#YcpCriminalPolitics
మరోసారి బయటపడ్డ గొడ్డలి పార్టీ డ్రామాలు..
నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య, వైఎస్సార్సీపీ నాయకుల అనుచరుడని పోలీసులు గుర్తించారు. సొంత కార్యకర్తలతోనే విగ్రహాల ధ్వంసం చేయించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న గొడ్డలి పార్టీ వైఎస్సార్సీపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
#PsychoFekuJagan
#AndhraPradesh
#PsychoFekuJagan
తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైకాపా ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో మార్చి 30న టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక లబ్ధిదారుకు ఇచ్చిన హామీ ని వక్రీకరించి కొందరు అప్పటి లో తప్పుడు ప్రచారం చేశారు. వారికి AP Government Fact Check ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్లీ తాజాగా అదే అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్ర స్థాయి పర్యటనతో పనుల తీరును పరిశీలించాను. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద మంత్రులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించాను. కూటమి ప్రభుత్వంలో పనులను గాడిన పెట్టి వేగవంతం చేసిన కారణంగా ఇప్పటి వరకు ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులతో పాటు ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించాను. 2027 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చి.....రైతన్నల సాగునీటి కష్టాలు తీరుస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, పరస్పర సహకారంతో పోలవరాన్ని రాష్ట్రానికి వరంగా మారుస్తాం.
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాలుగా గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. కవిత్రయం నుంచి శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు తెలుగు భాషకు వైభవాన్ని చేకూర్చిన కవులను, సాహితీవేత్తలను, మహనీయులను స్మరించుకున్నాం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నాం. భాష ఉంటేనే జాతి ఉనికి ఉంటుంది. మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించేది మన తెలుగు భాషే. మన మాతృ భాష తెలుగు పరిరక్షణకు, వైభవానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సభికుల కోరిక మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం అని ప్రకటించాను. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలన్న విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటాం.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు ఆయన. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన మహనీయుడు ఆయన. తన ప్రాణాలను కూడా లెక్కచేయని ఆయన త్యాగం మనలో స్ఫూర్తి నింపాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కమారు నివాళి అర్పిస్తున్నాను.
Deeply saddened to hear about the passing of Dharmendra ji…
An era he defined can never be replaced and the warmth he brought to Indian cinema will stay with us forever.
My heartfelt condolences and prayers to the entire family.
పవిత్ర స్థలంలో గోవిందా నామాలు పలకలిసిన దగ్గర ఇలా జగన్ మోహన్ రక్షక అని అన్నారు అందరి ముందు
ఇక చాటుగా లడ్డులో కల్తీ నెయ్య్ కలపకుండా ఉంట్టారు 🤐
ఇక అంతే వెంకన్న స్వామి చూసుకుంటాడు 🙏