హోటల్ లో టిఫిన్ తిని బిల్లు కట్టకుండా పారిపోతుండగా యజమానికి దొరికిపోయి తరచూ తన్నులు తినే నాగార్జున,
సూట్‌కేసు కంపెనీలతో ప్రారంభమైన వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చుని జనసేన పార్టీ నేతలు, సిబ్బంది మీద చిల్లర విమర్శలు చెయ్యడం హాస్యాస్పదం.
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి
•పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి
•ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
గ్రేట్ఆంధ్ర మూర్తి గారూ,
మీకు నచ్చిన సినిమాలను ప్రమోట్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ మీకుంది. కానీ ఇతరుల సినిమాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటూ, మెగా సినిమాలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మాత్రం సహించేది లేదు.
విమర్శించే హక్కు అందరికీ ఉంది. కానీ విమర్శ పేరుతో హద్దులు దాటితే మెగా అభిమానుల నుంచి గట్టిగానే సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుంది.
మెగా అభిమానుల సహనాన్ని పరీక్షించవద్దు. మా అభిమానాన్ని, మా ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయొద్దు.
తస్మాత్ జాగ్రత్త! 🔥
అక్వాన్ తుపాన్ పట్ల అత్యంత అప్రమత్తత అవసరం
•గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం
•రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం
•నెల్లూరు - తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది
•భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి
•ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు,ఆహారం అందుబాటులో ఉంచాలి
•అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష
అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120నుంచి145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల19,20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ“నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం,ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి.
అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున,తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం,వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
రైతుల్ని అప్రమత్తం చేయండి
గ్రామీణ ప్రాంతాల్లో వరిపంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున,వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి.భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభం కావాలి
@KaakaMovie@KChiruTweets Invite @PawanKalyan to the #KAAKA pre release event. He is going through a tough time, and his fans are also feeling low. Seeing his fans around him will make him happy. It will be a special moment for all Mega fans 🙌❤️
Vinnadi Correct aite Matram 🔥😲
Kaaaka will be a “ Sankranthi Winner “
Bossssu Oochakotha Maamulga undadu 🔥🥵🥵🥵🥵🥵🥵
#Kaaka will be the best movie in Chiranjeevi Filmography 👏👏 @tollymasti#Tollymasti
అక్వాన్ తుపాన్ పట్ల అత్యంత అప్రమత్తత అవసరం
•గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం
•రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం
•నెల్లూరు - తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది
•భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి
•ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలి
•అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష
అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం, ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి.
అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున, తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
రైతుల్ని అప్రమత్తం చేయండి
గ్రామీణ ప్రాంతాల్లో వరి పంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున, వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ త్వరగా ప్రారంభం కావాలి.
ప్రజలు బీచ్‌ల వైపు వెళ్లకుండా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల తుపాను గాలుల్లో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారుల జీవితాలు విషాదాంతమైన విషయాన్ని ప్రస్తావించాలి. ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలను తూచా తప్పకుండా పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు క్షేత్రస్థాయి సిబ్బందితో సహా యంత్రాంగమంతా గ్రామాల్లోనే ఉండాలని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల”ని ఆదేశించారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
True patriotism is not measured by words spoken, but by the courage to stand firm for one’s nation’s freedom, dignity and self-respect.
On the death anniversary of Punjab Kesari Lala Lajpat Rai Ji, I pay my humble tributes to the fearless freedom fighter whose life was defined by courage, conviction and unwavering commitment to Bharat’s independence.
His resistance against the Simon Commission and the injuries he sustained during the protest stand as a powerful reminder of the sacrifices made by our freedom fighters. His spirit could never be silenced, and his sacrifice strengthened the resolve of a nation determined to be free.
Lala Lajpat Rai Ji’s life reminds us that a nation is built by those who place duty above comfort, courage above fear and the greater good above themselves.
May his legacy continue to inspire generations to serve Bharat with integrity, conviction and an unshakeable sense of national responsibility.
- @PawanKalyan
#LalaLajpatRai #PunjabKesari
Oka Dance Competition lo #Chiranjeevi gari song ki Dance chesi 1st prize win ayyanu Cinemaloki Entry ki e Song chala use ayindi, @KChiruTweets garu e video chusi Gemini TV valaki ivvamani recommend chesaru
- Sunil
Boss #MegastarChiranjeevi always encourages Talent
పలు విషయాలపై చర్చించేవారు
కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను.
వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది.
శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.
ఆ సందర్భంలో ఆయన "ఈనాడు" గురించి చాలా విషయాలు చెప్పారు.
వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.
*సమాజంపై ఎంతో బాధ్యత ఉంది
శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది.
సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు.
వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి.
ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను.
ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు,
పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు..
ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు.
పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది
ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా
మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం...మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అన్నారు.