ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్‌లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
మన రాజధానిలో తాడికొండ నుంచి పెద్దపరిమి వెళ్లే రోడ్డు.కార్లు కింద రోడ్డుకు తగులుతున్నాయి @naralokesh
అన్న ఒకసారి చూడండి రాజధాని ప్రాంతంలో ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ముక్యంగా పల్నాడు ప్రాంతం వాళ్ళు ఇదే రోడ్లో వెళ్ళాలి రాజధానికి
@ncbn@RamuduM_RCT@SravanTenali
పునరాలోచన చేస్తే మంచిదేమో అన్న పల్నాడు లో సరైన నాయకత్వం లేకపోతే పార్టీకి చాలా నష్టం పల్నాడు కార్యకర్తను దృష్టిలో పెట్టుకుని
పునరా ఆలోచన చేయండి @naralokesh@ncbn@JaiTDP
@mars_bullodu@molakalaravi వాళ్ళ నాన్నగారు తిన్న ప్లేట్ తీశాడు వీళ్ళ నాయకుల్లాగా తినే ప్లేట్లు లాక్కొని వాడిని పైకి పంపించి అందులో తినలేదు.
తినేటప్పుడు తీయడానికి తిన్న తర్వాత తీయడానికి చాలా తేడా ఉంటుంది అది ఎన్ని చెప్పినా పేటీఎం డాగ్స్ కి అర్థం కాదు