@Collector_WGL@TelanganaCMO@seethakkaMLA
వరంగల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే మిషన్ భగీరథ నీరు వృథాగా డ్రైనేజీలో కలుస్తోంది. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
@cpwarangal@warangalpolice@SHO_Narsampet
నర్సంపేట: బాధితులకు సాయం చేసిన SI
https://t.co/S6snK5qPKD
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, బాధితులకు భరోసా కల్పించడంలో WGL కమిషనరేట్ పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నర్సంపేటలో పోలీసులు అందించిన స్పందించిన తీరు అభినందనీయం.
@Collector_WGL@IPRTelangana@iamkondasurekha@bandisanjay_bjp
WGL:NALLABELLY కాకతీయుల కాలం నాటి చారిత్రక శివాలయం.. నేడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది! 700+ ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం పూజలకు కూడా నోచుకోకపోవడం బాధాకరం. దయచేసి సంబంధిత అధికారులు స్పందించండి.
@cpwarangal@warangalpolice@SHO_Narsampet
పోలీసు శాఖలో ఒకే ఉద్యోగి 18 ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహించడం ఆందోళనకరం. పరిపాలనా పారదర్శకతకు సవాలు.. సుదీర్ఘకాలం ఒకేచోట కొనసాగడం వ్యక్తిగత పలుకుబడికి దారితీయదా? ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వ ప్రతిష్ఠకు, పోలీసు వ్యవస్థ విశ్వసనీయతకు ముప్పు.
@cpwarangal@warangalpolice
నర్సంపేటలో బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న గొడవకూ తావులేకుండా సీఐ ముస్కె శ్రీనివాస్ సమన్వయంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. వారి సేవలకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
@TelanganaDGP@TelanganaFire@TelanganaCMO
వరంగల్ జిల్లా నర్సంపేట అగ్నిమాపక కేంద్రానికి పక్కా భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదమంటే చాలు.. ప్రాణాలకు తెగించి పరుగులు తీసే అగ్నిమాపక సిబ్బందే నేడు అవస్థలు పడుతున్నారు. కనీస వసతులు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.
@KTRBRS@patnam_avinash
Your compassionate and humanitarian response is truly admirable. Thank you for giving that little girl courage, hope, and emotional support.
THANKS KTR ANNA and AVINASH REDDY ANNA 🤎🤝👏🏽
@KTRBRS@BRSHarish
“భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి?” అని అడిగితే.. ఓ చిన్నారి “చనిపోయిన నా నాన్న కావాలి” అని సమాధానం రాసింది.
ఆ మాటల్లో తండ్రిని కోల్పోయిన ఆ పాప గుండెల్లోని బాధ ఎంత ఉందో అర్థమవుతోంది.
ఆ చిన్నారి కన్నీటికి ఓదార్పుగా, ఆమెకు ధైర్యం, భరోసా కల్పించాలని కోరుతున్నాం.
@Dept_ofAgriTG@TelanganaCMO@Collector_WGL
నల్లబెల్లి గ్రోమోర్ సెంటర్లో కల్తీ కోరమండల్ పొటాష్ విక్రయించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
రైతు కొనకటి రాజు కొనుగోలు చేసిన 3 బస్తాల్లో మట్టి అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
గోదాములోని మరో బస్తాలోనూ ఇదే పరిస్థితి కనిపించిందంటున్నారు.
@vata_foundation@SajjanarVC_IPS@Collector_WGL
నర్సంపేట: నేలకొరిగిన ఓ మర్రిచెట్టు తిరిగి చిగురిస్తూ కనిపించింది. చెట్టు కొమ్మలు నేలను తాకేలా పడిపోయినా.. జీవించే తపనతో కొత్త చిగుళ్లు వేయడం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. దీనిని మరోచోటికి తరలించి సంరక్షించాలని కోరుతున్నారు