శ్రీ సీతారాముల వారి కృపతో..
నాచేత వ్రాయబడిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" నవల, త్వరలో మీ ముందుకు
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మనందరియందు ఆ సీతారాముల వారి సంపూర్ణ కృప ఉండు గాక!
జై శ్రీరామ్ 🕉️🙏🏻
ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం అలాగే వన సంపదను పెంచడంలో అద్భుతమైన ప్రయోగం.
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాస్త, ప్రకృతాంధ్రప్రదేశ్ గా మారుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
#WorldEnvironmentDay
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
* మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన శ్రీ @PawanKalyan గారు
* డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ తయారు చేశారు.
• రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు పని చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సీడ్ బాల్స్ ఆవశ్యకతను వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు.
•ప్రతి ఎకో పార్కులో ఒక యోగా హాల్
అంతకు ముందు మూలపాడు బటర్ ఫ్లై పార్కులో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. బటర్ ఫ్లై పార్కు నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది. ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
•కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రచారానికి హామీ
అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్ల పొణికి దుంగలను పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు వంటి వంట ఇంటి సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్ టాప్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరం అయిన చెక్క లభించడం లేదని తెలుపగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారుల చేత ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ప్రతిమను తయారు చేయించాలని కోరారు. అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకి ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం శాసన సభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పీసీసీఎఫ్ శ్రీ పీవీ చలపతిరావు గారు, అటవీశాఖ సలహాదారుడు శ్రీ మల్లికార్జునరావు గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ గారు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, మైలవరం ఇంఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన రావు గారు తదితరులు పాల్గొన్నారు.
#WorldEnvironmentDay
ఓ కవిత రాయలేకున్నా...!
మనసు చాటున దాచేసుకున్నా
అక్షరాలు పదాలై అల్లుతున్నా...!
అటుగా పోలేకున్నా...!
మనసు మాటలు వినికిడి లేనట్టు
ఏవో మలుపుల దారిలో సాగుతున్నా..!
ఏదో క్షణం మనసు గుర్తు చేస్తున్నా
మౌనాన్ని బహుమానంగా ప్రకటిస్తున్నా....!!
#మనోభావాలు
ఒక ఊరు గురించి, ఆ ఊర్లోని వ్యక్తులందరి గురించి.. చివరకు దొంగ మనసుతో సహా ఆవిష్కరించిన పుస్తకం "వేయిపడగలు".
అన్ని కథలోనే అంతర్భాగమై, మనం కూడా ఆ ఊర్లో సంచరిస్తున్నాం అనే భావన తీసుకొస్తూ.. కథను, పాత్రలను నడిపిన తీరు అమోఘం, అద్భుతం
అప్పట్లో రాసుకున్న సమీక్ష.
https://t.co/6tubJsE5Qn
తెలుగు సాహిత్య పునాది · #1
వేయి పడగలు.
విశ్వనాథ సత్యనారాయణ (1895–1976) .
కవి సామ్రాట్ · జ్ఞానపీఠ పురస్కార గ్రహీత · పద్మ భూషణ్
ఒక మనిషి. ఒక తమ్ముడు. 999 బ్రాడ్షీట్లు. 29 రోజులు. ఒక గ్రామం. ఒక సర్ప దైవం. ఒక సంస్కృతి అస్తమిస్తున్న కాలం.
విశ్వనాథ సత్యనారాయణగారు తన తమ్ముడు వెంకటేశ్వర్లుకు మౌఖికంగా చెప్పగా, అతను రాశాడు. అలా 999 బ్రాడ్షీట్ల మీద ఒక ఇతిహాస నవల పుట్టింది.
"టాల్స్టాయ్ స్థాయి విస్తృతి గల నవల" అని పండితులు వర్ణించిన పుస్తకం.
తర్వాత పీవీ నరసింహారావుగారు దీన్ని హిందీలోకి అనువదించారు — "సహస్రఫణ" పేరుతో. ఆ తర్వాత ఏ తెలుగు భారతీయ ప్రధానమంత్రి కూడా అలాంటి సాహిత్య సేవ చేయలేదు.
https://t.co/EzUYYjjaPT
#TeluguLiterature #TeluguBooks #TeluguSahityam
బారిష్టర్ పార్వతీశం - మొదటి భాగం ఎంత ఆహ్లాదంగా, నవ్విస్తూ సాగుతుందో.. రెండో భాగం ఒక అత్యద్భుతమైన ప్రేమకథను పరిచయం చేసి, చదువుతుంటేనే మనం నేరుగా అక్కడే ఉండి ఇదంతా చూస్తున్నామా అనే భావన రావడం.. ఇక మూడో భాగం మళ్ళీ భారతదేశానికి తిరిగిరావడం, మొత్తానికి తెలుగు సాహిత్యంలో ఇదొక గొప్ప నవల
టెంత్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకం గుర్తుందా? 📖
📚 𝗕𝗮𝗿𝗿𝗶𝘀𝘁𝗲𝗿 𝗣𝗮𝗿𝘃𝗮𝘁𝗲𝗲𝘀𝗮𝗺
🌐 ఆన్లైన్: 𝗧𝗲𝗹𝘂𝗴𝘂𝗕𝗼𝗼𝗸𝘀.𝗶𝗻
🏬 స్టోర్: Navodaya Book House, 3-3-865, కాచిగూడ క్రాస్ రోడ్, హైదరాబాద్
📞 +91 90004 13413
ప్రపంచంలో ఎక్కడున్నా, తెలుగు పుస్తకం మీ ఇంటికి. 🌍✈️
ప్రాంతీయ అభిమానులు - తమ ప్రాంతాన్ని ప్రేమిస్తూ, ఇతర ప్రాంతాల పట్ల, ప్రజల పట్ల ద్వేష భావం లేకుండా దేశభక్తి కలిగి ఉండటం
ప్రాంతీయ విద్వేషియులు - తమ ప్రాంతానికి వేరే ప్రాంత రాజకీయ నాయకులు రాకూడదు, తమ ప్రాంతం గురించి మాట్లాడకూడదు. ఇతర ప్రాంతాల పట్ల, ప్రజల పట్ల ద్వేష భావం.
@jaipalpuli ఇబ్బందితో కూడిన కోపమో/అసహనమో రావడం సహజం. అలాంటి నాయకుడు తెలంగాణ రాజకీయాల్లో లేకపోతే అది మా తప్పు కాదు.
సావధానంగా ఆలోచిస్తే, ఎవరు ఎంటానేది బోధపడుతుంది.
@jaipalpuli దేశ భక్తి లేదన్నది ఆయన ప్రస్తావించలేదు, ప్రాంతీయ విద్వేషాలు తీవ్ర స్థాయికెళ్తే తర్వాత జరిగేది అదే 😀
ఇక భూతం, దయ్యం అంటారా.. అది ఉహించుకునేదేవరో తెలుస్తూనే ఉంది.
ఇక ఆయనకు ఇబ్బంది అంటారా.. ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు నిజమైన నిజాయితీగల నాయకునికి ఆమాత్రం +1
"నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు." 🕊️
ఇది ఒక సాధారణ కవితా సంపుటి కాదు. ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన **అమృతం కురసిన రాత్రి** — ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక మైలురాయి.
శ్రీశ్రీ మహాప్రస్థానం వచన కవిత్వానికి ఒక దారి చూపించగా, తిలక్ ఆ దారిని హృదయంతో నింపారు. ప్రేమ, విషాదం, మానవీయ ఆవేదన , అన్నీ ఆయన కలం నుండి అమృతంలా కురిశాయి.
44 ఏళ్ల వయసులో ఆయన వెళ్ళిపోయారు. ఈ సంపుటి ఆయన మరణం తర్వాత ప్రచురితమై, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
మీకు ఇష్టమైన తిలక్ పంక్తి ఏది? కామెంట్లో రాయండి. 👇
📚 35 ఏళ్లుగా కాచిగూడ నుంచి ప్రపంచమంతటికీ.
🔗 లింక్ ద్వారా https://t.co/nvHIKlw5sl
#TeluguLiterature #TeluguBooks #TeluguSahityam
పదవుల కోసం, రాజకీయాల్లో వారి ఉనికి కోసం కార్యకర్తల మనసుల్లో ప్రాంతీయ విద్వేషాలు నింపి రెచ్చగొట్టడం నీచాతి నీచం.
ఒక్కసారి అలాంటి ప్రాంతీయ విద్వేషాలు మనసుల్లో నింపుకున్న కార్యకర్తలు ఏమిచేయడానికైనా వెనుకాడరు. తరువాత దీనికి అంతే ఉండదు. ఇది దేశ సమగ్రతకు తీవ్ర ముప్పు.
జైహింద్.
పవన్ కళ్యాణ్ గారి విషయంలో చేసేటంత అత్యుత్సాహం, జరిగేంత రంధ్రన్వేషణ (ఎంత ఎగిరిన.. ప్రయాసతో కూడిన ఆయాసం తప్ప ఏముండదనుకోండి..), మిగతా నాయకుల విషయంలో రవ్వంత జరిగిన.. కాస్త జవాబుదారీతనంగా ఉండి రాష్ట్రలెప్పుడో ముందుండేవి అభివృద్ధిలో.
- ప్రొఫెసర్ పరమానందం
మీరెవరు పక్క రాష్ట్రంలో అధికారి అయ్యి, మా రాష్ట్రంలో రాజకీయాలు ద్వారా సేవ చేయడానికి? మేమింకా దోచుకోవాల్సింది, దాచుకోవాల్సింది చాలా ఉంది.
మా ప్రాంతాన్ని, ప్రజలను అభివృద్ధి చేయాలన్న మేమే, దోచుకోవాలన్న మేమే (అభివృద్ధి మాత్రం ఎప్పుడనేది అడగొద్దు).
@SrivatsavaBU Dear brother, congratulations to you 💐
Wishing all the very best to you and may the Bhagavaan shree Venkateshwara has sampoorna krupa on you.
@SRINIVASAP11452@PawanKalyan మొత్తానికి మీ శ్రమను గుర్తించే సమయం వచ్చింది. మీ శ్రమ వృథా పోలేదు అన్నయ్య. మీకు తగిన విధంగా ప్రోత్సాహం అలాగే ప్రోత్సాహకాలు అన్నివిధాలా ప్రభుత్వం నుండి అందాలని.. మీరిలాగే కనుమరుగులో ఉన్న మరెన్నో శాసనాలను వెలికి తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.