తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సత్తుపల్లిలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు మంథని సంపత్, వడ్లకొండ జీవన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు మండల స్థాయి నాయకులకు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జెంజిపోగుల ప్రవీణ్, మిరియాల శివాజీ, సయ్యద్ జబీర్, ఆళ్ల నరేశ్, సింగపోగు అప్పారావు, దార్ల రవివర్మ, వలపుల నాగబాబు, దండు కరుణ, పులి రాజేష్, తాళ్లూరి నరసింహారావు, సాయి కిరణ్, గొల్లమందల లక్ష్మణ్, భుక్య నాగప్రసాద్, ఉయ్యూరు పవన్, పినిశెట్టి కృష్ణ, గోపిశెట్టి కిషోర్, తోట కిషోర్, గోపిశెట్టి శివ నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతోంది. సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకల సందర్భంగా బైక్ ర్యాలీలో ప్రమాదవశాత్తూ మరణించిన పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు అడపా మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.4.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికుడు శ్రీ అనిశెట్టి స్వామి గారు రూ.2.5 లక్షలు, పి. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ @GiddiJSP_ గారు రూ.1 లక్ష, అయినవిల్లి మండల అధ్యక్షులు శ్రీ రాజేష్ పోలిశెట్టి గారు రూ.50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర గారు రూ.50 వేలు అందించారు.
తోటి జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
@JanaSenaParty@JSPShatagniTeam
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించిన అమలాపురం నియోజకవర్గం బెండమూరులంక గ్రామానికి చెందిన జనసైనికుడు రోళ్ళ ప్రేమ్ కుమార్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.3.5 లక్షలు ఆర్థిక సహాయం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీ అనిశెట్టి స్వామి రూ.2.5 లక్షలు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పంచకర్ల సందీప్ రూ.50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర రూ.50 వేలు అందించారు.
ఈ సందర్భంగా రోళ్ళ ప్రేమ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ నివసిస్తున్న కోరకంటి నాగబాబు గారు గుండెపోటుతో దుబాయ్ లో మరణించడం బాధాకరం. జనసేన పార్టీ తరఫున UAE జనసేన టీమ్ వారి తరపున ఈరోజు రూ.1 లక్ష ఆర్థిక సహాయం పిఠాపురం జనసేన నాయకుల సమక్షంలో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కోరకంటి నాగబాబు గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మీద అభిమానంతో, సమాజం మీద బాధ్యతతో 2009 యువరాజ్యం సమయం నుండి నేటి వరకు పనిచేస్తున్న కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు శ్రీ అచ్యుతరాయుడు గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.5 లక్షల ఆర్థిక సహాయం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా NRI జనసేన UK బృందం వారు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ అచ్యుతరాయుడు గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
@JANASENA_UK
The passing of legendary Indian actor, National Award-winning artiste, and Padma Shri awardee Sri Nana Patekar Ji, is deeply painful. Over four decades, he brought extraordinary depth and authenticity to every role, from comedy to emotional, and from intense drama to the finest shades of human emotion, leaving an indelible mark on Indian cinema.
Beyond his remarkable contribution as an actor, his work as a social worker and his commitment to serving society will also be remembered with great respect.
I convey my deepest condolences to his family, loved ones, colleagues, and countless admirers.
Om Shanti.
#NanaPatekar
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి.
పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సమస్యలపై స్పందించే విధానం, మీడియా వ్యవహారశైలి, సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన వంటి కీలక అంశాలపై శిక్షణ అందించారు.
ప్రజల సమస్యలను బలంగా, బాధ్యతాయుతంగా ప్రజల తరఫున వినిపిస్తూ, పార్టీ వాణిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలా అధికార ప్రతినిధులకు ఈ శిక్షణ ఉపయోగపడింది.
#JanaSenaTelangana #JSPForTelangana