా