79 ఏళ్లుగా కర్నూలు జిల్లా, బంటనహల్ గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్యను పరిష్కరించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
శ్మశానానికి వెళ్లే దారికైనా గౌరవం ఉండాలనే ఆలోచనతో పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన నాయకత్వం 🙏🏻
#PawanKalyanAneNenu#PawanKalyanTransformsAP
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
Had a productive and insightful discussion with Hon'ble Minister for Education, IT & Electronics, Shri @naralokesh Garu at my residence today on Andhra Pradesh's development priorities.
He shared the outcomes of his recent visit to South Korea, the encouraging response from global investors, and the concerted efforts underway to attract high-value investments, cutting-edge technologies, and quality employment opportunities to our State.
Shri Lokesh Garu also enquired about my health following my shoulder surgery and conveyed his warm wishes for my speedy recovery. I deeply appreciate his thoughtful gesture of bringing the sacred prasadam and the portrait of Goddess Kanaka Durgamaa from Vijayawada.
I sincerely thank him for his concern, and warm wishes. I wish him continued success in his efforts towards the progress and prosperity of Andhra Pradesh.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Ahead of the Parliament Monsoon Session, JanaSena Party President, Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan advised the party MPs to ensure that the spirit of “Nation First” is strongly reflected in parliamentary discussions.
He also urged them to make use of every opportunity to raise key issues and work towards securing the best possible outcomes for the state.
జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు
• నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరం
72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు శ్రీ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. శ్రీ మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి శ్రీ కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన శ్రీమతి యామీ గౌతమ్ కు అభినందనలు.
తెలుగు చిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు దక్కడం శుభపరిణామం. ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి 2898 ఎ.డి., ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కల్కి 2898 ఎ.డి., (నితిన్ జిహాని చౌదరి), ఉత్తమ బాలల చిత్రంగా 35 - చిన్న కథ కాదు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్ దేవ్ పోతుల, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ సుకుమార్ (పుష్ప 2), ఉత్తమ సంభాషణల రచయితగా శ్రీ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో పుష్ప 2 (దీపాలి నూర్, శీతల్ శర్మ) దక్కించుకున్నారు. వీరందరికీ అభినందనలు.
నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారానికి ఎంపిక కావడం సంతోషాన్నిచ్చింది. నిర్మాతగా నిహారిక చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుతోపాటు అవార్డులు దక్కించుకొంది. చిత్ర నిర్మాణంలో నిహారికతోపాటు భాగమైన శ్రీమతి పద్మజ కొణిదెల, శ్రీమతి జయలక్ష్మి అడపాక, ఈ చిత్ర దర్శకుడు శ్రీ యదు వంశీకి అభినందనలు. ఈ చిత్రానికి మేకప్ ఆర్టిస్ట్ గా బాధ్యతలు చూసిన శ్రీ పి.రవి కుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. ఆయనకు అభినందనలు.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada@IamNiharikaK
#NationalFilmAwards
పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి
•రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి
•పార్లమెంటు వర్షా కాల సమావేశాల నేపథ్యంలో జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దిశానిర్దేశం
పార్లమెంట్ చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా ప్రతి అంశంపై సమగ్ర అవగాహనతో మాట్లాడాలని ఎంపీలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ప్రతి అంశంలోనూ ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.
దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన పార్టీ లక్ష్యమని, అదే దిశగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో పార్టీ లోక్ సభ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి @VBalashowry గారు, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ @tangella_uday గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ @MPLingamaneni గారు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారు
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్నప్పటికీ శాఖాపరమైన సమీక్షలను కొనసాగిస్తున్నారు.
పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండేతో సమావేశమై పనుల పురోగతిని, గ్రామాల్లో పారిశుధ్యం,తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని ఆదేశించారు
ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి వచ్చి హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించాను. పవనన్న త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించాను. వైద్యుల సూచనలు పాటించాలని, వీలైనంత మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించాను.
@PawanKalyan
పంచాయతీరాజ్, అటవీ శాఖలపై ఉప ముఖ్యమంత్రివర్యులు చర్చ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండేతో శనివారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో నిర్దేశించిన పనుల పురోగతిపై చర్చించారు. వర్షా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, రక్షిత మంచినీరు సరఫరాపై దృష్టి సారించాలని ఆదేశించారు.
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శనివారం మాజీ మంత్రివర్యులు, భీమిలి శాసనసభ్యులు శ్రీ @Ganta_Srinivasa గారు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి వచ్చి హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పరమశించిన రాష్ట్ర మంత్రి శ్రీ @naralokesh గారు
#GetWellSoonPawanKalyan@JanaSenaParty@PawanKalyan
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటనపై శ్రీ @PawanKalyan గారు విచారం
పోలవరం జిల్లా, ఏటపాక మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలవరం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
Today, Bharat didn’t just celebrate a successful launch. It celebrated the dawn of a new era of innovation, enterprise, and limitless possibilities.
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of Vikram-1, India’s first privately developed orbital rocket. This landmark achievement reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to open India’s space sector to private participation, laying the foundation for a vibrant ecosystem of innovation and entrepreneurship.
The success of Mission Aagaman is not only a milestone in space exploration but also a catalyst for new opportunities in science, technology, research, manufacturing, startups, and high-skilled employment. It strengthens India’s position as a global innovation powerhouse and inspires millions of young minds to turn their aspirations into achievements.
May this historic success propel Bharat towards even greater heights in the journey towards a Viksit Bharat.
Congratulations, Team Vikram-1!
- @PawanKalyan@PMOIndia@SkyrootA@isro@PIB_India@IPR_AP@pibvijayawada
#Vikram1 #IndiaInSpace
Every generation is remembered for the frontiers it dares to cross. Today, India reaches for a new one.
The launch of Vikram-1, India’s first privately developed orbital rocket, from the historic Sriharikota spaceport marks a defining milestone in our nation’s journey towards becoming a global leader in space technology and innovation. This pioneering mission reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji in opening India’s space sector to private participation and empowering a vibrant ecosystem of innovation and enterprise.
This mission is a celebration of Indian talent, scientific excellence, entrepreneurial spirit, and the confidence to transform bold ideas into historic achievements. It sends a powerful message to every young Indian that with courage, innovation, and perseverance, no frontier is beyond our reach.
My heartfelt congratulations to the dedicated teams at Skyroot Aerospace, ISRO, and IN-SPACe for making this historic moment possible.
Wishing Mission Vikram-1 a flawless launch and grand success. May this landmark achievement inspire generations to dream bigger, build fearlessly, and propel India to ever greater heights.
- @PawanKalyan
#Vikram1 #MissionAagaman #IndiaInSpace
గత ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మంపై అనేక కుట్రలు. అదే పనిగా దూషించారు, పదే పదే దాడి చేశారు.
దురుద్దేశంతో సనాతన ధర్మంపై, హిందూ మతంపై చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడం అనివార్యం.