Under the visionary leadership of PM Shri @narendramodi Ji, India’s march towards Aatmanirbhar Bharat in defence manufacturing is becoming stronger with every milestone.
Grateful to Defence Minister Shri @rajnathsingh Ji for spearheading the Ground Breaking and Foundation Stone laying ceremonies for strategic aerospace & defence projects in Puttaparthi, Andhra Pradesh.
These projects will strengthen our armed forces, boost indigenous manufacturing, generate employment and position Andhra Pradesh as a major defence and aerospace hub for the future. 🇮🇳
సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు SCE (Singapore Cooperation Enterprise)లో జరిగిన కీలక సమావేశాల్లో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను. సింగపూర్ మాజీ సివిల్ సర్వీస్ హెడ్ మిస్టర్ పీటర్ హో నేతృత్వంలో జరిగిన "Whole-of-Government Approach" సెషన్లో పాల్గొన్నాము. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఒకే లక్ష్యం కోసం ఎలా పని చేయాలి, సంక్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలి అనే అంశాలపై అధ్యయనం చేశాము.
#SingaporeVisit #WholeOfGovernment #Leadership #Governance #APDevelopment @BJP4Andhra
Sweden sending its fighter jets to escort PM Shri @narendramodi Ji’s aircraft as he lands in Sweden.
A powerful symbol of the respect and stature India commands globally under PM Modi Ji’s leadership. From strategic partnerships to diplomatic influence, India’s voice is stronger than ever on the world stage..🇮🇳🇸🇪
Delighted to share that a kidney transplantation has been successfully performed at an AP Govt Hospital on March 13 in a remote area inhabited by people with kidney diseases in Srikakulam dt.
I compliment the team of doctors led by veteran nephrologist Dr Ravi Raj for this feat at Kidney Research Centre and Super Specialty Hospital, Palasa.
27 year old Hemasri got a new lease of life with her father Mohana Rao being donor. My compliments and best wishes to both of them.
AP govt rededicates itself for the well being of people of the area afflicted by kidney issues.
ఆహార కల్తీ.. ముఖ్యంగా పాలు, పాల పదార్థాల కల్తీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మనం రోజూ తాగే పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి ఇవి శాపంగా మారుతున్నాయి.
అయితే పాలలో కల్తీని ఇంట్లోనే సులభంగా పరీక్షించే పద్ధతులు చాలా ఉన్నాయి. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వం ఆహార కల్తీ నియంత్రణకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మన వంతుగా అవగాహన పెంచుకోవడం.. ఇంట్లోనే పరీక్షలు నిర్వహించడం మంచిది. అప్పుడే కల్తీని అరికట్టగలుగుతాం.
కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల పాలు కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోండి. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857 కు సంప్రదించవచ్చు. అప్రమత్తంగా ఉండండి.. పాల కల్తీని గుర్తించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
#FoodSafety #MilkAdulteration #HealthTips #PublicAwareness #HealthIsWealth #ConsumerSafety @BJP4Andhra
బీజేపీ సీనియర్ నాయకులు కావూరు సాంబశివరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఐదుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించి ప్రజాసేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. నిర్మాణ రంగంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
కావూరు సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, వారి ఆత్మకు భగవంతుడు సద్గతులు కలిగించాలని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతి!!
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సైమా హోటల్ నుంచి ఆర్వీజే ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, శాసన సభ్యులు శ్రీ పార్థసారథి గారు, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జీఎం శేఖర్ గారి తో కలసి యాత్రను ప్రారంభించాను.
ఆధ్యాత్మికత, సమైక్యత, క్రమశిక్షణకు ఈ యాత్ర ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించింది. పార్టీ క్షేత్ర స్థాయి బలాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు చేస్తున్న కృషిని ఈ యాత్ర తెలియజెప్పింది.
న్యూఢిల్లీలో కేంద్ర రావాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి శ్రీ @nitin_gadkari గారితో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారితో కలిసి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యాను. శ్రీ సత్య సాయి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ రహదారుల విస్తరణ, కొత్త మార్గాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగింది.
రాష్ట్రంలో రూ.9,500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కోసం ఆగస్టు 2న రాష్ట్రానికి నితిన్ గడ్కరీ గారు విచ్చేస్తున్నారు. ఈ పర్యటన ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించాను. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించాము.
@BJP4India@BJP4Andhra #NDA
Turmeric is more than a spice, it’s a natural antibiotic, anti-cancer, and anti-inflammatory agent.
While inaugurating the #NationalTurmericBoard HQ in Nizamabad, Telangana, HM Shri @AmitShah ji highlighted its medicinal value and global demand, aiming for $1 billion in exports by 2030.
విజయవాడలోని @BJP4India రాష్ట్ర కార్యాలయంలో జరిగిన "11 Years of Modi Government - Sankalp Se Siddhi" కార్యశాలలో పాల్గొన్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సారథ్యంలోని #NDA ప్రభుత్వం 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశాను.
ప్రధాని మోదీ గారి పాలన దేశ సమగ్ర ప్రగతికి అంకితమైంది. జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమం, డిజిటల్ పరివర్తన, పేదరిక నిర్మూలన దిశగా సాగింది. దేశం ఆర్థికంగా బలపడింది. నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది.
ప్రధాని మోదీ పాలనలో.. పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు 4.50 కోట్ల ఇళ్లను కట్టించారు. మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయుష్మాన్ భారత్ తో 50 కోట్ల మందికి పైగా ఆరోగ్య భరోసా కల్పించారు.
రైతుల కోసం పీఎం కిసాన్, సాయిల్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ తెచ్చారు. మహిళల ఆత్మాభిమానం నిలిపేలా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించారు. ఉచిత వంట గ్యాస్, జన్ ధన్ యోజన, ముద్ర వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మన యోగాకు ప్రపంచ ఖ్యాతి తెచ్చారు.
"సబ్ కా సాథ్ సబ్ కా విశ్వాస్" మంత్రంతో సమ్మిళితమైన, అభివృద్ధి ప్రధానమైన, అవినీతి రహితమైన పాలనను ప్రధాని మోదీ అందిస్తున్నారు. అందుకే ఆయన్ని ప్రపంచం విశ్వ నాయకునిగా కీర్తిస్తోంది.
గౌరవ ప్రధానమంత్రి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను, వాటి ప్రయోజనాలను వివరించాలి. "వికసిత్ భారత్" నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
@BJP4Andhra #vikasitbharat
ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లెలో శ్రీరాముల గ్రామ ఉత్సవ ఎడ్లబండ్ల పోటీలు తిలకించాను. పాడిపంటలతో పల్లెలు కళకళలాడాలని కోరుకుంటూ జరుపుకునే మొలకల పున్నమి పండగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం ఉల్లాసం, ఉత్సాహం పంచాయి. మన సంస్కృతి, సంప్రదాయాన్ని తెలిపే గ్రామీణ క్రీడల్ని భద్రంగా భవిష్యత్ తరాలకు అందించాలి.
#BullockCartRace #Nagareddipalli #Dharmavaram #bjpandhrapradesh #nda #bjp4india #AndhraPradeshGovt
India’s Pharma Sector: Healing the World, Empowering Bharat.
A snapshot of how the Modi Government is transforming healthcare:
- 7.8% Growth in April 2025 – Driven by global demand and innovation.
- ₹4.17 Lakh Cr Turnover (2023-24) – Over 10% annual growth for 5 years.
- Global Leadership:
• 3rd in production volume, 14th in value
• Supplies 20% of global generics • Meets 55–60% of UNICEF’s vaccine needs
• 99% of WHO’s DPT, 52% of BCG, 45% of measles vaccines.
- PMBJP – 15,479 Jan Aushadhi Kendras provide meds up to 80% cheaper.
- PLI Schemes:
• ₹15,000 Cr for high-end drugs (cancer, diabetes)
• ₹6,940 Cr for APIs like Penicillin G
• ₹3,420 Cr for medical devices.
- Bulk Drug Parks (₹3,000 Cr) – Hubs in Gujarat, Himachal Pradesh, Andhra Pradesh.
- SPI Scheme (₹500 Cr) – Boosting R&D and lab infrastructure.
- ₹12,822 Cr FDI (2023-24) – Strong global investor confidence.
- 100% FDI Allowed – In greenfield pharma & med-tech projects.
India is building a healthier, self-reliant future — making affordable medicines for Bharat and the world.
Modi Government = Affordable healthcare, job creation, global leadership
#ధర్మవరం నియోజకవర్గం పోతుకుంటలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించాను. రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా బీసీ కాలనీలోని 500 కుటుంబాలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. అంతకుముందు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను.
#ROWaterPlant #Pothukunta #Dharmavaram @BJP4Andhra
విజయవాడలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త సంబంధిత (తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా) రుగ్మతలపై జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షలో పాల్గొన్నాను. ముందస్తు రోగ నిర్ధారణ, సంరక్షణ ప్రణాళికలు, రక్త వ్యాధుల సమగ్ర నిర్వహణ కోసం విధానాల రూపకల్పనపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమం రక్త సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది. బాధితులకు స్క్రీనింగ్, చికిత్స అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
#HealthReview #Thalassemia #PublicHealth #AndhraPradesh @ArogyaAndhra@BJP4Andhra
ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్లో “బటర్ఫ్లై ఫోటో షూట్” ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాను. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సృజనాత్మక కార్యక్రమం యువతను సైతం పర్యావరణ పరిరక్షణ వైపు ఆకర్షిస్తుంది. సమాజంలో కూడా సానుకూల మార్పును తెస్తుంది.
అలాగే ఎర్రగుంట్లలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాను. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి. అప్పుడే పరిశుభ్రమైన వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని భవిష్యత్ తరాలకు అందించగలం. @bjp4andhra #butterfly #plantation #photoshoot
ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్మించనున్న రోడ్లు, కాలువలు, ప్రభుత్వ స్థలాలకు కంచె నిర్మాణ పనులకు భూమి పూజ చేశాను. వీటి కోసం ప్రభుత్వం రూ.3.35 కోట్లు కేటాయించింది. పనులు నాణ్యతతో, త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించాను.
#InfrastructureDevelopment #Dharmavaram
#BJP4INDIA #NDA #BjpAndhrapradesh