ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స..!
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు.
2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో వారి సంక్షేమం, అభివృద్ధిపై చర్చించకుండా, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారినే వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలంగా నిలబడిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్‌తో ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తోంది.
రాష్ట్రంలో మత ఘర్షణలకు దారితీసేలా రావణ్, శ్రవణ్ మరియు ప్రకాష్ రాజ్ లు రాజకీయ ప్రేరేపిత అజెండాతో వ్యవహరిస్తున్నారు. వారి వెనుక వైసీపీ కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉపా (UAPA) కేసులో అరెస్ట్ అయిన రావణ్ వెనుక పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ ఉంది, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రావణ్ సన్నిహితురాలు గగన కలిసి మద్దతు కోరడం, ఆ బాధ్యతలను దేవినేని అవినాష్‌కు అప్పగించడంతో వీరి ముసుగు తొలగిపోయింది.
సనాతన ధర్మాన్ని కించపరచడం, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, రాష్ట్రంలో శాంతి, సామరస్యం, చట్టపరిపాలనను కాపాడేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతాం అని తెలియజేస్తున్నాను.
@PawanKalyan@JanaSenaParty
Dear @dhanyarajendran You claimed that Jalsa glorifies Naxalism. That conclusion reflects either a complete misunderstanding of the film or a selective reading of a few isolated scenes.
If you don’t understand Telugu or the narrative context, consult someone who does before making sweeping claims.
The film does not glorify Naxalism. It portrays the journey of a young man who is drawn into extremism, experiences its consequences, and ultimately abandons that path to return to normal civilian life. That transformation is the very heart of the story.
Cherry-picking a handful of scenes while ignoring the overall narrative to fit a predetermined conclusion is not criticism but a selective interpretation. Ironically, it is that selective blindness, not the film itself, that is distorting the discussion.
*ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స*
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
*పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...*
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
కళలను కాపాడాలంటే కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందే.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు వరుసగా మూడో రోజు చేనేత, హస్తకళల కళాకారుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల ద్వారా నాలుగు క్లస్టర్లలో దాదాపు 650 మంది కళాకారులు ఆరోగ్య సేవలు పొందారు.
కళాకారుల సంక్షేమమే కళల పరిరక్షణకు బలమైన పునాది అని మరోసారి నిరూపించిన గొప్ప కార్యక్రమం.
పిఠాపురం PADA office వద్ద జిల్లా collector గారి ఆధ్వర్యంలో
OneMonth-oneVillage-4Visits కార్యక్రమం👏🏻
కబ్జాకు గురైన 43.80 ఎకరాల కుంతీమాధవస్వామి దేవస్థానభూములు తీసుకురావాలి🙏🏻
నిధులు కేటాయించి కుంతీ మాధవస్వామి దేవాలయ కోనేరు శుభ్రపరచినందుకు గౌ! @PawanKalyan
గారికి ధన్యవాదాలు🙏🏻
Warm birthday greetings to Hon'ble Minister of State for Home Affairs, Sri @bandisanjay_bjp Garu.
May Kondagattu Anjaneya Swamy bless you with good health, strength and a long life as you continue to serve the people of Telangana and the nation - @PawanKalyan@PIBHomeAffairs@BJP4Telangana
జులై 3న బందరులో కేసు పెడతారని జూన్ 24న రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ప్రకటించారు అంటావా @perni_nani 🤡
బందరు ఎందుకొచ్చారో అడగడానికి నువ్వెవరు ?
బందరుకి ఎవరైనా రావచ్చు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు అయినా చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరూ నీకొచ్చి సమాధానం చెప్పాలా ?
పదవి పోయి ఖాళీగా ఉన్నావ్ ఏదైనా పార్టీకి పనికొచ్చే పనులు చేసుకోక మీడియా ముందుకొచ్చి నీ మిడిమిడి జ్ఞానంతో పెద్ద రాజకీయ పండితుడి లాగా ఈ విజ్ఞాన ప్రదర్శనలు ఎందుకు ?
వచ్చేసారి కాదు ఇకపైన మీకు బందరు ప్రజలు అవకాశం ఇవ్వరు అని తెలిసి కూడా ఎందుకు ఆత్మ వంచన చేసుకుంటావ్?
గౌ! @PawanKalyan గారికి ముంబై లో శస్త్రచికిత్స జరుగుతున్నందుకు
ఆయన త్వరగా క్షేమంగా కోలుకోవాలని ముంబై నగరంలో నివసించే మన తెలుగు వారు వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు 🙏🏻
Get Well Soon #PawanKalyan Garu 🙏🏻💐❣️
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan