మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి లక్ష్మీ శివకుమారి జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆమె కాకినాడలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్, పిఎసి సభ్యులు శ్రీ పంతం నానాజీ ఈ చర్చలో పాల్గొన్నారు.