Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Every child has the right to safety, dignity and justice.
Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Sri @PawanKalyan Garu has written a letter to the Hon'ble Chief Minister of Telangana,Sri @revanth_anumula garu, urging stronger and more effective implementation of the POCSO Act, 2012.
The letter puts forward key suggestions on time-bound investigation, victim protection, evidence preservation and effective monitoring to ensure timely justice and stronger protection for every child.
#POCSO
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
మన్యం వీరుడు, విప్లవకారుడు, బ్రిటీష్ వారి బుల్లెట్లకు రొమ్ము విరిచి ఎదురు నిలిచిన వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#AlluriSeetaramaRaju
Congratulations to Praggnanandhaa for this remarkable feat!
This is indeed an incredible milestone that highlights his continued excellence.
My best wishes to him for his future endeavours.
@rpraggnachess
మీ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖల అభివృద్ధి ఇది
•తన శాఖల పరిధిలో నియోజకవర్గాలవారీగా చేపట్టిన అభివృద్ధి పనులతో బుక్ లెట్లు సిద్ధం చేసిన ఉప ముఖ్యమంత్రి
•అసెంబ్లీలో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు బుక్ లెట్ లు అందజేసిన శ్రీ @PawanKalyan గారు
•తొలి ప్రతిని గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారికి అందజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•స్పీకర్ గారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 312 కోట్ల మంజూరు
•ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంకి రూ. 487 కోట్ల కేటాయింపులు
• పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం
• పల్లెల అభివృద్ధి… పచ్చదనం పెంపు… పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో తన పరిధిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో ప్రత్యేక బుక్ లెట్ ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. నియోజక వర్గాలవారీగా నిధుల కేటాయింపు, పనుల పురోగతిని వివరించే నివేదిక పుస్తక రూపంలో రూపొందించి సంబంధిత నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు అందజేసే కార్యక్రమం మొదలైంది. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో… పల్లెల అభివృద్ధి… పచ్చదనం పెంపు… పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖలను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు.
శుక్రవారం శాసనసభలో ఈ బుక్ లెట్ ను మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా గ్రామాల్లో వేసిన సిమెంటు రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్, నీటి తొట్టెల వివరాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల వివరాలు పొందుపరిచారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు నియోజకవర్గాల వారీగా పంచాయతీలకు ఎంత మొత్తం విడుదల చేశామన్న అంశాన్ని కూడా బుక్ లెట్ లో పొందుపరిచారు. కూటమి పక్షాల ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు చేసిన కేటాయింపులకు కూడా పుస్తకరూపం ఇచ్చారు.
•గౌరవ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి తొలి ప్రతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేరిట రూపొందించిన ఈ బుక్ లెట్ తొలి ప్రతిని గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ ఛాంబర్ కు స్వయంగా వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో రూ. 312 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. పల్లెపండగ 1.0కి రూ. 36.21 కోట్లు, పల్లెపండగ 2.0 ద్వారా రూ. 58.85 కోట్లు ఖర్చు చేసి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 43.83 కోట్లతో పనులు చేపట్టినట్టు, 15వ ఆర్ధిక సంఘం నిధులు మరో రూ. 173.53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మలి ప్రతిని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అందజేశారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో మొత్తం రూ. 168 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అందులో పల్లెపండగ 1.0 కింద రూ. 3.80 కోట్లతో 37 సీసీ రోడ్లు, 44 గోకులాలు, 4 ఫారం పాండ్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్ లో జనసేన ఎమ్మెల్యేలకు ప్రతులు అందజేశారు.
•ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పనులకు రూ. 487 కోట్లు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలో రూ.487 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాఖల ద్వారా చేపట్టారు. అందులో పల్లెపండగ 1.0 ద్వారా రూ. 46.71 కోట్లు ఖర్చు చేశారు. పల్లెపండగ 2.0కి రూ. 138 కోట్లు, జల్ జీవన్ మిషన్ పనులకు రూ. 7.12 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 185.89 కోట్లు ఆ నియోజకవర్గ పరిధిలో పంచాయతీలకు బదిలీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ. 110 కోట్లు ఇచ్చారు.
ఈ ప్రక్రియలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ గిరిజన ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అత్యధికంగా కేటాయింపులు చేశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తొలి మాసాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయించారు. పల్లె పండగ 1.0 ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల అంతర్గత రహదారులు, 22,514 మినీ గోకులాలు, 1,02,000 ఫారం పాండ్స్, 15,000 నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 65 వేల ఎకరాల్లో పండ్ల తోటలు నాటించారు. పల్లెపండగ 2.0లో రూ. 5,715 కోట్ల నిధులతో గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, 15,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, ఫారం పాండ్స్, నీటితొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు నాటే ప్రక్రియ పూర్తి చేశారు. రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులుతో 4,122 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అడవితల్లిబాట కార్యక్రమం ద్వారా రూ. 1,005 కోట్ల నిధులుతో గిరిజన గ్రామాల్లో 1,021 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. తద్వారా 625 ఆవాసాలకు తొలిసారి రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులతో పాటు మానవ వన్యప్రాణి సంఘర్షణను నివారించేందుకు హనుమాన్ లాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నారు.
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మూడవ రోజు సభలో గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రసంగించి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan@governorap@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
#APAssembly
I am humbled and honoured to be conferred the Padma Bhushan. The India of today is unrecognisable from the one I was born in. The journey has been exhilarating. On this Republic Day, we stand at the fork of many roads. I choose the path of karma with a sense of paranoia, with aspiration but conscious of ground realities. I have deep conviction that we, the people will make India even greater. We have miles to go before we sleep…
Saluting the gallant heroes of the Indo-China War!
Today we remember the brave Indian soldiers who made the ultimate sacrifice for our nation's security during the 1962 Indo-China War - @PawanKalyan
Jai Hind! 🇮🇳🕊
#NationalSolidarityDay#IndoChinaWar#JaiHind#IndianArmy
My heartfelt thanks to you Hon. PM Shri @narendramodi ji for your good wishes. Your Dharmic spirit and exemplary leadership skills inspire all of us to work towards the integrity and growth of our Nation.
Truly grateful to Hon’ble @HMOIndia Sri @AmitShah Ji for your warm greetings and kind words. Under your leadership and relentless efforts, Bharat stands stronger and more secure. And we are taking forward the vision of Hon. Pm Modi ji’s ‘Vikasith Bharat’ and giving our best for a stronger and resilient NDA Govt.
జన్మదిన సందేశంతో పాటుగా, మీ మాటలతో ఆత్మీయతను చాటిన గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుదీర్ఘ పరిపాలన అనుభవం కలిగిన మీ నాయకత్వంలో, మీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా పయనించడం సంతోషంగా ఉంది. Thank you Sir.
I extend my heartfelt gratitude to Hon’ble @governorap Sri S. Abdul Nazeer Ji for your warm greetings and kind blessings on my birthday. Your wishes inspire me to continue serving the people with greater dedication, while upholding the values of our Constitution.
నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ @KChiruTweets గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు @JanaSenaParty ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను...
మీ తమ్ముడు