శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల వేదిక.
ఆయన | సిద్ధాంతాలు | ఆశయాలు | పోరాటం
జనసేన జెండా ఎగిరే వరకు విశ్రమించం ✊
Jai Janasena 🚩 Jai Hind 🇮🇳 | ⚠️ Fan Page
#PawanKalyanAneNenu
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం!
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులతో 96% పనులు, 99% పైప్‌లైన్ నిర్మాణం పూర్తి.
త్వరలో లక్షలా��ి మందికి స్వచ్ఛమైన తాగునీరు!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక పర్యవేక్షణలో, 'జల్ జీవన్ మిషన్' మరియు 'అమరజీవి జలధార' పథకాల ద్వారా సుమారు ₹280 కోట్లు కేటాయించబడ్డాయి. మొత్తం ప్రాజె��్ట్ పనులు 96% పూర్తయ్యాయి; ఇందులో భాగంగా, ప్రణాళికాబద్ధమైన 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణంలో 1,106 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి.
పులివెందుల పట్టణ, పులివెందుల గ్రామీణ మరియు సింహాద్రిపురం ప్రాంతాల్లో పనులు పూర్తిగా పూర్తయ్యాయి, అలాగే లింగాల మండలంలోని 24 ఆవాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించే పనులు జరుగుతున్నాయి. మిగిలిన నీటి శుద్ధి మరియు నిల్వ మౌలిక స��ుపాయాల పనులు తుది దశలో ఉన్నాయి.
@APDeputyCMO @NagaBabuOffl
@JanaSenaParty @TelanganaJSP
#PawanKalyanAneNenu #Jaljeevanmission #Janasenapartytelangana
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో తీరుతున్న పులివెందు�� నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
•జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ. 280 కోట్ల కేటాయింపులు
•96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు.. 99 శాతం పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
•తుది అంకానికి నీటి శుద్ధి ప్లాంట్ పనులు
•పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పూర్తయిన పనులు
•లింగాల మండల పరిధిలో 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా
జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా, రాజక��యాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుక��� శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ. 426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకున్నారు.
*గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం*
ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పనులను ��ుందుకు తీసుకువెళ్లే అంశంలో శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ పనుల మీద జరిగిన తొలి సమీక్షలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను సైతం ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జల్ జీవన్ మిషన్ గడువు కూడా పూర్తి కావడంతో, కేంద్రం వద్ద ఉన్న మిగులు నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రివర్యులు, కూటమి నాయకులు చేసిన ప్రయత్నాల ఫలంగా జల్ జీవన్ మిషన్‌ను మరో 4 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకారం తెలపడంతో పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుంది.
అప్పటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి ���ేగంగా పనులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర పైప్లైన్లు వేయడం మినహా పెద్దగా పనులేమీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 96 శాతం పనులు పూర్తి చేశారు. అందులో పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయి. లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం తాగు నీరు వంట��� ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్దేశం మేరకు పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై చర్చలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సూచనలకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించడం జరుగుతుంది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు.
క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని పారదర్శకంగా సమీక్షించిన మీదట జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులకు సంబంధించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు.
జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే, పోటీ చేసే అభ్యర్థులు వీరే అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల పేరుతో తీర్మానాలు చేస్తున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి చేరింది. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణను అందరూ పాటించాలి. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని, వారి ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా జనసేన ��ోటీ ఉంటుందని ఇటీవలి పార్టీ శాసన సభ పక్ష సమావేశంలో వెల్లడించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలి.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
ప్రతిభే కొలమానంగా జాబ్ క్యాలెండర్ పోస్టుల భర్తీ
• కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ వి���ుదల
• ఉద్యోగార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం- నిర్దేశిత తేదీల్లో విడుదలయ్యే నోటిఫికేషన్లు ద్వారా గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 ఉద్యోగాల���, డీఎస్స��� ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖలలో ఖాళీలు భర్తీ చేయనున్నాం. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం మా లక్ష్యం.
ఉద్యోగార్థులంతా ఈ జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి. కష్టపడి చదివి తమ ప్రతిభను నిరూపించుకునే వారికి ఈ నియామకా��ు మంచి అవకాశంగా నిలుస్తాయి. పూర్తిగా మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తాము. అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిర్దేశకత్వంలో రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా సుమారు 2.82 కోట్ల సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం శరవేగంగా ముందు��ు సాగుతోంది..!!
#IdhiManchiPrabhutvam #PawanKalyanAneNenu
ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సంకల్పంతో భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.
100 కు పైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం.
రూ. 120 కోట్లతో 205 కి.మీ.ల మేర ప్ర��ాన ఆలయ అనుసంధాన రోడ్లు.
ఆధ్యాత్మిక ప్రగతి దారులు
•100కుపైగా ప్రధాన క్షేత్రాల���ు గ్రామీణ రోడ్ల అనుసంధానం
•రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు
•ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ
•వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు
•శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు
•నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సంకల్పంతో భక్త��లకి సౌకర్యం
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంట��� పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది గానీ, వారికి సరిపడ రోడ్డు సౌకర్యం మెరుగుపడడం లేదన్న అంశం ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో అలాంటి ఎన్నో ఆలయాలు ఆయన కంట పడ్డాయి. కొన్ని ఆలయాల దుస్థితిని ప్రజలు వినతపత్రాల రూపంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో దేవుని దర్శనానికి వెళ్లే దారి లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 100కు పైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల పొడుగున రోడ్లతో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రాం జీ, సాస్కీ తదితర నిధులతో బడి, గుడి, ఆసుపత్రి, పంట పొలాలకు వెళ్లే మార్గాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రత���యేక శ్రద్ధతో చేపట్టిన గుడి బాట పనులు అత్యంత వేగంగా పూర్తి చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారుల్లో 26 నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారులకి సంబంధించిన పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. అందులో ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం అంతర్వేది, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూలన ఉన్న ఆలయాలు దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్లు నిర్మాణం పూర్తయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోక��� తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, రూ. 3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు తెనాల���, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్లు, నిడదవోలులో ఆంజనేయస్వామి రోడ్డు, పూతలపట్టు నియోజకవర్గం తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయం తదితర రహదారుల పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రోడ్లు సైతం వివిధ దశల్లో సనులు కొనసాగుతున్నాయి. పుణ్య క్షేత్రాలకు వెళ్ళే రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ వహించాలని శ్రీ ��వన్ కళ్యాణ్ గారు అధికారులకు నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నిర్మించే రోడ్లు భక్తులకు సుదీర్ఘ కాలం ఉపయోగపడాలని సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయాల రోడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులకి తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి ���ేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
కేరళం చేరుకున్న శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం ���ాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
@APDeputyCMO @NagaBabuOffl
@JanaSenaParty @TelanganaJSP
#Pawankalyan #kerala #jananasenapartytelangana
జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం
• 20 వేల హెక్టార్లలో 2 కోట్లకిపైగా సీడ్ బాల్స్ వెదజల్లారు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
• 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక అడుగు
• అడవుల పునరుద్ధరణ ��్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్ సాంకేతికత
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50 శాతం గ్రీన్ కవర్ సంకల్పం సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యాలతో ఆయన ప్రారంభించిన సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం నిర్దేశిత లక���ష్యంలో 85 శాతం వరకు పూర్తయ్యింది.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సమాజాలు, ఎన్జీవోలు, వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటి వరకు సుమారు 2.06 కోట్ల సీడ్ బాల్స్ ను వెదజల్లే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మూలపాడు ఎకో పార్క్ లో మొదటి విత్తన బంతిని తయారు చేసి అధికారులు, ప్రజల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తి 2.82 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి బీజం వేసింది.
ఉప ముఖ్యమంత్రివర్యుల సూచనలకు అనుగుణంగా స్వదేశీ, బహుళ ప్రయోజన జాతుల వృక్షాలకు చెందిన విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్‌లో మెజారిటీ భాగాన్ని క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు వినియోగించారు. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఇప్పటి వరకు 20,929 హెక్టార్ల విస్తీర్ణంలో సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియను పూర్తి చేశారు. అటవీ అంచుల్లో క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది, సరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు.
అటవీ ప్రాంతాల్లో వర్షపాతం కొంత మెరుగవడంతో మానవ వనరులు అడుగుపెట్టలేని అడవుల మధ్య ప్రాంతాల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాలను డ్రోన్ల సాయంతో గుర్తించి సీడ్ బాల్స్ వెదజల్లారు. ప్రాంతాల వారీగా భౌగోళిక పరిస్థితుల అనుకూలతల ఆధారంగా విత్తనాలను ఎంపిక చేశారు. తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగింది. అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సీడ్ బాల్స్ తయా���ీ, రవాణా, విస్తరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సీజన్లో 3 కోట్లకు పైగా విత్తన బంతులు వెదజల్లాలన్న లక్ష్యాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అటవీ అధికారులు ముందుకు తీసుకువెళ్తున్నారు.
సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియ సరికొత్త మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఇందులో భాగస్వాములైన అటవీశాఖ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో, అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమానికి కొనసాగింపుగా వెదజల్లిన ప్రాంతాల్లో మొలకల శాతం, మొక్కల ఎదుగుదల తదితర అంశాలపై కూడా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా శ్రీ పవన��� కళ్యాణ్ గారు సూచించారు.
కోట్లాది మంది అభిమానుల వెండితెర ఇలవేల్పు, అభిమానులను సేవామార్గంలో నడిపిస్తూ సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన సేవామూర్తి, మన జనసేనాని శ్రీ @PawanKalyan గారి అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDMegastarChiranjeevi
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for summer holidays was a festive season. A big pain and disappointment used to follow when he used to go back for his college. We all used to miss his absence and feel the vacuum. Home was never vibrant till he was back.
In my school days, just walking beside him was a proud moment. I used to feel like I am walking with the world's most important person; by then, he was just in college.
When he used to ride my father’s bike (Bullet - 350 cc) with his curly long hair, fit NCC Cadet body with bell bottoms and glasses - oh! it was an absolutely fanboy and hero-worshipping moment.
My Annaya was always a Hero for me even before he became a Hero.
In the early days of his film career, he brought a big blue bag from his first Singapore trip. In that blue bag I found my first tiny Lego helicopter, few remote cars, racing track, some comics, music tapes, tape recorder ,scented Yardley Co. powders, soaps ,few perfumes and other small gifts to others. He always brought us joy and smiles into our small home.
In subsequent years, when he got married, I was worried that he would be away from all of us. And I was crying silently in a room. Then he brought my Vadina and said, “Come, I will introduce you to a big man (Pedda Manishi) today.” They both were laughing while they found the reason for my tears.
Then, following years, I was taken to Chennai (then Madras) to stay with Annaya and Vadina. I don’t have enough words for the love and care they showered on me.
I had seen his struggle, hard work and injuries in shoots. Everyday he used to reach home in the middle of the night after 18 hours shift of laborious work in his sweat-drenched costumes and shoes in the Chennai’s heat and humidity; with hardly any strength to stand…
I used to feel guilty for living off on his hard work and sacrifice. But he never even uttered a word about my academic failures and lack of direction in my life.
The way he lighted up our family and relatives with his generosity and he extended the same spirit to his friends, producers, film fraternity and everyone he touched. He is one of the primary and key persons who acted as a cultural bridge between the South and Hindi film industry.He always believed in Indian cinema. Pratibandh and Aaj Ka GoondaRaj were two of his blockbusters in Hindi.
A tech-savvy person, his astounding medical knowledge, his philanthropic nature, a family man, superstardom to megastardom, Central Cabinet Minister, National Awards, highest civilian honors (Padma Vibhushan).
What he hadn’t seen and achieved, but he never rests. After a major spinal operation recently, he bounces back within no time with his strength training and goes back to work. Like a city never sleeps, he’s a man who never rests. He’s born with an unstoppable motor within. That’s why he’s become our beloved ‘Mega Star’ and my only Hero.
Let ‘Mother Nature’ provide you my Dear Annaya @KChirutweets abundant health, super strength and astounding victories on your life path.
Wishing my Annaya on his birthday is not a formality but a gentle reminder to many like me ; how his life has impacted, influenced and transformed millions like me to build a better future and to lay a stronger foundations for the land of Bharath -we all adore and worship.
Jai Hind !!
#HBDMegastarChiranjeevi
తెరపై ఆయన 'మెగాస్టార్', తెర వెనుక ఆయన కరుణామయుడు. రక్త నిధి (Blood Bank) మరియు నేత్ర నిధి (Eye Bank) ద్వారానే కాకుండా, అనేక ఇతర సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అపారమైన సేవలు అందించిన స్ఫూర్తిప్రదాత ఆయన.
పద్మవిభూషణ్ @KChiruTweets గారికి జనసేన ���ార్టీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
@PawanKalyan
@NagaBabuOffl
@JanaSenaParty
@TelanganaJSP
#HBDMegaStarChiranjeevi #Pawankalyan #Nagababu #Janasenapartytelangana
Planting trees on the occasion of Annayya’s birthday felt truly happy and meaningful. Instead of celebrating with something temporary, planting a tree is a beautiful way to create something that grows, gives life, and benefits everyone for years to come.
I believe everyone should plant a tree on the occasion of their loved ones’ birthdays. It’s a small gesture today that leaves a lasting gift for tomorrow. 🌳
Happy Birthday, Annayya! ❤️May your legacy continue to grow and inspire, just like these trees. @KChiruTweets
రేపు కేరళం రాష్ట్రానికి శ్రీ @PawanKalyan గారు
•వైద్యుల సూచన మేరకు భుజానికి ఆయుర్వేద థెరపీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన, వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు.
శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు , విధులకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలను నిర్వహించడం చేశారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతోపాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. ప్ర��్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు.
శ్రీమతి షావుకారు జానకి గారు ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానక�� గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకి గారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. శ్రీమతి షావుకారు జానకి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ��ుఖ్యమంత్రి