సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా బలహీనవర్గాల విద్యార్థుల డైట్ కోసం 10 శాతం అదనంగా కేటాయించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా, ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ ఛార్జీలను ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
So proud to see Brahmani named one of Fortune India’s 100 Most Influential Women! Keep shining, leading, and breaking barriers!
@brahmaninara
https://t.co/dHr0d1nfnI
"గతం మాకు గాయాలను మిగిల్చితే, చంద్రబాబు గారి నాయకత్వం మాకు గెలుపునిచ్చింది. ఇప్పటివరకు కరవులో బతికిన మేము, ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడు చూపిన దారిలో ముందుకెళ్తున్నాం..." రెండేళ్ల కూటమి పాలన తర్వాత రాయలసీమ ప్రజల మనోగతం ఇది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
#RayalaseemaRising
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#PsychoFekuJagan#YcpCriminalPolitics#EndOfYCP
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను చేయి చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదని ఆమె మీడియాతో చెప్పుకుంది. అదే పెద్ద తప్పయినట్టు ఆమె పై కక్షగట్టి వేధించారు. జగన్ ని నమ్ముకున్నందుకు చావే దిక్కయిందని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి పూటకో మాట, రోజుకో బాటగా జగన్ మాట తప్పుడు మడమ తిప్పుడు కొనసాగుతోంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో చంద్రబాబు గారి పాలన సాగుతోంది.
#Amaravati#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
నాడు రాయలసీమకు చేపలు, రొయ్యలు దుకాణాలు తెస్తేనే అభివృద్ధి అని జగన్ చెప్పుకునే వైకాపా పాలన రోజులు..
నేడు రాయల్ ఎన్ఫీల్డ్, కియా, SGF రాకతో రాయలసీమను రతనాల సీమగా మార్చారు సీఎం చంద్రబాబు గారు.
#RayalaseemaRising#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్‌ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
మెగా డీఎస్సీ పై, జగన్ చేసిన మెగా మోసం బట్టబయలు..
మెగా డీఎస్సీ పై ఫేక్ ఆరోపణలే కాదు, ఫేక్ ఆధారాలు కూడా చూపిస్తూ జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అంటూ నమ్మించాలని చూసినట్టే ఉంది గొడ్డలి పార్టీ తెలివితేటలు. డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటూ జగన్ రెడ్డి ఒక ఆడియో కాల్ ని చూపిస్తూ ట్వీట్ చేసాడు. ఆ ఆడియో కాల్ లో జగన్ చూపించిన ఫోన్ నెంబర్ కొడితే తాడేపల్లి ప్యాలెస్ తాబేదారు నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య బయటపడ్డాడు. ఈ ఫేక్ కాల్ కూడా అటు ఇటు గొడ్డలి పార్టీ కార్యకర్తలను పెట్టి ప్యాలెస్ లోనే రికార్డు చేశారనేది స్పష్టం అయిపోయింది.
ఫేక్ చేయడం, ఫేక్ చేసిన ప్రతిసారీ అడ్డంగా బుక్ అయిపోవడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారింది. ఇలా ఫేక్ చేసి లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకున్న జగన్ పై ఇప్పుడు సిబిఐ కేసు పెట్టి, ఈ కుట్ర వెనుక జగన్ చేసిన దారుణాలు బయట పెట్టాలి..
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
తిరుపతిలో నేడు నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాం. నా పై అచంచలమైన విశ్వాసం ఉంచిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గడచిన 2 ఏళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా, ప్రజా క్షేమమే పరమావధిగా నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా ముందుకు నడిపేందుకు పునరంకితం అవుతాను.
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi@PawanKalyan
#EDArrestsJaganAide
జగన్ హయాంలో ఏపీలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతం చేసిన ఈడీ, జగన్ సన్నిహితుడు ఈ కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తీగ గట్టిగా లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదిలేలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
విశాఖ కేజీహెచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చాను. సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.