Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
నేను సుభాష్ చంద్రబోస్ ని ప్రత్యక్షంగా చూడలేదు ..
నేను భగత్ సింగ్ ని ప్రత్యక్షంగా చూడలేదు ..
నేను చెగువీరా ని ప్రత్యక్షంగా చూడలేదు ..
నాకు తెలిసిన సుభాష్ చంద్రబోస్ , భగత్ సింగ్ , చెగువీరా నీవే.
ధైర్యాన్ని పోరాట పటిమని మాకు పరిచయం చేశావు. సామాన్యుడు రాజకీయాలు చేయవచ్చు అని చేసి చూపించావు. గెలుపు ఓటముల తో సంబంధం లేకుండా మన ప్రయత్నం మనం నిజాయితీగా సాధించాలి. విజయం దానంతట అదే వెదుక్కుంటా వస్తది అని చెప్పడమే కాదు చేసి చూపించావు. ఒక జెనరేషన్ కి ఆదర్శం అయ్యావు.
రాజకీయాలు అంటే ఏంటో తెలియని నేను ఆర్టికిల్స్ రాసేస్తున్నా అంటే కారణం నీవు. ఈరోజు నీకోసం నీ ఆశయాలు ని పాట రూపం లో కూడా రాశాను. ఇందులో రాసిన ప్రతీ పదం నీకోసమే పుట్టింది.
Happy Birthday My Inspiration @PawanKalyan ❤️❤️
@JanasenaParty@JSPShatagniTeam
#HBDJanaSenaniPawanKalyan
#JanasenaParty
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు.
@PawanKalyan
"మళ్ళీ ఆ రోజులు ఎప్పుడన్నా?" - అభిమానులు
"ఈ రోజులే బాగున్నాయి, ఈయన రాజకీయాల్లోనే ఉండాలి" - సామాన్య ప్రజలు
#HBDPawanKalyan gāru 🎂🎈✨
అభిమానులు పవర్ స్టార్ అని పిలుచుకునే ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీ ఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అతితక్కువ కాలంలోనే అన్నయ్య షాడో నుంచి బయటకు వచ్చి ప్రేక్షకుల మనసుల పై తనదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారు.
"అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి" చిత్రం తనకు నటుడిగా చక్కని గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత విడుదలైన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు అతనిలో ఉన్న పరిపూర్ణ నటుడ్ని ఆవిష్కరించాయి.
అలాంటి సమయంలో కళ్యాణ్ చేసిన "తొలిప్రేమ" చిత్రం యావత్ ప్రేక్షక లోకం, సినీ పరిశ్రమ అబ్బురపోయేలా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
"బాలు" పాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి, పండించిన ఎమోషన్ అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఓ రకంగా తొలిప్రేమ చిత్రం స్ఫూర్తితో మరెన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి అని చెప్పచ్చు.
ఆ తరువాత వరుసగా తమ్ముడు, బద్రి, ఖుషీ చిత్రాలతో అగ్ర హీరోలలో ఒకరుగా మారారు పవన్ కళ్యాణ్. "ఖుషీ" సాధించిన భారీ వసూళ్ళు చూసి ట్రేడ్ పండితులు నోరెళ్ళబెట్టారు. "జానీ" చిత్రంతో దర్శకుడిగా మారి తన విభిన్నమైన అభిరుచిని చాటుకున్నారు కళ్యాణ్.
తెలుగు సినిమాలో మొదటిసారిగా హింగ్లీష్ పాట పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్‌కి దక్కుతుంది. "బద్రి" సినిమాలో "అయామ్ ఆన్ ఇండియన్" పాట ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర లేదు.
ఆ తర్వాత "ఖుషీ" చిత్రంలో "యే మేరా జహాన్" అని పూర్తి స్థాయిలో హిందీ పాటను చిత్రీకరించారు పవన్ కళ్యాణ్. దీనికి కొరియోగ్రఫీ కూడా కళ్యాణ్ చేయటం విశేషం.
ఈ రెండిటి కంటే ముందే "తమ్ముడు" సినిమాలో ఇంగ్లీష్ లిరిక్స్ పెట్టారు కళ్యాణ్. అంతే కాదు, మొట్ట మొదటి సారిగా వెండి తెర పై "కిక్ బాక్సింగ్" స్పోర్ట్ చూపించారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు.
అదే విధంగా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన మార్షల్ ఆర్ట్ అయిన ఎస్‌క్రిమా (స్టిక్ ఫైట్) ను బద్రి చిత్రంలో చూపించారు పవన్ కళ్యాణ్. పాటలు, ఫైట్లు చిత్రీకరణలో తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్నారు పవన్ కళ్యాణ్.
కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా అయ్యాక చాలా కాలం తరువాత నటించిన #OG చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది, అభిమానుల్లో జోష్ నింపింది.
ప్రస్తుతం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం #OG2 ఆగమనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం, సంస్కరణలు, విజయాలను తెలియజేసే రైటప్ త్వరలోనే ఇక్కడ పోస్ట్ చేస్తాను.
వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు 🎂
లాంగ్ లివ్ @PawanKalyan 💚
@raviprakash_rtv 60 గంటలు శిథిలాల కింద. చుట్టూ చీకటి, ప్రతి క్షణం మృత్యువు భయం.అయినా ఆ చిన్నారి ఆశను మాత్రం వదల్లేదు.🥹❤️
మృత్యువును ఓడించి మనీషా తిరిగి రావడం నిజంగా కన్నీళ్లు తెప్పించే అద్భుతం🙏
ఆ చిన్న ప్రాణాన్ని కాపాడిన రెస్క్యూ సిబ్బందికి హృదయపూర్వక సెల్యూట్.🫡❤️
@NepaliArmyHQ@RONBupdates
కొందరు నన్ను శత్రువుగా భావించవచ్చు కానీ, నేను ఎవ్వరినీ శత్రువుగా భావించను. కర్మఫలం వల్ల కొన్ని సంబంధాలు మారవచ్చు లేదా మరుగవ్వవచ్చు కానీ, నాకు హాని చేసేవారితో సహా నేను ఎవరికి చెడు చేయను, కోరుకోను. ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అనుకూల పరిణామమని భావిస్తున్నాను. మానసిక స్వేచ్ఛ అంటే ఇదేనేమో.
80 ఏళ్ళ వయస్సు... పిల్లలు లేరు
అనారోగ్యం తో బాధపడుతున్న భార్యను కాపాడుకోవడం కోసం
ఉదయం 6:00 గఝటల నుండి రాత్రి 10:00 గంటల వరకు తానే ఓ యంత్రమై పని చేస్తున్న
పెద్దాయన పట్టుదలకు 🙏🙏 లు
భార్య పై ఆయనకున్న ప్రేమకు వేల 🙏 లు
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
"పెద్ది" సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే తన ఊరికి అన్యాయం జరిగిందని రియలైజ్ అయ్యేక లేదా క్లైమాక్స్‌లో "లౌడ్"గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉన్నా ఎక్కడా కూడా "పెద్ది" తన కంపోజర్ కోల్పోడు! థాంక్స్ టు బుచ్చి సర్.
మన దగ్గర చాలా మంచి యాక్టర్లు కూడా "లౌడ్"గా మాట్లాడుతూ పేజీలకు పేజీలు డైలాగులు అప్పజెప్పి ఓవర్ యాక్షన్ అనే నిందను తెచ్చుకున్నారు.
క్లైమాక్స్‌లో కూడా పెద్ది తన ఊరికి అన్యాయం జరిగిందని ఆవేదనను వ్యక్తపరుస్తాడు తప్ప వ్యవస్థను నిందించడు, పేరాల కొద్దీ డైలాగులు చెప్పడు. గొప్ప విషయం ఏమిటంటే లోపం తనలోనే ఉందని భావించి ఇంకా "బెటర్" (విన్నర్) కావటానికి ట్రై చేస్తాడు!
మన దగ్గర హీరో అంటే ఇలానే ఉండాలన్న నియమాన్ని పక్కన పెట్టి ఓ బలహీనుడు, సామాన్యుడు స్వీయ ప్రతిభతో తను గెలిచి, తన ఊరిని ఎలా గెలిపించాడు అన్న కథాంశాన్ని బుచ్చి సర్ అద్భుతంగా తెరకెక్కించారు.
@AlwaysRamCharan@BuchiBabuSana
పవన్ కళ్యాణ్ ఎంత sensible అంటే మంచం మీద కూర్చునే ముందు పేరెంట్స్ ని కూర్చోవచ్చా అని అడిగి పర్వాలే కూర్చోవచ్చు అని వారి దగ్గర నుండి ఆన్సర్ వచ్చాక కూర్చున్నారు.
@PawanKalyan Dimond స్వామి నీవు ❤️❤️