"డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లను వదిలే ప్రసక్తే లేదు" - సజ్జనార్
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్... అనంతరం మీడియాతో మాట్లాడారు.
#sajjanar#hyderabad#drunkdriving
సత్తుపల్లి సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణించిన ప్రయాణికునికి బస్సు ఎక్కు - గిఫ్ట్ పట్టు అనే నినాదం గురించి గౌరవ డిపో మేనేజర్ వి. సునీత గారు అవగాహన కల్పించడంతో లక్కీ డిప్ బాక్సులో టికెట్టు వేస్తున్న ప్రయాణికుడు* .......
I have officially assumed responsibilities as the Commissioner of Police, Hyderabad(@CPHydCity) today. We will continue to focus on maintaining peace and security across the city, striving to serve the community with effectiveness and integrity.
@hydcitypolice@TelanganaDGP@TelanganaCOPs
Welcoming Shri #YNagireddy IPS, who has taken charge as the new VC & MD of TGSRTC.
We look forward to his visionary leadership and guidance as we continue our journey of growth and service.
#TGSRTC#Telangana#Hyderabad#TakingTelanganaForward
ఆర్టీసీతో నాలుగేళ్ళ నా ప్రయాణం ముగిసింది.
ప్రియమైన టీజీఎస్ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు!! నేను తేది 03.09.2021 నాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్‌లో కొనసాగాను. నేను బాధ్యతలు స్వీకరించేనాటికి సంస్థ చాలా కష్టకాలంలో ఉంది. ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనుగడ ఉంటుందా? లేదా? అనే భయం అందరిలోనూ గూడుకట్టుకుని ఉంది.
అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి సంస్థను బయటికి తీసుకువచ్చేందుకు అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులతో చర్చించాం. అనేక మేధోమథన సదస్సులు నిర్వహించి.. ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాం. వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాం. ‘కృషితో నాస్తి దుర్బిక్షం’ అన్న నానుడిని అందరం కలిసి నిరూపించాం. ఈ నాలుగేళ్లు అనేక ఒడిదొడుకులతో మన ప్రయాణం సాగినప్పటికీ.. మీ అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాము. మీ సహకారంతో అనేక కీలక సంస్కరణలను అమలు చేశాం. పాత బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేయడం, ఏడాదికి రూ. 9000 కోట్లకు పైగా రాబడి సాధించడం, కార్పొరేట్‌కు దీటుగా తార్నాక ఆస్పత్రిని తీర్చిదిద్దడం, గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని సాధికారత చేయడం వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టాం. మీ అందరి కృషి, పట్టుదలతో పాటు నిబద్దత, అంకితభావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని నేను గర్వంగా చెబుతున్నాను.
గత నాలుగేళ్ల కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగింది. నేను మొదట మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదిన జీతాలు ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న, 2017కు సంబంధించిన 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రకటించి.. ఇచ్చాం. పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ దశల వారీగా చెల్లించాం.
ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని భావించి.. నాలుగేళ్లలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మూడు సార్లు నిర్వహించాం. 44 వేల ఉద్యోగుల హెల్త్ ఫ్రొఫైల్స్‌ను రూపొందించాం. ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు చేయించాం. ఈ ఛాలెంజ్‌లలో వైద్య పరీక్షలు చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలున్న సుమారు 1000 మంది ఉద్యోగుల, వారి జీవిత భాగస్వాముల ప్రాణాలను కాపాడుకున్నాం. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా రూపొందించుకుని.. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లో మనం అమలు చేశాం. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ను వినియోగించుకుంటున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశాం. సంస్థ ప్రకటించిన ప్రతి ఛాలెంజ్ ను విజయవంతం చేశాం. ఈ మహాయజ్ఞంలో నాతో కలిసి పనిచేసిన ప్రతి అధికారికి, ఉద్యోగికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను. గతంలోనూ మీరే సంస్థలో విధులు నిర్వర్తించారు. అప్పుడు ఇప్పుడూ సంస్థలో ఎంత తేడా వచ్చిందో మీకు తెలియనిది కాదు.
ఒక మహాకవి చెప్పినట్లుగా ‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని, ఎదురుచూసి మోసపోకుమా’ అన్నది నిజం. సంస్థలోని ప్రతి ఉద్యోగి కూడా ఈ సంస్థ నాది అనే భావనతో శక్తివంచన లేకుండా అంకితభావంతో ప్రతి క్షణాన్ని ఒక సవాల్ గా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రయాణికులకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించి వారి మన్ననలు పొందినట్లైతే, సంస్థ రాబోయే కాలంలో ఎంతో వృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ‘ప్రయాణికులే మన సంస్థకు దేవుళ్లు’ అనే విషయం ఎప్పుడు మన హృదయాల్లో నాటుకుపోవాలి. ప్రయాణికుల పట్ల చాలా గౌరవంతో మెలగాలి.
చివరగా.. ఆర్టీసీకి పరిమిత కాలంలో అపరిమిత పేరు ప్రతిష్ఠలు దక్కడంలో మనమంతా చేయి చేయి కలిపి పనిచేశాం. భవిష్యత్‌లోనూ మీరంతా ఇలానే పనిచేస్తూ దేశంలోనే అత్యున్నత రవాణా సంస్థగా.. మన టీజీఎస్ఆర్టీసీని నిలబెడతారని ఆశిస్తున్నాను. ఆర్టీసీతో నాలుగేళ్ల ఈ పయనం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది. భవిష్యత్‌లో నేను ఎక్కడ ఉన్నా ప్రజా రవాణా వ్యవస్థవ్యవస్థకు, ఈ గొప్ప సంస్థకు నా మద్దతు కొనసాగుతుంది. ప్రజలకు రవాణా సేవలందించే ఈ గొప్ప సంస్థలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ..
మీ.. వీసీ సజ్జనర్, ఐపీఎస్,
అదనపు డీజీపీ
@TGSRTCHQ @PROTGSRTC
సత్తుపల్లి బస్టాండ్ మరియు గ్యారేజీ ఆవరణలో గౌరవ డిపో మేనేజర్ V. సునీత గారి ఆధ్వర్యంలో డిపో ఉద్యోగులు, ప్రయాణికుల తో కలిసి ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఆడబిడ్డల పండుగ ప్రాయాణికుల సమక్షంలో నిర్వహించడం పట్ల ప్రయాణికులు ఆనందం వ్యక్తపరిచారు*
#TGSRTC proudly launches ‘Yatradanam’, a first-of-its-kind initiative offering free travel for orphans, poor students, senior citizens, and differently abled individuals.
Together, let’s gift the joy of travel.💙
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO@SajjanarVC
#Yatradanam #FreeTravel #Donors #TempleTours #Excursions #Telangana #TakingTelanganaForward
#TGSRTC ప్రారంభించిన యాత్రాదాన నిధికి నా వంతు బాధ్యతగా రూ.లక్ష విరాళంగా ప్రకటించాను. ఆ చెక్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశాను.
ఈ విరాళాన్ని అక్షయ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు వీక్షించేందుకు సైన్స్ సెంటర్ కు వెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు సంస్థ ఉపయోగిస్తుంది.
@TGSRTCHQ @PROTGSRTC
Good Afternoon sir, Hon'ble ED(KRZ) sir along with Rm/kmm, Dy.RM(O&M)/kmm visited sathupally depot planted sapling , addressed gathering, conducted T20 meeting , given various suggestions, instructions for improvement of depot performance pl
*సత్తుపల్లి డిపోలో సీతారాముల కళ్యాణ ముత్యాలతలంబ్రాలురెండుసంవత్సరాలుగా అత్యధికంగా బుకింగ్ చేసిన సందర్భంగా (కిన్నెర. ఆనందరావును) ఈరోజు గౌరవ కరీంనగర్ జోన్ ఈడి సలోమన్ గారు, ఖమ్మం RM సరిరాం గారు, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య గారు, డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి గారు అభినందించి, సన్మానించారు
సత్తుపల్లి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మహాగణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ DM యు రాజ్యలక్ష్మి గారు @Rmkmmtgsrtc@Ponnam_INC@TGSRTCHQ