రామోజీరావు పులు కడిగిన ముత్యం ఎలా?
1. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్నది ఒక హెచ్ యూఎఫ్. అంటే ఒక కుటుంబం ఏర్పాటు చేసుకున్న సంస్థ లాంటిది.
2. హెచ్ యూ ఎఫ్ లు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు.
3. ఇలాంటి సంస్థలు గతంలో డిపాజిట్లు సేకరించి మోసం చేస్తున్నాయన్న ఉద్దేశంలో 1997లో ఆర్ బీఐ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది.
4. హెచ్ యూ ఎఫ్ లు డబ్బు డిపాజిట్లు వసూలు చేస్తే రెండేళ్ల జైలు, వసూలు చేసిన మొత్తంపై రెట్టింపు జరిమానా.
5. ఈ పాయింట్ మీదే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
6. 1997లోనే చట్టం వచ్చినా.. 2006 వరకు రామోజీరావు మార్గదర్శి ద్వారా డిపాజిట్లు సేకరించారు.
7. నేరం చేశారన్నది క్లియర్.
8. ఈ విషయాన్ని ఉండవల్లి బయటపెట్టగానే రామోజీరావు వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ సంస్థను మూసివేశారు.
9. అంతా చట్టబద్దంగా చేసి ఉంటే ఎందుకు ఈ పనిచేశారు?.
10. డబ్బులు తిరిగి చెల్లించాను కాబట్టి తనపై చర్యలు వద్దన్నది రామోజీ రావు వాదన.
11. మరి ఇతరులు కూడా ఇలాగే చేసి.. తీరా దొరికిపోయిన తర్వాత డిపాజిట్లు వెనక్కు ఇస్తే నేరం కాకుండా పోతుందా?.
12. మొన్నటి వరకు ఆర్ బీఐ కూడా రామోజీరావు తప్పు చేశారనే వాదించింది.
13. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు మౌనం దాల్చిందే అర్థం చేసుకోవడం ఈజీ.
14. చట్టానికి విరుద్దంగా 2600 కోట్లు వసూలు చేసింది నిజం. అక్కడే నేరం జరిగినట్టు నిర్దారణ అయిపోయింది.
15. చట్టాన్ని ఇక్కడ అప్లై చేసి ఉంటే 5200 కోట్ల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉండేది.
16. కనీసం సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు కొట్టివేస్తున్న సమయంలో కూడా రామోజీరావు చట్టాన్ని ఉల్లంఘించలేదని ఎక్కడా చెప్పలేకపోయింది.
17. మీరు ఇంకా వాదిస్తే మీపైన అనుమానం కలుగుతుంది అంటూ ఉండవల్లి తరపు న్యాయవాదిని కట్టడి చేశారు. కేసును డిస్మిస్ చేశారు.
18. కేసు కొట్టివేయబడంది. అంతే!. ఇక్కడ కడిగిన ముత్యం అని ఏ కోర్టు చెప్పలేదు.
న్యాయమే గెలిచింది- ఇది ఈనాడు హెడ్ లైన్.
గెలిచిందంతా న్యాయమే అని కూడా కాదు!!.
రేపు జగన్ ప్రభుత్వం విచారణ జరిపితే.. 'అధికారులదే తప్పు నాకు సంబంధం లేదని' తప్పించుకోవటానికే లీకేష్ డీఎస్సీ పై ప్రెస్‌మీట్ పెట్టటం లేదు
Follow us: https://t.co/ql2eMbC7sw
పని వైయస్సార్‌సీపీది … ప్రచారం చంద్రబాబుది!
‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’-అదే చంద్రబాబు మార్కు రాజకీయం
ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశవిదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది.
అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబుగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.
@ncbn గారూ… భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది?
జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ?
అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ?
ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని NOCలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం.
మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం.
కానీ చంద్రబాబుగారూ… మీరు అప్పడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడంలేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘‘ఎయిర్‌పోర్టు ఉంది… కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే.
పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి.
సంబంధిత ఆధారాలు- https://t.co/Tb1siVSfEE
#CreditChorBabu
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైయస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా?
చంద్రబాబుగారు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర.
సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైయస్సార్సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా?
అరెస్టులతో వైయస్సార్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబుగారూ... అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు.
English Version- https://t.co/NZkmULlkgn
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
Andhra Pradesh Trending In INDIA!✅️
A Horrific Incident Occurred In Krishna Babu Colony, Guntur.
A Dispute Erupted Between Two Groups Over A Household Borewell.
Acting On The Orders Of Local TDP Leader Mallela Murthy.
A Transgender Person Attacked A Woman And Stripped Her In Public View.
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేశారు.
మా ప్రభుత్వంలో ఎప్పుడైనా అమ్మ ఒడి రూ.7 వేలు రూ.8 వేలు రూ.9 వేలు ఇచ్చాము ఏమో చూపించండి.
నాడు - నేడు కింద 48 వేల స్కూళ్లు రూపురేఖలు మార్చాం.
ఈ ప్రభుత్వం విరాళాలు ఇస్తే అభివృద్ధి చేస్తాం అంటున్నారు.
ENGLISH MEDIUM తెచ్చాము ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో చూపించండి.
CBSE తెచ్చాము ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో చూపించండి.
IB తెచ్చాము ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో చూపించండి.
TOFEL తెచ్చాము ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో చూపించండి.
- బొత్స
Deeply saddened by the passing of the legendary S. Janaki Amma, who hailed from Guntur. Her timeless voice transcended generations, touching millions of hearts across languages. Indian music has lost one of its brightest stars, but her melodies will live on forever. Rest in peace, Amma.
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
.@ncbn గారూ.. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో ఉన్న టెట్ పరీక్ష పాస్‌కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? టీచర్లందరికీ టెట్‌ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు.
కాని, చంద్రబాబుగారు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి.
English Version- https://t.co/346OfjWPQL
రాయి కానిస్టేబుల్ కు తగిలింది.- పోలీసులు.
ఎవడికి తగిలితే ఏంటి అంటున్న టీడీపీ కార్యకర్త.
చాలా క్లియర్ గా దాడి దృశ్యాలు. అతడిని అరెస్ట్ చేస్తారా లేక.. తప్పు జరిగితే సరిదిద్దుకుంటాం,,. అంతమాత్రానికే కేసులు పెడితే ఊరుకోం అన్న లోకేష్ మాట ప్రకారమే పోలీసులు ఊరుకుంటారా !.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు గారు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు.
భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, లోక్‌సభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి, భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు.