అమెరికాలో ₹85,000... భారతదేశంలో కేవలం ₹35 అని చెప్పుతూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విదేశీ మహిళ....
ఇటీవల ఒక అమెరికన్ మహిళ మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు వాడే ఒక టాబ్లెట్ ధర అమెరికాలో అక్షరాలా $1,000 (సుమారు ₹85,000) ఉంటే, అదే నాణ్యత కలిగిన జనరిక్ ఔషధం (మందు) భారతదేశంలో "ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన #PMBJP " ద్వారా కేవలం ₹35 నుండి ₹300 లకే లభిస్తుండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది..
“మా కొద్దీ తెల్ల దొరతనం”పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోటా మార్మోగేది.పాట రచయిత శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ…వారి గురుంచి క్లుప్తంగా..
గరిమెళ్ళ సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం,గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న సూరమ్మ, వెంకట నరసింహం పుణ్యదంపతులకు జన్మించారు.
గరిమెళ్ళ ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది.విజయనగరం,మచిలీపట్నం,రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.కొద్దిరోజులు గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా పనిచేశారు.ఆ తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా పనిచేశారు.
తెల్లవాడు రకరకాల భేదాలు సృష్టించి, దేశ ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకుంటున్నాడని,భారతీయుల అనైక్యతే వాడి బలమని భావించారు.విదేశీయులకు బానిసలయ్యామని వాపోయాడు.ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ 1920 సం.లో 'మా కొద్దీ తెల్లదొరతనం..' పాటను వ్రాశారు.
గరెమెళ్ళ పాటవిన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతటి మహత్తర శక్తి ఉందో, సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నాడట.ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు.
గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు.క్షమాపణ చెబితే వదులుతామని బ్రిటిషు వారు చెప్పారట.కానీ గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే ఉన్నాడు.అంతటి గొప్ప దేశభక్తుడు ఆయన.
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ భావనాలతో తొణికిసలాడుతూ ప్రజలను ఉర్రూతలూగించాయి. వారు రాసిన “మా కొద్దీ తెల్ల దొరతనం”పాట సత్యాగ్రహులకు గొప్ప ధైర్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే "దండాలు దండాలు భారత మాత” అనే పాట కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది.దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ.
నిజాయితీకి,నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచారు.ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
గరిమెళ్ళ గారు చివరి రోజుల్లో పేదరికంలో మగ్గారు.స్వాతంత్య్రం వచ్చాక ఆనాటి పాలకులు గరిమెళ్ళ గారికి ఏ విధంగా సహాయపడలేదు.వారు 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించారు.
#గరిమెళ్ళసత్యనారాయణ
రోగుల ప్రాణాలను కాపాడటాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావిస్తూ, నిరంతరం కృషి చేస్తున్న ప్రతి వైద్యుడికి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ అంకితభావం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఎంతో విలువైనది.
#NationalDoctorsDay
ఈరోజు కాకినాడ జిల్లా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో SIR గురుంచి సమీక్షా మరియు రాబోయే కార్యక్రమాలు గురుంచి చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
An inspiring interaction with Padma Shri Dr. Purnima Devi Barman in Assam.
Today, after listening to Hon'ble Prime Minister Shri Narendra Modi Ji's #MannKiBaat , where he appreciated the remarkable conservation efforts to protect the Greater Adjutant Stork (Hargila), I had the privilege of meeting Padma Shri Dr. Purnima Devi Barman at her residence.
Her unwavering commitment to conserving the endangered Hargila and empowering local communities through the Hargila Army is truly inspiring. Her journey demonstrates how collective efforts and public participation can create a lasting impact on wildlife conservation.
It was a pleasure to learn about her mission, and I congratulate her for bringing global recognition to Assam's conservation movement. May her inspiring work continue to motivate generations to protect our environment and biodiversity.
స్వర్గీయ శ్రీ పి.వి. చలపతి రావు గారి 92వ జయంతి సందర్భంగా నిర్వహించిన 4వ స్మారక ఉపన్యాస సభను ఘనంగా నిర్వహించడం జరిగింది.
నాలుగవ స్మారక ఉపన్యాస సభలో భాగంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య వీర సావర్కర్ గారి జీవిత విశేషాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో వారి పాత్ర, త్యాగాలు మరియు దేశభక్తిని ప్రతిబింబించే నాటక ప్రదర్శన సభకు విచ్చేసిన సభ్యులను విశేషంగా ఆకట్టుకుని, ముగ్ధులను చేసింది.
సమాజ సేవ, విలువలతో కూడిన ప్రజాజీవితానికి శ్రీ పి.వి. చలపతి రావు గారు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ, ఆయన చూపిన ఆదర్శాలను అనుసరిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని సంకల్పిస్తున్నాము.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో యోగ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
యోగ అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, మనస్సు, శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యతను పెంపొందించే జీవన విధానం. నిత్య జీవితంలో యోగను భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక వికాసాన్ని సాధించవచ్చు.
ప్రపంచానికి యోగ యొక్క విశిష్టతను పరిచయం చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కృషి వల్ల అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడుతోంది. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ యోగను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.
#InternationalYogaDay2026
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, యోగా గురువు @yogrishiramdev గారి నేతృత్వంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు “ఆయుష్ ఆరోగ్య సూత్రావళి” గ్రంథాన్ని ఆవిష్కరించడంతో పాటు, బాబా రామ్‌దేవ్ గారు రూపొందించిన “యోగ నిఘంటువు” గ్రంథాన్ని కూడా విడుదల చేశారు.
చరిత్రలో తొలిసారిగా 3,753 ఆసనాలు, 55 ప్రాణాయామాలు, 721 బంధాలు-ముద్రలు, 120 ధ్యాన విధానాలు, 150 శోధన క్రియలు, 400 యౌగిక వ్యాయామాలు సహా మొత్తం 5,199 యోగ క్రియలను సమగ్రంగా డాక్యుమెంట్ చేస్తూ ఈ గ్రంథాన్ని రూపొందించారు.
సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ గ్రంథాలు యోగ శాస్త్ర సమగ్ర వారసత్వాన్ని భావితరాలకు అందించనున్నాయి.
అలాగే యోగాంధ్ర 2026 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో యోగాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతూ, రాష్ట్రవ్యాప్తంగా 1.67 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం, 2.60 లక్షల మంది యోగా శిక్షకుల కృషితో World Book of Records, London లో స్థానం సంపాదించడం రాష్ట్రానికి గర్వకారణం.
ఈ విశిష్ట విజయానికి గుర్తింపుగా World Book of Records ప్రతినిధుల నుండి చంద్రబాబు గారితో కలిసి అవార్డును స్వీకరించాను.
#Yogandhra2026
#InternationalYogaDay
#BabaRamdev
#ChandrababuNaidu
#AyushArogyaSutravali
#YogaNighantuvu
#WorldBookOfRecords
#AndhraPradesh
విజయవాడలో నిర్వహించిన “BHARAT RISING IN THE MODI ERA” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ @BjpVarma గారితో కలిసి పాల్గొన్నాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధి, సుపరిపాలన, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠ పెరిగిన విధానాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది. పుస్తక రచయిత శ్రీ దిలీప్ గారిని అభినందనలు.
#BharatRisingInTheModiEra
#BookLaunch
#NarendraModi
#ViksitBharat
ఈరోజు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారి ఆధ్వర్యంలో NTR జిల్లా మైలవరం అసెంబ్లీ పరిధిలోని రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.19.60 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రివర్యులు @JoshiPralhad గారు, శాసనసభ్యులు సుజనా చౌదరి గారితో కలిసి వీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆధునికీకరణ పనులు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చిన సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు వివరాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్రగతి పాదయాత్ర" కార్యక్రమంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ @JoshiPralhad
గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం MLA శ్రీ సుజనా చౌదరి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
గొల్లపూడి వద్ద ప్రతిష్టాత్మక వెస్ట్ బైపాస్ 1546 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించాము, ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారు, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులు నాయకులు పాల్గొన్నారు.
#12YearsOfSeva
పుట్టపర్తిలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ప్రగతి నివేదన సదస్సులో పాల్గొన్నాను.
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనను అధిగమించి, నేడు మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. దేశవ్యాప్తంగా వచ్చిన రూ.24 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సింహభాగం రూ.6 లక్షల కోట్లకు పైగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం, కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
అమరావతి నిర్మాణ పనులతో పాటు అమరావతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. నేడు రాయలసీమ ప్రాంతం క్లీన్ ఎనర్జీ, సోలార్, ఎలక్ట్రానిక్స్ తయారీ, రక్షణ పరికరాల తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఆరోగ్య శ్రీ కింద కేవలం రూ.9,000 కోట్లు ఖర్చు చేయగా, మా కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలోనే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.7,000 కోట్లు ఖర్చు చేసింది. రాబోయే మూడేళ్ల బడ్జెట్‌తో కలిపి మొత్తం రూ.17,500 కోట్లు వ్యయం చేయనున్నాం. గతంలో ఏడాదికి 8 లక్షల మంది లబ్ధి పొందగా, నేడు ఏడాదికి 14 లక్షల మందికి ఉచిత వైద్యం అందుతోంది.
అలాగే ధర్మవరం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేశాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దడమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం.
విజయవాడలోని A+ కన్వెన్షన్ హాల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. విజయవాడ రోటరీ క్లబ్ సభ్యులు, నగరంలోని విశిష్ట వ్యక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు @JoshiPralhad గారు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సృజనా చౌదరి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం సాధించిన అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో సాధించిన ప్రగతి వంటి అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో NTR జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, రోటరీ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, నగర ప్రముఖులు, బిజెపి రాష్ట్ర పదాధికారులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలియజేస్తూ సమావేశం కొనసాగింది.
ధర్మవరం పట్టణంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే 300 విద్యుత్ స్తంభాల మార్పిడి, రూ.1.20 కోట్లతో 16 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, TIDCO కాలనీ లో రూ.3.50 కోట్లతో 33/11 కేవీ ఉపకేంద్రం, R&B గెస్టుహౌస్ ప్రాంగణంలో రూ.4.10 కోట్లతో ఇండోర్ సబ్‌స్టేషన్‌కు ఆమోదం, అలాగే దుర్గానగర్, రాంనగర్, తారకరామ్ నగర్, శాంతినగర్, గాంధీ నగర్, శివ నగర్ , సత్య సాయి నగర్, డీఎల్ఆర్, గుడ్డెడ్ కోటాల కాలనీల్లో విద్యుత్ సరఫరా మెరుగుదలకు రూ.4.60 కోట్ల నిధులు మంజూరు చేయించాం.
ఈరోజు గిర్రాజు కాలనీలో రూ.9.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన 100 కేవీఏ అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించాను. దీంతో స్థానిక ప్రజలకు మరింత నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది.
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#Dharmavaram
#PowerForProgress
#APSPDCL
#ElectricityInfrastructure
#QualityPowerSupply
#PeopleFirst