పులివెందుల, వైయస్సార్ జిల్లా
అంబటి సురేష్ కుటుంబానికి అండగా ఉంటాం
టీడీపీ నేతల దాడులకు భయపడాల్సిన అవసరం లేదు
వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది
మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
పులివెందులలోని తన నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను అంబటి సురేష్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమలాపురంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను సురేష్ శ్రీ వైయస్ జగన్‌కు వివరించారు.
కమలాపురంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి పరిహారం కోరినందుకు టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి అనుచరులు తనను బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని సురేష్ వివరించారు. ఆటోలో తీసుకెళ్తూ తనపై దాడి చేస్తూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారని ఆయన చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయానికి బయలుదేరడంతో తనను విడిచిపెట్టారని సురేష్ శ్రీ వైయస్ జగన్‌కు తెలిపారు. తాను వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నందుకే తనపై కక్షపూరితంగా దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సురేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన సురేష్‌పై జరిగిన దాడి ఘటనపై ఆయన ఆరా తీశారు.
ఈ సందర్భంగా సురేష్ కుటుంబానికి శ్రీ వైయస్ జగన్ ధైర్యం చెప్పారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు, దాడులు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష కార్యకర్తలు, సామాన్య ప్రజలను బెదిరించే ప్రయత్నాలు జరిగితే పార్టీ వారికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.
అంబటి సురేష్ కుటుంబాన్ని శ్రీ వైయస్ జగన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వైయస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్‌రెడ్డి తీసుకువచ్చి కలిపారు.
#YSJaganInPulivendula
.@ncbn గారూ… గిరిజన వర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులమీద ఇంతటి క్రౌర్యమా? మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిమీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతునొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైయస్సార్సీపీ నాయకులను గృహ నిర్బంధాలకు పాల్పడతారా? వారు చేసిన తప్పేమిటి? విశాఖపట్నం మారికవలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
మారిక వలస స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైయస్సార్‌గారి హయాంలోనే ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కారామయ్యగారి సలహాలు, సూచనలతో దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్‌ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి, వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు.
మా ప్రభుత్వంలో నాడు-నేడు ద్వారా వీటిని మరింతగా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడమే కాక, ఆన్లైన్ కోచింగ్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపరిచాం. మంచి ఫలితాలు కూడా సాధించాం. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే ట్రైబల్ విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40వేలు, మరియు వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. ఇప్పుడు వీటిని పట్టించుకోకుండా, బాగా నడుస్తున్న స్కూళ్లలో విద్యార్థులను బలవంతంగా తరలించి, ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖలాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హతలేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందలమంది విద్యార్థులను కూడా విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు. భారీగా విద్యార్థులు ఉన్న మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులను ఇబ్బందిపెడుతూ వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? చంద్రబాబుగారు మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు.
మీరు పెడతామంటున్న ఈ కొత్తవాటిలో ఇంటర్మీడియట్నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్‌లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే, ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన ``స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్``లను నిర్వీర్యంచేయడం కరెక్టు కాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకుని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చినచోటే చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకులపట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి.
#VennuPotuBabu
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారిని నమ్మించి నువ్వు పొడిచిన వెన్నుపోటుకి కచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తావు @ncbn. ఎన్టీఆర్ గారిని పదవి నుంచి దించి.. కుటుంబ సభ్యుల్ని దూరం చేసి.. అప్పట్లో చంద్రబాబు సాగించిన కుటిల రాజకీయాల్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ గారి అభిమానులు ఇప్పటికీ బాధపడుతున్నారు.
-నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
#SadistChandraBabu
పులివెందుల
శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైయస్ జగన్ ను కలిశారు.
#YSJaganInPulivendula
ప్రజల కోసం.. ప్రజల మనిషి!
జీవితంలో ఆఖరి గంటలు కూడా ప్రజా సంక్షేమం గురించే అలోచించిన మహానేత వైయస్ఆర్ గారు. తెలుగు నేల మరువలేని మహానేతకు 17వ వర్ధంతి సందర్భంగా నివాళులు
జోహార్ వైయస్ఆర్! 🙏🏻
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
వైయస్ఆర్ గారు తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి!🌾
కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైయస్ఆర్ గారు.🙏🏻🌊
నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైయస్ఆర్ గారికి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
పాదయాత్రలో YSR చూసింది రాజకీయాలు కాదు రైతుల పంటలకు సాగు కోసం కావాల్సిన నీళ్లు, అవి అందక పంట పోయి రైతు చనిపోతే వాళ్ల కుటుంబాలు కార్చిన కన్నీళ్లు
పాదయాత్రలో YSR చూసిన ప్రతి రైతు కష్టం ఆయన గుండెల్లో నిలిచిపోయింది. ఆ గుర్తులే రైతు పొలాలకు నీరు అందించాలనే సంకల్పం అయ్యింది ఆ సంకల్పమే YSR జలయజ్ఞం అయ్యింది దాని ప్రతిరూపాలే నేటి వెలుగొండ అయినా పోలవరం అయినా ఇప్పుడు ప్రాజెక్టులపై క్రెడిట్ కోసం పాకులాడుతున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ కి
ఆ రోజు రైతు కష్టం కళ్లకు కనిపించలేదా ? క్రెడిట్ కోసం చరిత్రను మార్చొచ్చు కానీ చరిత్ర సృష్టించిన మనిషిని మార్చలేరు పేరు కోసం మీలా ప్రచారం చేయలేదు పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు
LEFT A SIGN WHICH SAVED A MILLION HEARTS “ YSR “
#JoharYSR
#YSRForever
#YSRLivesOn
అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు… కానీ నిధుల వినియోగంలో మాత్రం 26వ స్థానం!
దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 36లో MPLADS నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ 26వ స్థానంలో ఉంది
ఛలో వెలుగోడు రిజర్వాయర్కి పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు
వెలుగోడు నుండి నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ.. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు నుంచి రైతులతో కలిసి వెలుగోడు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, శిల్పా రవి గారిని అడ్డుకున్న పోలీసులు
రోడ్డుకి అడ్డంగా పోలీసు వాహనాల్ని పెట్టి నిలువరించే ప్రయత్నం
వెలుగోడులో తగినంత నీరు ఉన్నా.. విడుదల చేయడానికి మీకు నొప్పేంటి చంద్రబాబూ? పంటలు పూర్తిగా ఎండిపోయే వరకూ ఎదురుచూస్తారా?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించి, ఎన్నో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి చేరాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు ఆ మహానేత.
#YSRForever
అనునిత్యం ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా.. ప్రతి క్షణం ప్రజల కష్టాలను తీర్చేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పరితపించిన మంచి మనసున్న నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. ప్రజల కోసం చేసిన సేవలే ఆయనను జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి.
#YSRForever
``ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు... పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి`` అనే గొప్ప ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. డబ్బు లేక ఏ పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదని, ప్రతి విద్యార్థి తన కలలను సాకారం చేసుకునేలా ఉన్నత విద్యకు అండగా నిలిచారు ఆ మహానేత.
#YSRForever
తాడేపల్లి
రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన మహిళలు ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ వైయస్ జగన్‌ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.
తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు శ్రీ వైయస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు శ్రీ వైయస్ జగన్‌ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Gear up for local body polls: YS Jagan
Tadepalli, Aug 25: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy has resolutely said that the anti-incumbency factor has a strong current on the coalition government and called upon the Party to fight every inch of ground in the ensuing local body elections.
Addressing the Party leaders and cadre here on Tuesday, YS Jagan Mohan Reddy, the anger of all sections of people against the coalition translate into votes we will have a resolute win and all the nefarious malpractices of Chandrababu should be fought tooth and nail.
Though it is clear that in the two years, coalition has proved it failed on all fronts, we will win hands down if the elections are held in a free and fair manner and we should ensure there is a contest for every seat giving no scope for manipulation of any sort by TDP.
Our endurance here will pave the way for the future big victory, he said and made it very clear that any unanimous election will be taken seriously. Our candidate should be there in the contest for people to decide and many of them are convinced that they flawed in the previous elections.
We have to field strong candidates who can scrape through the elections and make the most of the announcement of elections to local bodies. We will not tolerate unanimous elections and MLA aspirants should work hard to ensure the contest and victory of our candidate, he said.
Every house should be visited and the contrast between the backstabbing party and YSRCP should be told with clarity and be voice of the people.
On the preparatory side, ID cards with QR code to cadre up to village level will be distributed along with propaganda and other election material. Meeting will be held at district and assembly constituency level besides mandal and division levels.
The legal cell should be active in dealing with the atrocities, harassment and other coercive methods of the coalition while and media social media should be active in highlighting anti-people policies of the government. Training should be given as to how Jagan 2.0 App should be used and keep it active.
Leaders who are not active with social media should get them acclimatized and there is no scope for laxity, he said and warned that there is no place for egos and should work as a single unit to get effective results. In the coming couple of months, leaders should be in their respective constituencies and work for the Party as this is the crucial juncture.
The coalition is known for misusing the police force and if the force steps out of the limits and conduct unreasonably, their names will be logged in the digital book and will have to face future consequences, he said.
Party Coordinators, incharges of 175 assembly constituencies and other leaders attended the meeting.
శ్రీశైలం దేవస్థానం పరిధిలోని వడ్డెర సత్రంలో కుటుంబం బలవన్మరణం
సత్యసాయి జిల్లా బత్తలపల్లి టీచర్స్ కాలనీకి చెందిన ఐదు మంది సత్రంలో దిగి ఉరేసుకుని ఆత్మహత్య.
రెండు,మూడు రోజులుగా రూమ్ లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు తెరిచిన సత్రం సభ్యులు
దేవాలయాల పరిసరాల్లో ఏంటి ఈ ఘోరాలు @ncbn ?
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని సంక్షేమ పథకాల ద్వారా ప్రజా రంజక పాలనకు బాటలు వేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever
తాడేపల్లి
కోదాడ రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి
: మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడిన విషయం బాధాకరమని పేర్కొన్న ఆయన, గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని శ్రీ వైయస్ జగన్ కోరారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.