"నా సేన కోసం...నా వంతు"సామాజిక బాధ్యతగా 2,024/-(రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు).
ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం౼సమాజ శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరూ కూడా విరాళాలు అందించి జనసేనకి ఆర్థికంగా అండగా ఉందాం౼నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం.
ట్విట్టర్లో ట్వీటయినా, పోలింగ్ బూతులో ఓటయినా,
అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేలా చేసింది ఆయన పోరాటమే.
నేరస్థులను ప్రశ్నించిన నాయకుడిని నిందితుడిగా చూపించే ప్రయత్నాలు ఎంత చేసినా... సత్యం ఎప్పటికీ గెలుస్తుంది
పాపను చంపిన వారిని...
కేసును నీరుగార్చిన వారిని...
సాక్ష్యాలను తారుమారు చేసిన వారిని వదిలేసి...
సుగాలీ ప్రీతికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకువచ్చి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకు పోరాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైనే కేసు పెట్టడం
ఎంత దురదృష్టకరమో ప్రజలే ఆలోచించాలి.
"పళ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" అన్న మాట మరోసారి నిజమైంది. ప్రజల కోసం, బాధితుల కోసం నిలబడే నాయకుడిపైనే రాజకీయ కక్షతో కేసులు పెట్టడం న్యాయాన్ని అణచివేయలేం.
సుగాలీ ప్రీతి కోసం గొంతెత్తింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే.ఆమెకు జరిగిన
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
నేను బాధ్యతలు తీసుకున్నాక కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి ఎవరు కలెక్టర్ గా ఉండాలి అనే ఆలోచన చెయ్యలేదు.
ఒక్కటే సూచన ఇచ్చాను ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి, వ్యవస్థ బలంగా ఉండాలి.
ఇది తప్పా నా దగ్గర నుండి మీకు ఫోన్లు రావు, ఒకవేళ ఎవరినైనా పట్టుకుంటే వదిలేయండి, నా పార్టీ వారు అయినా నేను ప్రోత్సహించను అని స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను వ్యవస్థలను బలపరచడానికి ఉన్నాను, బలహీన పరచడానికి కాదు.
- కాకినాడ మన ఊరు - మాట మంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
Acting scope ఉన్న movies వస్తూ ఉంటే Hero craze double అవుతుంది from kids to families & youth
రామ్ చరణ్ Peddi cinema తో almost tripple చేశారు... ఒక Rangasthalam ఒక RRR ఒక Peddi
ఆయన స్థాయిని పెంచి పడేసాయి !!
@KChiruTweets గారు ఇలానే తన తోటి హీరోల కంటే పైచేయి సాధించారు.
అవార్డుల స్ఫూర్తితో అత్యుత్తమ సేవలు అందించాలి
•జాతీయ అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు శ్రీ @PawanKalyan గారు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాదీ జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు కైవసం చేసుకొనే ప్రక్రియలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచులు, వార్డు సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారికి, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులు అందించిన ప్రేరణతో మరింత ఉత్సాహంగా పని చేసి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకోగా అందులో తిరుపతి జిల్లా బొక్కసంపాలెం మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం నంబర్ వన్ ర్యాంకు సాధించగా, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో చెమ్మెళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. స్వయం సమృద్ధి విభాగంలో గుండమల, అత్యుత్తమ మండలాల్లో కుప్పం 3వ స్థానంలో నిలిచిన విషయం విదితమే.
#AndhraPradesh
హైదరాబాద్, తెలంగాణలోకి నన్ను అడుగు పెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. బెదిరించే వాళ్ళకి చెప్తున్న.. మీ అయ్య జాగీరా తెలంగాణ ! - @PawanKalyan#PawanKalyanTelanganaPressMeet
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
తెలంగాణలోని భీం రావు వాడ కోసం కొట్లాడినప్పుడే నా మీద మొదటి పోలీసు కేసు అయింది. జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటాలను, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటే పార్టీ. ఎలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడదు.
•మీరు మాత్రం అన్ని రాష్ట్రాల్లో తిరగొచ్చా.. పోటీలు చేయొచ్చా?
పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకూడదు అని చెప్పే నాయకులు ఏ రాష్ట్రంలో అయినా తిరగొచ్చు. పార్టీలను విస్తరించొచ్చు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయి ఆంధ్రలో పోటీ చేస్తామంటే మేం స్వాగతించాం. వారు పంజాబ్, మహారాష్ట్ర ఎక్కడైనా పార్టీని విస్తరించొచ్చు. మేం మాత్రం రాకూడదంటే ఎలా..? తెలంగాణ యువత శివ, మల్లికార్జున వంటి వారు చేసిన పోరాట ఫలితంగా యురేనియం తవ్వకాలు ఆగాయి. తెలంగాణ యువత లోపలున్న భావజాలం పదిమందిని కదిలిస్తుంది. వారి పోరాట స్ఫూర్తి కచ్చితంగా అందరికీ దశను చూపిస్తుంది. జనసేన పార్టీ ఈ రోజు 2 వేల మందితో సభ నిర్వహించాలని భావిస్తే అడ్డుకున్నారు. జనసేన పార్టీ బలమైన క్యాడర్ లేకున్నా, ప్రజల్ని చైతన్యవంతం చేస్తుందనే భయమే దీనికి కారణం. రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ దక్షిణాది వాయనాడ్ లో పోటి చేయొచ్చు. ఇంధీరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయొచ్చు. మేం మాత్రం పక్క రాష్ట్రం నుంచి రాకూడదా..? అలా అయితే కాంగ్రెస్ ను ఉత్తరాది పార్టీగానే పరిగణించాలి కదా? ఓ జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రాంతీయత గురించి మాట్లాడుతుంటే ఏం అనిపించడం లేదా..? తెలంగాణ విభజనను వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం లాంటి పార్టీలను మాత్రం ఏమీ అనలేని పరిస్థితి ఉంది. తెలంగాణ గురించి జనసేన పార్టీ ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు.
•ప్రాంతీయ విద్వేషాలు ఉగ్రవాదం కంటే ప్రమాదం
ఇది నా దేశం. నేను ఎక్కడికైనా వస్తా. ప్రతి రాష్ట్రానికి వెళ్లినపుడు పాస్ పోర్టులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నాయకులు ప్రజల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు పెంచకండి. అది మంచిది కాదు. నిరుద్యోగిత రేటు ఆంధ్రలో 4.2 ఉంటే, తెలంగాణలో 5.0కు పెరిగింది. ఇలాంటి ప్రజలకు, యువతకు పనికొచ్చే విషయాల పట్ల మేధావులు రాజకీయ నాయకులు దృష్టి పెడితే మంచిది. ఐ లవ్ పాకిస్థాన్ అన్న నాయకులు మీకు ముద్దు అవుతున్నారు తప్పితే.. తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షల గురించి నిత్యం ఆలోచించే నాలాంటి వారు శత్రువులుగా చూస్తున్నారు. ఇది ప్రమాదకరం. దేశ సుస్థిరతను, సమగ్రతను దెబ్బతీసేలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. జనసేన పార్టీ ప్రాంతీయ వాదాన్ని గౌరవిస్తుంది... అలాగే జాతీయ వాదానికి తగిన ప్రాధాన్యం ఇస్తుంది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే మాత్రం సహించేది లేదు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అనను కానీ, కొందరు వ్యక్తులు పార్టీలు, సోషల్ మీడియా ముసుగు వేసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
•కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి
ప్రాంతీయ వాదం పేరిట ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న కొన్ని శక్తుల పట్ల కేంద్రం దృష్టి పెట్టాలి. తమిళనాడులో హిందీ మాట్లాడేవారు ఉండకూడదు... తెలంగాణలో మర్వాడీలు ఉండకూడదు అంటూ చెబుతున్న వారి వెనుకున్న శక్తులపై దృష్టి పెట్టాలి. అమిత్ షా గారిని కూడా బెంగాల్ రానివ్వం అన్నారు. రానివ్వం అన్న వారే నేడు కనుమరుగు అయ్యారు. దేశాన్ని విచ్ఛన్నం చేయాలని, రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే వారిని వదిలేయకూడదు. వీరిని ఇలాగే వదిలేస్తే జనగణమన, వందేమాతరం కూడా పాడేది లేదని చెబుతారు. అప్పుడు దేశ సమగ్రత, జాతీయవాదానికి కూడా విఘాతం కలుగుతాయి. కావాలని విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారిని నియంత్రించేలా చొరవ తీసుకోవాలి.
తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రధాన కారణం అయిన శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి పేరును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను కలిపే రహదారికి పెట్టాలనేది నా ఆకాంక్ష. ఏపీలోనూ గద్దర్ గారి స్ఫూర్తిని తీసుకుంటాను. అక్కడ గద్దర్ గారి విగ్రహం పెడతాం. తెలంగాణలో జనసేన సాధన మొదలుపెట్టే దశకు వెళ్తున్నాం. ప్రజలను మభ్యపెట్టం... మాయ చేయం. ప్రజా సమస్యల మీద ఉన్నది ఉన్నట్లుగా పోరాడుతాం. ప్రజల మధ్దతును చూరగొంటాం’’ అన్నారు.