ఈ రోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 3వ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–2026 ముగింపు కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ గారు, ఐపీఎస్, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆరు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 16 జోనల్, ప్రత్యేక విభాగాలకు చెందిన 421 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పోటీలు ప్రధానంగా ఆరు అంశాల్లో నిర్వహించబడ్డాయి.
-> దర్యాప్తులో శాస్త్రీయ సహాయక పద్ధతులు
-> యాంటీ సబోటేజ్ తనిఖీలు
-> డాగ్ స్క్వాడ్
-> ఐటీ నైపుణ్యం
-> పోలీస్ ఫోటోగ్రఫీ
-> పోలీస్ వీడియోగ్రఫీ
డిసెంబర్ 15 నుంచి ముంబైలో ప్రారంభం కానున్న ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇదే ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కొనసాగించాలని పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డీజీపీ గారు సూచించారు. వరుసగా నాలుగోసారి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి, ప్రోత్సాహకాలు, రివార్డుల విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
డ్యూటీ మీట్లు, క్రీడా పోటీలు పోలీస్ సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడానికి, విధి నిర్వహణలో ప్రమాణాలను మరింత పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తాయని డీజీపీ గారు పేర్కొన్నారు.
విజేతలందరికీ డీజీపీ గారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TGPA డైరెక్టర్ మరియు వారి బృందానికి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మరియు వారి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇన్చార్జి డీఐజీ ఎన్.శ్వేత, ఐపీఎస్.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇన్చార్జి డీఐజీ ఎన్.శ్వేత, ఐపీఎస్ బుధవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి తదితర అంశాలను పరిశీలించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ముందుగా కేసముద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.సత్యనారాయణ సీపీకి పూల మొక్కను అందించి స్వాగతం పలుకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
ఈ తనిఖీలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్, కేసముద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతి కిరణ్, ఇనుగుర్తి ఎస్ఐ పి. నరేష్, నెల్లికుదురు ఎస్ఐ జి.కర్ణాకర్ లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
ట్రై సిటీ పరిధిలోని వాకర్స్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి
ఈ నెల 29-11-2026 (ఆదివారం) రోజున తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్షను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రై సిటీ పరిధిలోని 32 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ మరియు భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరీక్షా కేంద్రాలుగా ఉన్న కళాశాలలు, పాఠశాలల మైదానాల్లో వాకర్స్‌కు తాత్కాలికంగా అనుమతి ఉండదు.
కావున ట్రై సిటీ పరిధిలోని వాకర్స్ అందరూ ఈ నెల 28-11-2026 (శనివారం) సాయంత్రం 6 గంటల నుండి 29-11-2026 (ఆదివారం) ఉదయం వరకు ఈ క్రింది పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు రావద్దని సూచించారు.
1. సెయింట్ గాబ్రియేల్ హై స్కూల్, కాజీపేట.
2. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, హనుమకొండ.
3. కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండ.
4. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్.
5. లాల్ బహదూర్ కళాశాల, వరంగల్.
6. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్.
పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు వాకర్స్ మరియు ప్రజలందరూ సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు.
@TelanganaDGP@TelanganaCOPs
Today, Telangana DGP Shri C.V. Anand, IPS, presented prizes to the winners of the 3rd Telangana Police Duty Meet 2026, which concluded at TGPA after three days of competition involving 421 personnel from 16 zonal and specialised wings across six disciplines: Scientific Aids to Investigation, Anti-Sabotage Checks, Dog Squad, IT Proficiency, Police Photography and Police Videography.
The DGP encouraged all participants to carry this momentum forward as the force prepares for the All India Police Duty Meet in Mumbai from December 15, with the goal of securing the overall championship for the fourth consecutive time. He assured them of all necessary support through training, upskilling, rewards and incentives.
He emphasised that Duty Meets and sports competitions provide valuable opportunities to refine professional abilities, exchange best practices and raise professional standards across the force.
The DGP congratulated all the winners and appreciated all officers and teams involved in organising the event successfully.
లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు ప్రభుత్వ పునరావాసం కల్పించేందుకు, పోలీస్ కమిషనర్, హనుమకొండ కలెక్టర్ తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం
లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం ద్వారా అందించాల్సిన ప్రయోజనాలను సమర్థవంతంగా అమలు చేసి, వారికి మెరుగైన జీవనోపాధి కల్పించే దిశగా గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ గార్ల సమక్షంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా, హనుమకొండ జిల్లా పరిధిలో పునరావాసానికి అర్హులైన 11 మంది లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చించారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని, స్థలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు.
అదేవిధంగా లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పునరావాస ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, డీఆర్డీవో మేన శ్రీను, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బీ ఈఈ దేవిక చౌహాన్, ఏసీపీ జానీ నరసింహులు, పలువురు తహసీల్దార్లు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
CP Madam, Warangal sanctioned 13 CCTV cameras in Mills Colony PS limits covering Shivanagar, Fort Road, Shambunipet, Mahankali Temple.SHO K. Swamy, SI Rajesh Reddy inaugurated the cameras to strengthen surveillance and enhance public safety.@cpwarangal@dcpczwrl@TelanganaDGP
తొర్రూరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇన్చార్జి డీఐజీ ఎన్. శ్వేత, ఐపీఎస్.
వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇన్చార్జి డీఐజీ ఎన్. శ్వేత, ఐపీఎస్ బుధవారం తొర్రూరులోని డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులు, విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో సమావేశమై పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్, తొర్రూరు డీఎస్పీ కె. కృష్ణ కిషోర్‌లు సీపీకి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్, తొర్రూరు డీఎస్పీ కె. కృష్ణ కిషోర్, తొర్రూరు సీఐ టి. గణేష్, మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్, తొర్రూరు ఎస్ఐ టి. మహేందర్ రెడ్డితో పాటు దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, పెద్దవంగర, సీరోల్, మరిపెడ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs #ThorrurDSPOffice
A video call, a suspicious parcel, threats of arrest, or demands to keep everything secret these could be warning signs of a Digital Arrest Scam.
Be aware. Be alert. Stay safe!
#TelanganaPolice
Driving on footpaths endangers pedestrians and may cause serious accidents.Respect pedestrian rights, follow traffic rules, keep footpaths safe.Use roads for driving,not footpaths.Public Cooperation for Safer Warangal. Dial-112.@cpwarangal@warangalpolice@dcpczwrl@TelanganaDGP
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం*
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల ప్రగతి తదితర అంశాలపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీ స్థాయి అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి, వాటి దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశంపై సంబందించిన అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ప్రధానంగా పెండింగ్ కేసుల్లో నిందితుల అరెస్టు, నిందితులు పరారీలో ఉన్నట్లయితే వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ త్వరితగతిన అరెస్టు చేయాలని.
కేసుల దర్యాప్తు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దర్యాప్తులో జాప్యం కారణంగా కేసులు పెండింగ్‌లో ఉండకుండా, ప్రతి కేసుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దర్యాప్తును, అవసరమైన చోట సాంకేతికతను ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు, ఆస్తి నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు, తీవ్రమైన నేరాలు తదితర కేసుల దర్యాప్తు పురోగతితో పాటు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందే విధంగా కేసుల దర్యాప్తును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను అదేశించడం జరిగింది.
ఈ నేర సమీక్షా సమావేశంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీ(పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచి ఎసిపి మధుసూధన్, క్రైమ్ ఎసిపి సదయ్య, సిసి ఆర్ బి ఎసిపి డేవిడ్ రాజ్ , హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, పరకాల, వర్దన్నపేట, మామునూర్, స్టేషన్ ఘనపూర్ ఎసిపి లు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ సాయిరమణ, టిజినాబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఐటీ కోర్ అధికారులు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
The Telangana Police Pipe Band won the Silver Trophy (2nd place) in the All India Band Competition hosted by the CRPF at the 99th Battalion Headquarters in Shameerpet. 🏆
Telangana DGP Shri C.V. Anand, IPS, had inaugurated the event the previous week. Over the next six days, intense competition took place among teams from across the country in six different categories of band displays and competitions.
He congratulated all the band members on their remarkable performance. 💐💐
షామీర్పేటలోని 99వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీస్ పైప్ బ్యాండ్ రజత ట్రోఫీ (రెండో స్థానం) కైవసం చేసుకోవడం పట్ల డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ గారు సంతోషం వ్యక్తం చేశారు. 🏆
గత వారం తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ గారు ఈ పోటీలను ప్రారంభించగా, ఆరు విభాగాల్లో జరిగిన బ్యాండ్ ప్రదర్శనల్లో దేశంలోని వివిధ బృందాల మధ్య ఆరు రోజుల పాటు హోరాహోరీ పోటీ నెలకొంది.
బ్యాండ్ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. 💐💐
Telangana DGP Shri C.V. Anand, IPS, chaired a mini staff officers’ meeting to review and discuss the following key matters:
1. Next month’s Police Retreat.
2. Women Police Officers Conference.
3. New Telangana Police Manual completion and release.
4. Revival of Police Brass and Pipe Bands.
5. State Duty Meet conduct.
6. All India Police Cricket Tournament conduct.
7. Preparation of annual training calendar for the state.
8. 2000 Home Guards recruitment and notification details.
9. TG Police Sanctioned strength re fixation as per present needs.
10. Retired police officers welfare measures.
The DGP assigned tasks and fixed deadlines for their completion.
20-11-2026న హనుమకొండలోని సుబేదారిలో గల అసుంత భవన్లో జిల్లా స్థాయి వార్షిక సమన్వయ సమావేశం మరియు బాలల హక్కుల వారోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో బాలల హక్కులు, బాలల రక్షణ, భద్రత మరియు బాలలపై జరిగే నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు నెలలుగా క్లస్టర్ వారీగా నిర్వహిస్తున్న 2026 పోలీస్ క్రీడా పోటీల్లో భాగంగా, రాష్ట్ర స్థాయి క్రికెట్ క్లస్టర్ పోటీలను ఫ్యూచర్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో అజీజ్‌నగర్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు.
మొట్టమొదటిసారిగా జోన్లు, పోలీస్ కమిషనరేట్లు, వివిధ విభాగాలకు చెందిన మొత్తం 21 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. నాలుగు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల అనంతరం, నేడు హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ పోలీస్ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌తో టోర్నమెంట్ ముగిసింది. ఈ పోటీలో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ అభినందనలు తెలియజేశారు.
తాను సైబరాబాద్ జట్టు తరఫున ఆడాలని అనుకున్నప్పటికీ, ముఖ్యమైన సమావేశాల కారణంగా పాల్గొనలేకపోయారు. అయితే గ్రౌండ్‌కు వెళ్లి క్రీడాకారులతో మాట్లాడి వారిని అభినందించారు.
ఈ టోర్నమెంట్ పోలీస్ సిబ్బందిలోని క్రీడా ప్రతిభను వెలికితీయడానికి మంచి వేదికగా నిలిచిందని, నలుగురు సీనియర్ రిటైర్డ్ రంజీ క్రికెట్ క్రీడాకారులు సెలెక్టర్లుగా వ్యవహరించారని, ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, వచ్చే నెలలో తెలంగాణ పోలీసుల ఆతిథ్యంలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ పోలీస్ క్రికెట్ జట్టుగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనున్నట్లు డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ గారు పేర్కొన్నారు.
ఎస్ఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు వరంగల్ సీపీ శుభాకాంక్షలు .
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా (ఏఎస్ఐలు) విధులు నిర్వహిస్తూ, సబ్-ఇన్స్పెక్టర్లుగా (ఎస్ఐలు) పదోన్నతి పొందిన అధికారులు ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పదోన్నతి పొందిన వారిలో టి.కమల, ఎం.రాజేందర్, ఏ.సగాయమ్మ, వై.కాసులు, కె.పద్మ, ఎన్.లక్ష్మి, కె.సంతోష, సి. హెచ్.పద్మ ఉన్నారు.
ఈ సందర్భంగా సీపీ నూతనంగా పదోన్నతి పొందిన ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
@TelanganaDGP@TelanganaCOPs@warangalpolice #Warangal #Hanumakonda
Continuous police patrolling will be conducted across A J Mills Colony limits. Regular checks of rowdy sheeters and lodges will be carried out to prevent criminal activities, maintain law and order, and ensure public safety.@cpwarangal@warangalpolice@dcpczwrl@shointhezargunj
విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పట్టివేత
ముగ్గురు నిందితుల అరెస్ట్, నలుగురు బాలుర అదుపులోకి
రూ.18.44 లక్షల విలువైన 84 విద్యుత్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన వాహనాలు స్వాధీనం
వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, మరో నలుగురు బాలురను (CCL) అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.18,44,800 విలువైన 84 విద్యుత్ నీటి మోటార్లతో పాటు, దొంగతనాలకు ఉపయోగించిన నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో నర్సంపేట సబ్ ఇన్స్పెక్టర్ రాజన్ బాబు తన సిబ్బందితో కలిసి రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వరంగల్ CCS పోలీసుల సహకారంతో విచారించగా, నిందితులు DJ ఆపరేటర్లుగా, స్టేజ్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు వెల్లడైంది. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ, ములుగు మండలాల పరిధిలోని శివారు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను దొంగిలిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు.
దొంగిలించిన మోటార్లను విక్రయించేందుకు రాజుపేట గ్రామ శివారులోని చెట్ల పొదల్లో దాచిపెట్టినట్లు నిందితులు వెల్లడించడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 84 విద్యుత్ నీటి మోటార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ప్రధాన నిందితులు:
1. హంస ప్రశాంత్ (27)
2. అన్న శివప్రసాద్ (22)
3. ఎస్.కె. దస్తగిరి అలియాస్ షైర్ (20)
వీరితో పాటు మరో నలుగురు బాలురను (CCL) అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
1. 84 విద్యుత్ నీటి మోటార్లు – విలువ సుమారు రూ.18,44,800.
2. ట్రాలీ ఆటో – 1
3. ప్యాసింజర్ ఆటో – 1
4. పల్సర్ మోటార్ సైకిల్ – 1
5. షైన్ మోటార్ సైకిల్ – 1
రైతులకు పోలీసుల సూచన:
రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా, మోటార్ల దొంగతనాలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. దొంగతనాల నివారణకు పోలీసులకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఈస్ట్ జోన్ డిసిపి నగదు రివార్డులను అందజేశారు,
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీబీ రవీందర్ రెడ్డి నర్సంపేట ఇన్స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజన్ బాబు సిసిఎస్ ఇన్స్పెక్టర్ లు హరికృష్ణ రాఘవేందర్రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs@dcpeastzonewrlc
మామునూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ సీపీ ఎన్.శ్వేత, ఐపీఎస్.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ గారు మంగళవారం నాడు మామునూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను, పెండింగ్ కేసుల వివరాలను, కేసుల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణను సమీక్షించి పలు సూచనలు చేశారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యమైన దర్యాప్తుతో కేసులను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.
డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పోలీస్ సిబ్బందికి సీపీ సూచించారు.
ఈ తనిఖీలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పర్వతగిరి సీఐ ఆర్.సంతోష్ కుమార్, మామునూరు ఇన్స్పెక్టర్ ఈ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs #WarangalPolice @Sho_Mamnoor