వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులైన శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారికి, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారికి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నల్లప్పగారి వెంకట గౌడ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సేవలు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాలని కోరుకొంటున్నాను. పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి, వైఎస్సార్సీపీకి విజయాన్ని చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను.
#Ysrcongressparty #ysrcptirupati #Tirupatidistrict #Andhrapradesh
Is the ED @dir_ed still an independent central agency, or has it become an extension of @ncbn 's coalition government’s SIT?
The pattern is brazen and deeply troubling: details of notices and raids surface first as “exclusive” scoops in Yellow Media, and then, almost on cue, the ED follows the same script hours later. The ED is dancing to Chandrababu Naidu’s tunes in the foisted liquor and other cases, carrying forward his government’s SIT narrative and targeting YSRCP to serve his political interests and settle scores with the opposition.
If an investigative agency starts looking less like an independent institution and more like an instrument of political vendetta, the public is left with a serious question: are we witnessing an investigation or state-sponsored theatre?
Institutions earn public trust through independence, transparency, and due process. Once they are replaced by political scripts, that trust is the first casualty.
@ndtv@IndiaToday@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@thewire_in@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic
Democracy can stand only when people have complete confidence in constitutional institutions such as the Election Commission. National media reports that two Election Commissioners raised objections on several occasions to decisions, electoral rolls and the management of ECINet have led to serious questions and doubts among the public.
Rather than an exchange of allegations, the public needs clarity on what objections were recorded, what action was taken on them, and how transparently the system functioned, be it for adding, deleting or restoring names on electoral rolls. Steps are needed to give people confidence on these matters.
Ultimately, we must strengthen public trust in the electoral process, protect every citizen’s right to vote, and strengthen the systems that allow people to exercise that right without fear.
In a democracy, transparency should not only prevail but should also appear to have prevailed. The very bill (Chief Election Commissioner and other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 ) which had our support then, should be revisited now in the current background. The Central government (Ruling Party) should come forward, set the normal in place dispelling this fear. An amendment to the bill be brought forward where the election commissioner is appointed by the three member committee which has Leader of Opposition (LoP), Chief Justice of India (CJI) and the Prime Minister as members once again. Student appointing the examiner is always prone to allegations even though the examiner is thoroughly honest and it is always better replacing the process with someone neutral. This move would definitely regain the esteem and the confidence in the Election Commission
This is especially important because, during the SIR process in Andhra Pradesh, the party in power misused its authority. On many occasions, our appeals went unheard. In the local body election process too, our objections as an Opposition party to the manner in which divisions were redrawn were brushed aside. Such actions undoubtedly weaken public confidence in the electoral process. Transparency and accountability are the true measures of how any institution functions in a democracy, and safeguarding them is that institution’s primary duty.
@ECISVEEP
చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా నాన్నగారు మద్దిల మునికృష్ణయ్య గారి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకుని, మాకు ధైర్యం చెప్పిన @YSRCParty అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబం పట్ల ఆయన చూపిన ఆప్యాయత, శ్రద్ధ మాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. నాన్నగారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ‘అంతా మంచే జరుగుతుంది, ధైర్యంగా ఉండండి’ అని భరోసా ఇచ్చిన @ysjagan గారికి నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#YSJaganMohanReddy #YSRCongressParty #mptirupati #TirupatiMP #MaddilaGurumoorthy #AndhraPradesh
Andhra Pradesh’s development should not mean centralisation in Amaravati.
I welcome the proposal for a new NIELIT centre in Amaravati focused on Quantum Technologies and Artificial Intelligence.
But the already sanctioned permanent NIELIT centre with Deemed to be University status must remain in Tirupati.
Tirupati has the ecosystem, institutions and talent to emerge as a major hub for electronics, semiconductors, cyber research and advanced technical education.
Andhra Pradesh can and must have both: NIELIT Tirupati and a new NIELIT centre in Amaravati.
Decentralised development will make Andhra Pradesh stronger.
Detailed article @ThePrintIndia 👇
https://t.co/BNwaNuRhDM
#NIELIT #Tirupati #AndhraPradesh #Amaravati #Technology #DecentralisedDevelopment #ThePrint #maddilagurumoorthy #mptirupati
What a magnificent victory for Team India! 🇮🇳
A thrilling win over Pakistan in the Asian Games Cricket Final to clinch the Gold Medal!
Heartiest congratulations to our champions for their outstanding performance, fighting spirit and determination. A proud moment for every Indian! 🇮🇳
@BCCI@WeAreTeamIndia
#TeamIndia #AsianGames2026 #IndiaVsPakistan #GoldMedal #Cricket #JaiHind
శ్రీ సిటీ పేలుడు ఘటనపై ఎంపీ గురుమూర్తి దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
తిరుపతి, అక్టోబర్ 3:
శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం సంభవించిన భారీ పేలుడు ఘటనపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వస్తున్న ప్రాథమిక సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
పరిశ్రమలో నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు కూడా ప్రమాద సమయంలో అక్కడే ఉన్నట్లు వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఎంపీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే అత్యున్నత వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు.
ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అవసరమైన సహాయాన్ని అందించాలని ఆయన కోరారు.
#Adminpost #sricity #tirupatimp #Andhrapradesh
🇮🇳 మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు 🙏
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. దేశ సేవకు అంకితమైన మహనీయుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు.
దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ధైర్యం, దృఢ సంకల్పం, నిబద్ధతతో దేశానికి నాయకత్వం వహించిన మహనీయుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం.
“జై జవాన్.. జై కిసాన్” అనే ఆయన నినాదం సైనికుల పట్ల, రైతుల పట్ల దేశం చూపాల్సిన గౌరవం మరియు బాధ్యతకు నేటికీ స్ఫూర్తినిస్తోంది.
దేశం కోసం ఆయన చూపిన మార్గం, పాటించిన విలువలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ..
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు.
#LalBahadurShastri #ShastriJayanti #JaiJawanJaiKisan #NationFirst #IndianLeadership #Tribute
అహింసే ఆయుధంగా, సత్యమే సిద్ధాంతంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్బంగా ఆయనకు నివాళులు.. ఆయన చూపిన బాటలోనే 2019-24 మధ్య పరిపాలనను ప్రజల గుమ్మం ముందుకు తెచ్చి గ్రామ స్వరాజ్యాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్ది గారు సాకారం చేశారు.
#GandhiJayanti
సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ అణచివేత చర్యలు అభ్యంతరకరం: ఎంపీ గురుమూర్తి.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళనకు దిగితే వారిపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలాన్ని ప్రయోగించడం తీవ్ర అభ్యంతరకరమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి గొంతును అణచివేసేందుకు నిర్బంధాలు, లాఠీచార్జ్‌లకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విజయవాడలో తమ సమస్యలను చెప్పుకునేందుకు శాంతియుతంగా నిరసన తెలిపే సచివాలయ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం, పలువురిని అదుపులోకి తీసుకోవడం, మహిళా ఉద్యోగుల పట్ల కూడా కఠినంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నాయని గురుమూర్తి అన్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను బలవంతంగా పోలీసు వాహనాల్లో తరలించడం మరింత ఆందోళనకరమన్నారు.
ఏడేళ్లుగా ప్రభుత్వ సేవల్లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, పెండింగ్ బకాయిలు, పదోన్నతులు, స్పష్టమైన పదోన్నతి మార్గం, సర్వీస్ సంబంధిత ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నారని ఎంపీ తెలిపారు. ప్రభుత్వం స్వయంగా కొన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్న సమయంలో ఉద్యోగులతో చర్చలు జరపకుండా ఆందోళనను అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. నోషనల్ ఇంక్రిమెంట్ల ఫైల్ ఆర్థిక శాఖకు పంపినట్లు ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిందని గురుమూర్తి గుర్తుచేశారు. అదే వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ హక్కుల కోసం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
ఉద్యోగులు ప్రభుత్వానికి శత్రువులు కాదని, ప్రభుత్వ పాలనలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే సిబ్బందని ఎంపీ అన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, పోలీసులతో అణచివేయడం సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగుల పట్ల గౌరవం, మర్యాద పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని గురుమూర్తి అన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తక్షణమే చర్చలు జరిపి, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, పెండింగ్ బకాయిలు, పదోన్నతులు, ఏఏఎస్ తదితర సమస్యలపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు వారి పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుందని ఎంపీ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.
#AdminPost #SecretariatEmployees
#JusticeForEmployees #StopEmployeeSuppression
#RespectWomenEmployees
#EmployeeRights
#SaveSecretariatSystem #TirupatiMP #maddilagurumurthy #YSRCP #Tirupati #AndhraPradesh
ఒత్తిడులకు లొంగని ధైర్యవంతుడు గురుమూర్తి.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశంసలు.
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చేస్తున్న పోరాటం అభినందనీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఎవరికీ లొంగకుండా ప్రజల పక్షాన నిలబడే ధైర్యవంతుడిగా గురుమూర్తి వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు.
సాయికృష్ణ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఎంపీ గురుమూర్తి, బాధిత కుటుంబానికి అండగా నిలిచారని నారాయణస్వామి తెలిపారు. సాయికృష్ణ తల్లి ఆవేదనను చూసి చలించిన గురుమూర్తి, ఈ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావాలని న్యాయపోరాటానికి ముందుకు వచ్చారని అన్నారు.
ఈ వ్యవహారంలో పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యల కోసం గురుమూర్తి హైకోర్టును ఆశ్రయించడంతో పాటు, తదుపరి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని తెలిపారు. సుప్రీంకోర్టులో సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు.
ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారి తరఫున నిలబడటం, అధికార వ్యవస్థను ప్రశ్నించడానికి వెనుకాడకపోవడం గురుమూర్తి ప్రత్యేకత అని నారాయణస్వామి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి నమ్మకమైన సహచరుడిగా మాత్రమే కాకుండా, ప్రజలకు కూడా విశ్వసనీయమైన ప్రజాప్రతినిధిగా గురుమూర్తి నిలుస్తున్నారని అన్నారు.
పార్లమెంట్‌లోనూ ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూ, పేదలు మరియు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడుతున్న గురుమూర్తి లాంటి ఎంపీ ఉండటం గర్వకారణమని నారాయణస్వామి అన్నారు.
“గురుమూర్తిని రెండో అంబేద్కర్గా చూస్తున్నాను. అంత ధైర్యంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అరుదు. ఆయనకు మరింత ధైర్యసాహసాలు, శక్తిని ప్రసాదించి పేద ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని నారాయణస్వామి అన్నారు.
#AdminPost #MaddilaGurumurthy #Narayanaswamy #JusticeForSaiKrishna #JusticeForPeople #YSRCP #TirupatiMP #AndhraPradesh
Heartiest congratulations to @ONGC_ and the entire team of scientists, engineers and field personnel on the successful discovery of natural gas in the deep waters of the Mahanadi Basin through the MDW-28 well. This encouraging discovery, with good gas flow and sustained reservoir pressure, marks a significant step forward in India’s pursuit of greater energy security. I commend the dedicated efforts of everyone involved and wish ONGC continued success in exploring India’s deep and ultra-deepwater frontiers. 🇮🇳
#ONGC #MahanadiBasin #EnergySecurity #SamudraManthan
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా ఆరాధిస్తారు. అలాంటి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేశారని సీఎం చంద్రబాబునాయుడు గారు ఆరోపిస్తే, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిజమే అని బలపరిచారు. అయితే నిజం ఏంటో , టీడీపీ, జనసేన పార్టీల భాగస్వామ్యంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని సీబీఐ, ఈడీ విచారణ సంస్థలు తేల్చి చెప్పాయి.
శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు పదార్థాలు లేనే లేవని మొన్న సీబీఐ, నేడు ఈడీ తేల్చి చెప్పడం ద్వారా కోట్లాది మంది హిందువులు మనసులోని భారాన్ని దించుకున్నారు. కానీ కొన్ని నెలలపాటు తీవ్ర ఆవేదనకు గురి చేసిన చంద్రబాబు గారు, పవన్‌కల్యాణ్ గారు, అలాగే టీడీపీ, జనసేన నేతలంతా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి, కోట్లాది మంది హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తిరుమలకు వెళ్లి దేవదేవుని ఎదుట తప్పైందని చెంపలేసుకోవాలి. ఇది యావన్మంది హిందువుల డిమాండ్.
#NoAnimalFatInTTDLaddu
#TruthRevealed #TirupatiLaddu
#Tirumala #SrivariLaddu #Tirupati #LordVenkateswara #TTD #MaddilaGurumoorthy #MPtirupati
870 Students crammed into five rooms at Vakadu Gurukulam
Students of the Dr B.R. Ambedkar Gurukulam at Vakadu in Tirupati district are reportedly facing severe hardship due to acute overcrowding and lack of basic infrastructure. After the government closed the Kota Gurukulam in Nellore district from August 1, around 250 students were shifted to Vakadu, which already had 621 students. As a result, nearly 870 students are now being accommodated in just five rooms, with around 100 students forced to sleep in a single room.
Students are reportedly struggling without adequate space to sleep, proper bathing facilities, dining arrangements and sufficient toilets. Long queues for toilets, overcrowded rooms and poor ventilation have made conditions unbearable. Distressed students have been calling their parents asking to be taken home. Unable to see their children suffer, several parents have begun obtaining Transfer Certificates and taking them back home. The crisis arose after the Kota Gurukulam was closed following the government's decision to convert it into a Centre for Excellence and redistribute its students among other residential schools. The decision, taken in the middle of the academic year without first ensuring adequate infrastructure at the receiving schools, has thrown the education of hundreds of students into uncertainty.
The YSR Congress Party strongly condemns the TDP-led coalition government and holds Education Minister Nara Lokesh responsible for this atrocious situation. Forcing hundreds of predominantly poor and Dalit students to live in overcrowded rooms without basic amenities is an unacceptable failure of the Education Department. YSRCP demands @naralokesh 's immediate resignation, taking responsibility for the crisis. The government must immediately provide adequate accommodation, toilets, bathrooms, dining facilities, classrooms and all other essential infrastructure to the affected students. It should also reconsider the closure of the Kota Gurukulam and ensure that no student's education or future is jeopardised by arbitrary administrative decisions.
@thewire_in@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress
Warm birthday greetings to the Hon’ble Prime Minister of India, Shri @narendramodi Ji.
I wish you good health, happiness and continued strength in your service to the nation. May the years ahead bring greater progress, prosperity and development to our country.
My best wishes to you on your 75th birthday.
#HappyBirthdayPMModi #NarendraModi #PrimeMinister #India
గురుకుల విద్యార్థుల సమస్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఎంపీ గురుమూర్తి లేఖ.
గురుకులాల విలీనంపై సమగ్ర విచారణ జరపాలి.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల పాఠశాలల విలీనంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, గౌరవం, వసతి సౌకర్యాల విషయంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు.
గురుకుల పాఠశాలలను విలీనంతో అక్కడ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని కోట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 500 మంది, విశాఖపట్నం గురుకులంలో 500 మంది, గుంటూరు తాడికొండ గురుకులంలో 500 మంది, విశాఖపట్నం జిల్లా మారికవలస ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 480 మంది, విద్యార్థులు ఉన్నట్లు లేఖలో వివరించారు. ఈ నాలుగు గురుకులాలో సుమారు 1,980 మంది విద్యార్థులు ఉన్నారని ఈ లేఖలో పేర్కొన్నారు.
గురుకులాల విలీనం కారణంగా విద్యార్థులకు సరిపడా వసతి సౌకర్యాలు లేక విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఉంచుతున్నారని, మరికొన్ని సందర్భాల్లో విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా సరిగా లేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రత, గౌరవం, విద్యా వాతావరణంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
*గురుకుల పాఠశాలల విలీనంపై సమగ్ర విచారణ జరపాలి*
గురుకులాలను విలీనం చేసే ముందు అక్కడి వసతి సామర్థ్యం, విద్యార్థుల సంఖ్య, అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా అనే విషయాలను పరిశీలించాలని ఎంపీ కోరారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, మానవ హక్కుల కమిషన్ వెంటనే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సంఖ్య, వసతి సామర్థ్యం, గదుల్లో ఎంతమంది ఉంటున్నారు, నిద్రించే సౌకర్యాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, వైద్య సదుపాయాలు, గాలి ప్రసరణ వంటి అంశాలను పరిశీలించాలని కోరారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, వసతి గృహ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని కూడా ఎంపీ కోరారు. గురుకుల పాఠశాలలు పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి కల్పించే ముఖ్యమైన విద్యా సంస్థలని, వాటి నిర్వహణలో విద్యార్థుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.
#AdminPost #MaddilaGurumoorthy #GurukulamStudents #TirupatiMP
#ChildRights #NCPCR #NHRC #MPTirupati
#EducationForAll #Tirupati #AndhraPradesh
తిరుపతిలో పూర్తిస్థాయి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థను ఏర్పాటు చేయాలి.
కేంద్ర మంత్రి జితన్ రామ్ కి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ.
తిరుపతి: తిరుపతిలో పూర్తిస్థాయిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
తిరుపతి పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఎంపీ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, మేనకూరు ఎస్ఈజెడ్, శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతోందన్నారు.
విద్యాసంస్థలకు, పరిశ్రమలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు తిరుపతిలో పూర్తిస్థాయి సీఐటీడీ ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. టూల్ డిజైన్, ఆధునిక తయారీ విధానాలు, ఇంజినీరింగ్ సాంకేతికతల్లో శిక్షణతో పాటు రోబోటిక్స్, డ్రోన్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత డిజైన్, మెట్రానిక్స్, అదనపు తయారీ సాంకేతికతలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించవచ్చని వివరించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సీఐటీడీకి ఉపకేంద్రం ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి సీఐటీడీ సంస్థ లేదని ఎంపీ తెలిపారు. తిరుపతిలో పూర్తిస్థాయి సంస్థను ఏర్పాటు చేస్తే విద్యార్థులు, ఉద్యోగార్థులకు అధునాతన సాంకేతిక శిక్షణ లభించడంతో పాటు స్థానిక ఎంఎస్ఎంఈలకు, పరిశ్రమలకు సాంకేతిక సహకారం అందుతుందని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతాలు తిరుపతిలో ఉండటం వల్ల పూర్తిస్థాయి సీఐటీడీ ఏర్పాటుకు తిరుపతి అనువైన ప్రాంతమని గురుమూర్తి తెలిపారు. ఈ సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, ఆవిష్కరణలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తాయని పేర్కొన్నారు.
స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తిరుపతిలో పూర్తిస్థాయి సీఐటీడీని అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక పరికరాలు, నిపుణులైన బోధనా సిబ్బంది, పరిశ్రమల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.
#AdminPost #CITD #Tirupati #SkillDevelopment #MSME #MakeInIndia #AtmanirbharBharat #TirupatiMP #MPTirupati #MaddilaGurumoorthy #AndhraPradesh
సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణకు వైఎస్సార్సీపీ పోరుబాట.
కూటమి సర్కారు నిర్లక్ష్యంపై ఉక్కుపాదం.
అరణియార్ ప్రాజెక్టు దుస్థితిపై రైతుల పక్షాన పోరాటం, పిచ్చాటూరులో భారీ ర్యాలీ.
కీలపూడి నుంచి అరణియార్ వరకు మహా ర్యాలీకి పిలుపు.
జలధార’ పేరుతో పచ్చ నేతల జేబులు నింపే యత్నం.
మండిపడ్డ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్.
పిచ్చాటూరు: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పరిరక్షించి, రైతులకు చివరి ఎకరం వరకు నీరు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, గూడూరు నియోజకవర్గ పరిశీలకులు బీరేంద్ర వర్మ,రాయలసీమ సాగునీటి పరిరక్షణ కమిటీ సభ్యుడు వేలూరు రాకేష్ హాజరయ్యారు. వీరికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.వి.భాస్కర్ నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేటీ హరిశ్చంద్రా రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ రాజు తదితరులు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. పిచ్చాటూరు మండల అధ్యక్షులు అధ్యక్షులు చలపతి రాజు ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కన్వీనర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని ఎంపీ విమర్శించారు. నీటి ప్రాజెక్టులపై సరైన శ్రద్ధ పెట్టి, దెబ్బతిన్న కాలువలు, గేట్లు, లాకులకు మరమ్మతులు చేపట్టి, అందుబాటులో ఉన్న నీటిని చివరి ఆయకట్టు వరకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న సమయంలో సాగునీటి ప్రాజెక్టులను మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సప్లై ఛానల్స్‌ను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి, మరమ్మతులకు గురైన కాలువలు, గేట్లు, లాకులను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు.
అరణియార్ ప్రాజెక్టు దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాలకే నీరు అందుతున్న పరిస్థితి ఉందని ఎంపీ తెలిపారు. కుడి కాలువ, ఎడమ కాలువ, మధ్య కాలువల్లో సమస్యలు ఉండటంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. గేట్లు, లాకుల సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో ప్రాజెక్టు ఆయకట్టు క్రమంగా కుంచించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అరణియార్ ప్రాజెక్టు సమస్యను రైతుల సమస్యగా భావించి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ నాయకుల సూచనల మేరకు రైతులతో కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.
ఈ నెల పిచ్చాటూరులో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్ది, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి పాల్గొననున్నారని ఆయన తెలిపారు. కీలపూడి నుంచి అరణియార్ వరకు మహా ర్యాలీ నిర్వహించి, అరణియార్ ప్రాజెక్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయకట్టు పరిధిలోని రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలిసి అరణియార్ డ్యాంను సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
‘జలధార’ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, మరమ్మతుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేసి పచ్చ నేతల జేబులు నింపే ప్రయత్నాలు చేస్తున్నారని నూకతోటి రాజేష్ మండిపడ్డారు. రైతులకు వాస్తవంగా ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అరణియార్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
#AdminPost #TirupatiMP #rayalaseemaprojects #MaddilaGurumoorthy #AndhraPradesh #Tirupati #araniyar