బాబు అప్పుల పద్దు రూ.3,59,157 కోట్లు
తాజాగా మరో రూ.3,800 కోట్లు రుణం.. సంపద సృష్టి లేదు.. సంక్షేమానికి తూట్లు
సూపర్ సిక్స్‌లు, హామీలు గాలికి.. నిత్యం చేబదుళ్లు, ఓడీలతోనే పాలన
ముద్రగడ గారితో నిలువెత్తు బంధానికి నిదర్శనంగా పాడె మోసిన వైయస్ జగన్ గారు!
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు ముద్రగడ పద్మనాభం గారి స్వగృహానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన వైయస్ జగన్ గారు
ముద్రగడ కోరిక మేరకు ఆయన ఇంటి ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియల్ని నిర్వహించగా.. ముద్రగడ గారితో బంధాన్ని గుర్తు చేసుకుంటూ పాడె మోసిన వైయస్ జగన్ గారు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు, పార్టీ నేతలు
భౌతికంగా ముద్రగడ గారు దూరమైనా.. వారి కుటుంబంతో వైయస్ఆర్సీపీ బంధం ఎప్పటికీ పదిలం
#JoharMudragadaPadmanabham
#YSJaganInKirlampudi
#TDPFakeNewsFactory
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడి గురించి వైయస్ జగన్ గారు చెప్పిందేంటి? నువ్వు వక్రీకరించి చెప్తున్నదేంటి నారా లోకేష్?
సీదిరి గారి కుమారుడు చేసింది కరెక్ట్ అని వైయస్ జగన్ గారు చెప్పలేదు. కానీ.. ఆ యాక్సిడెంట్ విషయంలో పోలీసులు పెట్టిన తీవ్రమైన సెక్షన్స్‌ని మాత్రమే వైయస్ జగన్ గారు తప్పుబట్టారు
న్యాయమూర్తి కూడా ఆ సెక్షన్స్ పెట్టడంపై మీ పోలీసులకు మొట్టికాయలు వేశారు కదా?
వాస్తవాల్ని దాచేసి ఇంకెంత కాలం ఇలా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడతారు @naralokesh ?
బ్రేకింగ్ న్యూస్
రేపు భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశం తర్వాత కిర్లంపూడికి వైఎస్ జగన్
భీమవరం నుంచి జగ్గంపేటకు హెలికాప్టర్ లో వెళ్లనున్న వైఎస్ జగన్
జగ్గంపేట నుంచి కిర్లంపూడికి రోడ్డుమార్గంలో వెళ్లనున్న వైఎస్ జగన్
కిర్లంపూడిలో ముద్రగడ పార్థివదేహానికి నివాళులర్పించనున్న వైఎస్ జగన్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు ముద్రగడ పద్మనాభం గారి మృతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు...
మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ గారు
ఒక మంచి ఉద్యకారుని కోల్పోవడం చాలా బాధాకరం... వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.