లొంగిపోయిన మావోయిస్టులు సమాజానికి సమాధానం చెప్పాలి .. ఈ లొంగిపోవడం ఏదో 20 ఏళ్ళ క్రితమే చేసి ఉంటే వందలమంది పోలీసులు , వేలమంది మావోయిస్టులు , సల్వాజుడుం కార్యకర్తలు , పొలిటికల్ లీడర్లు , ఇన్ఫార్మర్లు , కొరియర్లు , ఆదివాసీ బిడ్డల ప్రాణాలు మిగిలి ఉండేవి కదా .. పాకిస్థాన్ బోర్డర్ కంటే ఎక్కువమంది సైన్యాన్ని ఛత్తీస్ ఘడ్ లో అడుగడుగునా మోహరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా .. ఇవాళ అందరూ చచ్చిపోయాక ప్రాణభయంతో వచ్చి లొంగిపోతే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా ? మీవల్ల చనిపోయినవారికి మీరు ఇంటింటికీ వెళ్లి క్షమాపణ కోరాలి .. ఇంతమంది చావులకు కారణమైన మీరు ఇప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా బతికేస్తాం అంటే ఎలా ఒప్పుకుంటాము మేము ? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం .. దీనితో మీరు ఏకీభవించవచ్చు.. వ్యతిరేకించవచ్చు
ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా ప్రశాంతతను ఆనందాన్ని కలిపి చూసినట్టుంది.
ఈ వీడియోలో వీరికి పెద్దగా ఆస్తులు, అంతస్తులు ఉండకపోవచ్చు,
కానీ వారు నృత్యం చేస్తున్న విధానం, వారి ఆ చిన్న ఆనందాన్ని ఆస్వాదించడం నిజంగా నా హృదయాన్ని తాకింది.
అప్పుడు అనిపించింది, నిజమైన ఆనందం అన్నింటినీ కలిగి ఉండటమే కాదు,
మనకు ఇప్పటికే కలిగి ఉన్న దాన్ని ఆస్వాదించడమే నాకు అర్థమయ్యేలా చేసింది.
నీ కథలో, కథనంలో, సన్నివేశంలో బలం లేనప్పుడు మాత్రమే "నీ హీరో ఎంట్రీ కి, ఎలివేషన్ కి, ఫైట్ కి, భజన చేసే పాటకి, 10 కోట్లు అవసరం అవుతాయి".....
నీ హీరోను ఎలివేట్ చేయడానికి సెట్ అవసరం లేదు,
100 మంది డ్యాన్సర్స్ తో పాట అవసరం లేదు,
48 ఫ్రేమ్స్ అవసరం లేదు,
నీ హీరో కిందపడి దొర్లాల్సిన అవసరం లేదు,
వందమందిని నరకాల్సిన పని అస్సలు లేదు,
వాళ్ళ రక్తాన్ని స్క్రీన్ మీద చూపించక్కర్లేదు,
నీ హీరో గేట్ తీసిన కూడా హీరోయిజం కనిపించాలి అదే స్క్రీన్ ప్లే......
ఇవన్నీ కాకుండా మరేం కావాలి???
బలమైన సన్నివేశం, ఒక పాత చేతక్, అద్దెకి ఒక కెమెరా, ఆ కెమెరా ఎక్కడ పెట్టాలో తెలిస్తే చాలు...
10 కోట్లు ఖర్చు పెట్టినా రానటువంటి ఎమోషన్ వస్తుంది.
అది #విశ్వనాథ్ గారు తీసిన #శంకరాభరణం అయినా, @RGVzoomin తీసిన #రక్తచరిత్ర అయినా,
@imvangasandeep తీసిన #Animal అయినా...
సన్నివేశమే బలంగా ఉండాలి....
Nani Anna,
Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"
And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.
I broke your every rule of cinema.
I broke your working days pattern...
I broke your release date streak...
I broke your working style...
I almost broke every rule of you 'making of cinema'
Each time I broke you, you built me anna...
You built me in a way that everything i have today is because of you. Nuv namminatha nannu evaru nammaledu anna.
I asked you to wear braids....you said "ok ra ni istam"
I asked you to wear a slur as a tattoo on your hand...you said "ok ra ni istam"
I torture you everyday with countless retakes... you simply say - "ok ra ni istam"
I never said this to you directly but now I should confess anna.
I spend every second of my life by constantly chasing the answer to why you always say "Ni istam Srikanth"
And maybe, subconscious I will find my own answer with THE PARADISE.
Nannu nammina na Dharani ki,
Nannu malli nammuthunna na Jadal ki...
Happy Birthday Nani Anna ❤️
Indebted for life time❤️❤️❤️
పుణేలోని ఒక పెద్ద శ్మశానవాటికలో మధ్యాహ్నం 3:00 అయ్యింది.
అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రోహన్ (35), ఫ్లైట్ దిగిన వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు.
అతని తండ్రి సదాశివరావు (75) గత రాత్రి మరణించారు.
రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్‌టాప్ బ్యాగ్, కళ్లపై రే-బాన్ గ్లాసులు.
చెమటలు కారుస్తూ, తరచూ గడియారం చూస్తూ నిలబడ్డాడు.
అక్కడ “మోక్ష ఈవెంట్ మేనేజ్మెంట్” అనే అంత్యక్రియల సేవల సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు.
అన్నీ సిద్ధం చేశాడు. మంటకట్టెలు పేర్చబడ్డాయి, పూజారి వచ్చాడు,
🙏సదాశివరావు గారి శరీరాన్ని స్నానం చేయించి సిద్ధం చేశారు.
రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు. రెండు కన్నీళ్లు జారాయి.
అప్పుడు సుమిత్‌ను అడిగాడు:
“మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా?
నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది.
రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది.
దయచేసి త్వరగా ముగించండి.”
🙄 సుమిత్ షాక్ అయ్యాడు.
ఈ కొడుకును పెంచిన తండ్రికి మూడు గంటల సమయం కూడా దక్కదా? 🤷♂️
అతను మౌనంగా తల ఊపాడు.
క్రియలు జరిగాయి.
🔥 రోహన్ చితికి నిప్పు పెట్టాడు. 😢
పొగ ఆకాశంలోకి ఎగిసింది.
రోహన్ సుమిత్‌ను పక్కకు తీసుకెళ్లి చెక్‌బుక్ తీసాడు.
“సుమిత్, థ్యాంక్స్. మంచి ఏర్పాట్లు చేశావు.
ఎంత బిల్? 50,000నా? 1,00,000నా?
ఎంత చెప్పు, ఇప్పుడే చెక్ రాస్తాను.
నేను మళ్లీ రావడం కుదరదు.
బూడిద నిమజ్జనం కూడా మీరు చూసుకోండి.”
😥 సుమిత్ విచిత్రంగా నవ్వాడు.
“సర్, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్ ఇప్పటికే చెల్లించబడింది.”
రోహన్ ఆశ్చర్యపోయాడు.
“ఎవరూ చెల్లించారు? నా మామయ్యా?”
సుమిత్ చెప్పాడు:
“లేదు సర్.
ఐదు సంవత్సరాల క్రితం మీ తండ్రి సదాశివరావు గారు మా ఆఫీసుకు వచ్చారు.
అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు.
నడవడమే కష్టంగా ఉంది.
అయన అడిగారు:
‘మీ ప్యాకేజ్ ఏమిటి?
నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా?’
మేము వివరాలు చెప్పాము.
అదే రోజు ఆయన ముందస్తుగా 50,000 రూపాయలు చెల్లించారు.
మరియు ఈ లేఖ ఇచ్చారు.
‘నా కొడుకు వచ్చినప్పుడు ఇది అతనికి ఇవ్వండి.
అతను రాకపోతే నా అంత్యక్రియలు మీరు చేయండి’ అన్నారు.”
సుమిత్ ఆ లేఖను రోహన్‌కు ఇచ్చాడు.
కంపిస్తున్న చేతులతో రోహన్ దాన్ని తెరిచాడు. 🫥
తండ్రి వణుకుతున్న చేతిరాతలో ఇలా ఉంది:
⸻
“ప్రియమైన రోహన్,
రోహి చిన్ను , నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు.
అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు.
నా మరణ వార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుందని తెలుసు.
‘లీవ్ దొరుకుతుందా?
టికెట్ దొరుకుతుందా?
మీటింగ్ ఏం అవుతుంది?’
🤌ఇవే ప్రశ్నలు నిన్ను వేధిస్తాయి.
చిన్ను , నీ సమయం, నీ కెరీర్ చాలా ముఖ్యం.
నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను.
ఒక ముసలివాడి మృతదేహం కోసం కష్టాలు, నష్టాలు పడొద్దు.
అందుకే నా మరణానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాను.
ఏజెన్సీకి డబ్బు చెల్లించాను. వాళ్లు చూసుకుంటారు.
నువ్వు వస్తే మంచిది. రాకపోయినా నేను కోపపడను.
ఒకే ఒక్క అభ్యర్థన…
🤝 చిన్నప్పుడు నిన్ను స్కూల్‌కు తీసుకెళ్తూ నేను నీ చేతిని ఎప్పుడూ వదల్లేదు.
ఈ రోజు నువ్వు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు
నీ చెయ్యి వణకకూడదు. 🫰
త్వరగా వెళ్ళు. నీ భార్య ఎదురు చూస్తోంది.
నీ
నాన్న.”
⸻
లేఖ చదివిన వెంటనే రోహన్ చేతిలోని చెక్‌బుక్ క్రింద మట్టిలో పడిపోయింది.
చితి మంటలు వెలుగుతున్న, మోగుతున్న ఆ శ్మశానంలో…
రోహన్ కెరీర్‌పై ఉన్న గర్వం, అహంకారం బూడిదైపోయాయి.
అతను మోకాళ్లపై పడిపోయాడు.
“నాన్నా… నన్ను క్షమించు నాన్నా!”
రోహన్ సుమిత్ కాళ్లను పట్టుకున్నాడు.
“సుమిత్, నాకు అమెరికాకు వెళ్లాలి అనిపించడం లేదు!
నాకు నా నాన్నతో ఉండాలి!😢
నేను కోట్ల సంపాదించాను కానీ ఇప్పుడు భిక్షగాడిగా అయ్యాను!
నా తండ్రి తన మరణ సమయానికీ నా మీటింగ్ గురించి ఆలోచించాడు…
నేను మాత్రం ఆయన అంత్యక్రియల ధరపై బేరసారాలు చేశాను ?”
🙄😢
ఆ రోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు.
రాత్రంతా చితి ముందు కూర్చున్నాడు.
ఎందుకంటే చివరకు అతనికి అర్థమైంది—
🤢 “ప్రీపెయిడ్” సిమ్ కార్డుకి ఉండొచ్చు…
🙏 కానీ తండ్రి ప్రేమ ఎప్పుడూ ప్రీపెయిడ్ కాదు.
💅తండ్రి ప్రేమ అనంతం —
దానికి ప్రపంచంలో ఎలాంటి కరెన్సీతో చెల్లించలేం.
⸻
ప్రపంచంలో ఎంత పెద్దవాళ్లైనా…
ఎంత డబ్బు సంపాదించినా…
మీ డైపర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరలో మీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు 👍👍
అసౌకర్యంగా అనిపించి దూరం కాకండి.
ఏజెన్సీ అంత్యక్రియలు చేయగలదు.
కానీ కన్నీళ్లు…
అవి అవుట్సోర్స్ చేయలేము.
అవి రక్తం నుంచే రావాలి.
🙏
కర్టెసీ K S Nagabhushana Rao.
ఈ 2011 ప్రపంచ కప్ 90s కు ఒక మధుర జ్ఞాపకం ❤️
తొలి మ్యాచ్ భారత్ - బంగ్లా నుండి మొదలు పెడితే ఫైనల్ శ్రీలంక మ్యాచ్ వరకు ప్రతి మ్యాచ్ కదలిక నాలో ఇంకా మెదులుతూనే ఉంటుంది.
ఇండియా లో ఎక్కువ మందిని క్రికెట్ అభిమానులగా మలిచిన వరల్డ్ కప్ ఇదే అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.
ఈ వరల్డ్ కప్ తరువత 3 వరల్డ్ కప్ లు జరిగాయి. అందులో ఒక వరల్డ్ కప్ భారత్ లో మళ్లీ నిర్వహించారు, అయినా కూడా ఈ 2011 వరల్డ్ కప్ లాంటి మధురమైన వరల్డ్ కప్ ను అందుకోలేకపోయాయి అనే చెప్పాలి.
గ్రూప్ దశలో నేను చూసిన అద్భుతమైన 42 లీగ్ మ్యాచులు 🔥💥👌
ఒక్క మన దేశపు మ్యాచులే కాదు అన్ని దేశాల మ్యాచులు వీక్షించే వాణ్ణి మధ్యాహ్నం 2 గంటలు మొదలు అయ్యే మ్యాచులు స్కూల్ నుండి ఇంటికి వెళ్లే సమయనికి 25 ఓవర్ కి ఇంటికి వెళ్లి చూసే వాణ్ణి.
మన లీగ్ మ్యాచ్‌లు అన్ని (ఒక్క మ్యాచ్ తప్పిస్తే) మిగతా మ్యాచ్‌లు అన్ని అదివారం లేదా శనివారం ఉండేవి. అలా మన క్రికెట్ అభిమానులందరికీ సహకారంగా ఉండేవి మ్యాచ్ లను వీక్షించడానికి.
ఈ వరల్డ్ కప్ లో మన జట్టు ప్రదర్శన చూస్తే కప్ మనకు కాకుండా వేరే వాళ్లకు వెళ్లదు అని భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే పక్కా జట్లు కూడా భారీ స్థాయిలో మంచి ప్రదర్శనతో పోటీ పడేవి.
నాకు మన లీగ్ మ్యాచ్ ఇంకా గుర్తు అప్పటికే డిఫెండింగ్ చాంపియన్ హోదా లో బరిలో ఉన్న ఆసీస్ జట్టు. మనం లీగ్ చివరి మ్యాచ్ చెన్నైలో విండీస్ పై గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్ లో ఆసీస్, ఓడిపోతే శ్రీలంక జట్టుతో మ్యాచ్ అనే పరిస్థితి. ఒక్క క్షణం ఓడిపోతే బాగుండు అని భావించే వాడిని ఆస్ట్రేలియా జట్టును చూసి తరువత అనుకున్నా క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాని ఓడిస్తే ఇక మనం ఈజీ గా ప్రపంచ గెలుస్తాం అనే ధీమా గట్టిగా ఏర్పడింది అలా మనం లీగ్ మ్యాచ్ లో నెగ్గి ఆస్ట్రేలియా పై క్వార్టర్స్ లో విజయం సాధిస్తాం.
నన్ను తీవ్రస్థాయిలో మానసికంగా బాధ కలిగించిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా టీమ్ తో ఓటమి. లీగ్ లో మన 5వ మ్యాచ్. తొలి పవర్ ప్లే లో మనం వికెట్ కోల్పోకుండా చేసిన పరుగులు 87. ఒక దశలో 267/1 స్కోర్ కార్డ్ వద్ద మన పరుగుల అంచనా 400 ఉండేది చేతిలో 9 వికెట్లు ఫార్మ్ లో ఉన్న బ్యాటర్స్. అలా సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ 99వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కానీ డేల్ స్టెయిన్ దెబ్బకు ఒక్కసారిగా కుదేలు అయ్యింది మన బ్యాటింగ్ లైనప్. అలా మనం ఆ మ్యాచ్ ని చివరి ఓవర్ వరకు పోరాడి ఓడిపోతాం.
సెహ్వాగ్, జయవర్ధన, ఆండ్రూ స్ట్రాస్, కెవిన్ ఓబ్రియన్, ర్యాన్ టెండాస్కోట్, దిల్షాన్, యువరాజ్ సింగ్, మలింగ , అఫ్రిది, రాస్ టేలర్, కీమర్ రోచ్, షకీబ్, జహీర్ ఖాన్, సచిన్ లాంటి ఆటగాళ్లు టోర్నమెంట్ కే వన్నె తెచ్చారు.
ఆసక్తిగల విషయలు ఏంటంటే
విలియమ్సన్, డుప్లెసిస్, స్మిత్ వంటి నేటి ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు ఆ వరల్డ్ కప్ లో 8, 9వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే వాళ్ళు. కొన్ని మ్యాచులలో విరాట్ కోహ్లీ 7వ స్థానంలో వచ్చే వాడు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో అయితే చివరి బ్యాట్స్‌మన్ గా వచ్చాడు మన కింగ్ కోహ్లీ 🥲
2011 ప్రపంచ కప్ అద్భుతమైన అనుభూతులను ఇచ్చిన ప్రపంచ కప్ 💥🔥
ఒంటరిగా ఉంటే సత్య చూడండి,
నిరాశగా ఉంటే సత్య చూడండి,
ఏదైనా చేయాలి అనుకుంటే సత్య చూడండి,
ఏదైనా సాధించాలి అనుకుంటే సత్య చూడండి,
ప్రేమలో ఉంటే సత్య చూడండి,
ప్రేమలో విఫలం అయితే సత్య చూడండి,
జీవితం ఆగిపోయింది అనుకుంటే సత్య చూడండి,
కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి సత్య చూడండి
అన్నిటికంటే సినిమాను నేర్చుకోవాలి అనుకుంటే సత్య చూడండి.....
అందరికీ అతని ఎత్తు, బరువు బరువు మాత్రమే తెలుసు!!!?? ఆయన లోతు ఎవ్వరం చూడలేం 💕
కష్టాల గురించి మాట్లాడే అర్హత #కృష్ణుడు కి తప్ప ఎవ్వరికీ లేదు......
పుట్టడమే జైలులో,
పుట్టకముందే సోదరులు అందరూ చనిపోయారు,
కన్నది ఒక తల్లిదండ్రులు ( దేవకీ, వసుదేవుడు),
పెంచింది ఇంకో తల్లిదండ్రులు ( యశోద, నందుడు),
ట్రాజెడీ ఏంటంటే!?? యశోద సొంత కొడుకు అనే అనుకోవడం 🥹
కంసుడి లాంటి మామయ్య,
పూతన, చెరువులో పాము చంపాలని అనుకోవడం. ఇదంతా టీనేజ్ లోనే 🙏
సుభద్ర పెళ్ళికి బలరాముడుతో గొడవ,
ప్రాణంగా ప్రేమించిన రాధకి దూరం,
సత్యభామతో పెళ్లికి నిందలు,
భార్యల మధ్య మనస్పర్థలు,
ధర్మం వైపు ఉన్నా సరే గాంధారి శాపం.....
ఇంత జరుగుతున్నా నవ్వుతూ ఉన్నాడు,
యుద్ధంలో #భగవద్గీత చెప్పాడు. 🔥🔥🔥
( గోపికలు, అల్లరి, బృందావనం, భార్యలు ఇవన్నీ బయటకి మాత్రమే) "కృష్ణం వందే జగద్గురుం"
Somnath stands as a beacon of eternal divinity. Its sacred presence continues to guide people across generations. Here are highlights from yesterday’s programmes, including the Omkar Mantra chanting and drone show.
#SomnathSwabhimanParv
ఆ సీతమ్మ ఆశీస్సులతో “ నా అన్వేష్ “ పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల తో పంజాగుట్ట స్టేషన్ లో FIR అయ్యింది. నోటీసులు కూడా జారీ చేస్తాం అన్నారు..పోలీసులు
వీడిని భారత్ తీసుకురావడానికి మొదటి అడుగు పడింది. హిందూ దేవి దేవతలను, హిందువులను దూషిస్తే ఏం జరుగుతుందో వీడి జీవితం ఒక ఉదాహరణ గా ఉండేటట్లు చేద్దాం !
💔
బాపు.. నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా..
నువ్ లేకుండానే తెల్లారింది..
నువ్ లేకుండానే ఓదెల లేచింది..
నువ్ లేకుండానే ఇల్లూ లేచింది.
కల్లాపి తో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది..
“ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు..
“ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు
ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు!
చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది..
గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నెన్నే కదా అనిపిస్తోంది..
నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక..
మనం దున్నిన జంబు అరక..
పత్తి మందుకు పంపు..
పల్లి చేను లో సద్ది..
మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు..
ఇక అన్నీ జ్ఞాపకాలేనా?
దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు..
మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు..
ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా?
ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి..
నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో..
కానీ మళ్లీ రా..
🙏🏾
వాడు
వాడు పుడతాడు, వాడు మాగాడేలే అని మొలతాడుతో వదిలేస్తారు.
వాడు నడుస్తాడు, పడతాడు, ఏడిస్తే వాడే ఊర్కుంటాడులే అని వదిలేస్తారు.
వాడు బడికెళ్తాడు, ఎవరో ఏడిపిస్తే, ఏంట్రా ఆడదానిలా ఏడుస్తున్నావ్ అని ఎదిరిస్తారు.
వాడు డప్పు వాయిస్తాడు, ఏరా చావుమేళంలో చేరుతావా అని చిన్నవయసులోనే కలల్ని, కళల్ని చిదిమేస్తారు.
వాడికి యుక్తవయసులో నిద్రలో నిక్కరు తడిసిపోతుంది, మనసు కంగారు పడుతుంది, వాడికెవరూ అది ప్యూబర్టీ అని వివరించరు.
వాడేదో చదవాలనుకుంటాడు, ఇది చదివితే నీకు పిల్లనెవడిస్తాడు అని బెదిరిస్తారు.
వాడేదో ఉద్యోగం అని తిరుగుతాడు, ఇంకా పెళ్ళవ్వలేదా అని పొడుస్తారు.
వాడేదో పెళ్ళానికి సాయం చేస్తాడు, ఆడారోడా అని వెక్కిరిస్తారు.
వాడి పెళ్ళాం పురిటినొప్పుల్లా పిల్లలకోసం వాడి గుండెబరువు కనపడదు, కనపడనిది లేనట్లే.
వాడికేదో జన్యువుల వలన జుట్టూడిపోతుంది, అదేదో శాపం అన్నట్లు వాడిని అదోలా చూస్తారు.
వాడెప్పుడూ పాపం వాడిది కొలుచుకుని, పోల్చుకుని మధనపడిపోతుంటాడు, దానికి పదును ఉంటే చాలు పొడవుతో పనిలేదని ఎవరూ చెప్పరు.
వాడేదో సంపాదిస్తాడు, అన్ని వాయిదాలూ కట్టి వాడి వ్యాయామం వాయిదా వేస్తుంటాడు.
వాడికి డయాబెటీసు, హైపర్టెన్షను అన్నీ ముందే వస్తాయి, రాకపోతే టెన్షన్ పడిపోతాడు, నేనంత టెన్షన్ పడట్లేదేమో అనీ.
వాడి పిల్లలు హాస్టల్‌కి పోతేనో, విదేశాలు పోతేనో, ఒంటరిగా స్నానం చేసేటప్పుడు వాళ్ల పేర్లు నోరారా పలుకుతాడు, వాడికెవరూ డబ్బులకోసం తప్పితే జాబులు రాయరు.
వాడి అమ్మానాన్నల్ని మలివయసులో ఎత్తి దించుతాడు, అది వాడి బాధ్యత అంటారు, వాడేదో అలసట లేని యంత్రం అయినట్లు.
వాడికేవో మనసులో మాటలుంటాయి, వాటికి ముసుగేసి కప్పేస్తాడు, పైకెప్పుడూ ముసిముసిగా నవ్వుతుంటాడు.
వాడి బాధ లోకం చూడడు, వాడు చెప్పడు, ఇక చూడనిది, చెప్పనిది, లేనిది అది.
Visited the under-construction Bullet Train Station at Surat in Gujarat yesterday and reviewed the progress of the Mumbai-Ahmedabad High-Speed Rail Corridor. Also got the opportunity to interact with the team working on India’s first Bullet Train project.