నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ–3.0 కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ప్రజల నుంచి లభించిన అపూర్వ స్వాగతాన్ని మరిచిపోలేను.
ప్రతి ఇంటి ముందు రోడ్డు... ప్రతి పల్లెలో డ్రైనేజీ... రైతుకు గోకులం... వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరినిచ్చేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా భావించి పని చేస్తున్నాం. పల్లె వెలిగితే... ఆంధ్రప్రదేశ్ వెలుగుతుంది.
@PawanKalyan
#PallePanduga
ఇలా ఉంటాయి అండి పేటీఎం కబుర్లు!! 🤦
హాఫ్ బాటిల్ కొన్నాడు - క్వార్టర్ పొట్టలోకి వేసాడు. 😄😅
ఒరేయ్ బాబు నువ్వు స్కాన్ చేయాల్సింది బాటిల్ మూత మీద ఏపీ ప్రభుత్వం వేసే స్టికర్ మీద ఉండే QR కోడ్ రా నాయనా.
DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు తన ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ‘డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు’ అంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని సిగ్గు లేకుండా చెబుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి తన పాలనాకాలంలో దారుణమైన నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తుతో బాటు ఇప్పుడు ఎన్ ఫొర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో దిగింది. ఏపిపిఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జగన్ రెడ్డి బ్యాచ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి కేసులో కూడా ఈడీ జోక్యం చేసుకుని అరెస్టులు ప్రారంభించింది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ‘గొడ్డలి పార్టీ’ DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
జగన్ రెడ్డి పదే పదే టీచర్లను అవమానిస్తూ ‘డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు’ అంటున్నాడు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. వివరణలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టతనిచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జగన్ రెడ్డి చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు DSC 2025 లో ఎంపికై గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న గాయత్రి అనే టీచర్ జగన్ రెడ్డి కళ్లు తెరిపించేలా మాట్లాడారు. ఇది విని అయినా సిగ్గు తెచ్చుకో జగన్….
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “యువత భవితకు భరోసా” కార్యక్రమం ద్వారా రాష్ట్ర యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం. కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. యువతకు అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ, వారి ప్రతిభకు సరైన దిశానిర్దేశం చేసే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. రాష్ట్ర యువత తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి యువతే రేపటి రాష్ట్ర భవిష్యత్తు. వారి నైపుణ్యాలకు తగిన అవకాశాలు కల్పించి, వారు తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయడమే మనందరి బాధ్యత.
#yuvathabhavithakubharosa
#NaraChandrababuNaidu
#NaraLokesh
#Kuppam
#kancharlasrikanth
దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం.
ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు... 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది...
భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.....
బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది...
ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది.
దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.
సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో....సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నాం.
1986-87లో 10th క్లాస్ పేపర్లు చోరీ ..
2020లో APPSC పేపర్ల చోరీ ..
నేరస్థులు రాజకీయాల్లో ఉండటం సమాజానికే ప్రమాదం ..
APPSC తో లక్షల మంది యువత గొంతు కోశాడు @ysjagan ..
#YSRCPNeverAgain#AndhraPradesh
#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వెలిగొండ సంబరం-కృష్ణమ్మకు వందనం..!
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఈరోజును నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను. రైతులు, నిర్వాసితులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన నేను... మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండలో కృష్ణమ్మ జలాలను ఆహ్వానించడం, కరువు నేలపై జలసిరులను చూడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. కరువుతో పోరాడిన రైతన్నలు, ఫ్లోరైడ్ బాధలు అనుభవించిన కుటుంబాల సమస్యలు ఇకనుంచి తీరనున్నాయి. వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదు... పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బంగారు కొండ. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త అధ్యాయం. అందరికీ శుభాకాంక్షలు... వెలిగొండను సాకారం చేయడానికి కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. వెలిగొండ మొదటి దశతో మార్కాపురం ప్రాంతానికి గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇక మార్కాపురం అన్ స్టాపబుల్...
వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు.
#VeligondaProject
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject