అనగదొక్కలని చూసిన ప్రతిసారి ఉవ్వెత్తునయెగిసిపడే కెరటం లా గా కాన్షిరాం పనివిధానం తో ముందుకు పోతాం ప్రవీణ్ సర్ అడుగుజాడల్లో అధికారం వైపు ముందుకు వెళతాం...@SravanOnteru @BSP4Telangana @BITCELL_BSP
@KTRBRS @TSwithKCR లంత పిరికిపందలను నేనెక్కడా చూడలే!
జిల్లాలలో మీ పర్యటనలుంటే రాత్రికి రాత్రి బీయస్పీ కార్యకర్తలను అరెస్టు చేసుడేంది? మేమెక్కడా మీ సభలను అడ్డుకోవడం లేదు, అయినా మీ లాంటి దుష్ట సంప్రదాయం మాకు లేదు. ఈ విషయంలో కోర్టుకు పోతాం. #KTRtheCoward
Instead of negotiating with the agitating students and protestors, Govt of India and Delhi Police chose to apply brutal force and silence their voices. All that they are demanding is to bring the perpetrators of NEET leakage including Union Education Minister Mr Dharmendra Pradhan to justice!
BJP Govt is neither educated nor cares for education. It only knows the language of oppression.
#SayNo2BJP
#NEET
#LeakGate
తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతుంటే...
యువత చూస్తూ ఊరుకుంటారా?
Yuva Sangrama Sadassu proved it.
The strength of Telangana youth and the power of their voice, in full display!
#YuvaSangramaSadassu#JaiTelangana#JaiKCR
పోలీసుల నిర్భందపు వలయాన్ని దాటి నేను సరూర్ నగర్ సభకు వస్తున్న. నన్ను నార్సింగి పోలీసులు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం, @revanth_anumula.
బిడ్డ గువ్వల బాలరాజూ, ఎక్కువ ఎగిరితే నీ గువ్వలే పగిలిపోతాయి!🔥😡
పేద, అణగారిన వర్గాల బిడ్డల భవిష్యత్తు కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానేత డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RSP) గారు. విద్యనే ఆయుధంగా మార్చి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, సమానత్వ సమాజం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజానాయకుడు.
@RSPraveenSwaero
కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కి బెయిల్ వచ్చింది
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కాపాడుకునే నాథుడు ఉన్నాడా?
కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్ షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడు
కాంగ్రెస్ నాయకులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇచ్చి మహిళలను కాపాడాలి అంటే ఎలా?
బాధితులను ఓదార్చడానికి పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు.. అదే అరెస్టులు నిందితులను చేయొచ్చు కదా
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
షాబాద్ లో మహిళలపై పోక్సో నిందితుడి పాశవిక హత్యాకాండను నిరసిస్తూ మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, మహిళలు, పిల్లల రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలని, పోక్సో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు🙏🙏🙏
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించే దాకా, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఇలానే ప్రతి గ్రామంలో/బస్తీలో ‘పార్టీలకు అతీతంగా’ స్వచ్ఛందంగా ర్యాలీలు, మౌన దీక్షలు చేయాలని మనవి.
ఒక్కరి కోసం అందరం-అందరి కోసం ప్రతి ఒక్కరం ✊
ఇదే మన నినాదం ✊✊✊
@BRSparty@ANI@PTI_News@IndianExpress@KTRBRS@BRSHarish@thenewsminute
I will brief the media from Telangana Bhavan, Hyderabad at 4 PM today on:
‘Chilling Police Negligence behind Gruesome Shabad Massacre and Telangana’s Missing Home Minister- Revanth Reddy’
Stay Tuned Everyone Except Those With Heart Diseases.
Keep Your Children Away 🙏
ఈ వార్త చాలా పత్రికల్లో చానల్స్ లో రానివ్వరు కావున దీన్ని ఇక్కడే జాగ్రత్తగా చదవండి 🙏
తెలంగాణ రెవెన్యూ & సమాచార పౌరసంబందాల శాఖా మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ₹10,000 కోట్ల భూభారతి కుంభకోణంలో యధావిధిగా మరో అమాయకురాలిని బలిపశువును చేశారు.
పొంగులేటి కోసం సుజాత బలి:
చేయని నేరానికి కుక్కునూరుపల్లి తహసీల్దారు సుజాత గారిని సస్పెండ్ చేశారు. ఈమె ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ అని వేరే చెప్పనక్కరలేదు. ఈమె గురించి ఏ ఎస్సీ లేదా ఎస్టీ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ లు మాట్లాడరు, మాట్లాడకూడదు అని పొంగులేటి-రేవంత్ ల హుకుం! అందుకే అకారణంగా వీరి పై సస్పెన్షన్లు, టార్గెట్ చేసి మరీ ఏసీబీ విజిలెన్స్ దాడులు!
అసలు 10,000 కోట్ల కుంభకోణంలో సస్పెండ్ కావలసింది ఎవరు?
ఈ మొత్తం వ్యవహారంలో సస్పెండ్ కావలసింది మొదట రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు తరువాత సీసీఎల్ఏ మరియు కలెక్టర్లు మరియు మిగతా అధికారులు. ఎందుకంటే భూభారతి పోర్టల్ తాళం చెవులు ముఖ్యంగా వీరిద్దరి ఆధీనంలోనే ఉంటాయి కనుక. NIC కేవలం హోస్టింగ్ ఏజెన్సీ మాత్రమే.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా దాదాపు 22,000 భూముల బదలాయింపులు గత రెండేళ్లలో జరిగాయని మేము మా వద్ద ఉన్న ఆధారాలను గత వారం ప్రజల ముందు ఉంచాము. మంత్రి గారి నుండి నేటికి ఎలాంటి సమాధానం రాలేదు.
గత జనవరిలోనే ఇదే మంత్రివర్యుల హాయాంలో జనగామ జిల్లాలో మీ సేవ ఆపరేటర్ల ద్వారా జరిగిన కోట్లాది రూపాయల చలాన్ల కుంభకోణం బయటపడింది. దాని మూలాల్లోకి వెళ్లకుండా తెలివిగా మంత్రి గారు కొంతమంది మీ సేవ ఆపరేటర్లను అరెస్టు చేయించారు. అసలు రాకాసి బదలాయింపు కుంభకోణం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు ఏవీ ప్రచురించకుండా యాజమాన్యాలను బెదిరించారు.
అసలు కుకునూర్‌పల్లిలో ఏం జరిగింది?
గత 40 ఏళ్లుగా భూమిపై కాస్తులో ఉన్న కొంత మంది వ్యక్తులు తమ పరపతి ఉపయోగించి ‘తహసీల్దార్ ఆర్డీవో ల ప్రమేయం లేకుండానే’ తమ భూములను బదలాయించాలని భూభారతి నుండి అప్రూవల్ తెచ్చుకొని, 1B పాస్ బుక్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆమె ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ భూముల్లో ఆ రైతులే ఉన్నందున అప్రూవ్ చేశారు. కాని అసలు ఇది ఎట్లా సాధ్యమైంది అన్న మౌళిక ప్రశ్న ఎవరూ అడగలేదు???
ఈ పోర్టల్ సూపర్ అడ్మిన్(మాస్టర్ కీ) రెవెన్యూ మంత్రి లేదా సీసీఎల్ఏ లే అయినపుడు వాళ్లకు తెలియకుండా ఇది రెండు సంవత్సరాల నుండి జరుగుతదా? దీనికి నోరు లేని తహసీల్దార్లను ఎట్ల బలిచేస్తరు??? నిషేధిత భూముల జాబితాల నుండి అసైన్డ్/ప్రభుత్వ భూములను తీసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది కదా? మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మంత్రి గారు??
మీకు దగ్గరగా విలువైన భూములున్న ORR చుట్టూ ఉన్న మీ వర్గ తహసీల్దార్ల మీద ఆర్డీవోల మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటారా? వుల్టా అందలం ఎక్కిస్తారు..అవునా?
ప్రభుత్వం చెబుతున్నట్లు గా విచారణ లోతుగా జరగడం లేదు…అంతా కేవలం ఒక డ్రామానే:
22,000 రికార్డుల బదలాయింపులు వేల కోట్ల కుంభకోణం లో ప్రభుత్వం స్పందన చాలా విచిత్రంగా ఉంది. రెవెన్యూ మంత్రి ఉన్నత స్థాయి పోలీసు విచారణ కోరకపోవడం, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకపోవడం పక్కా ‘క్విడ్ ప్రో కో’ వ్యవహారమే.
ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం మన మంత్రి వారు ‘ధరణి’ పేరుతోనే ఇంకా కొన్ని పత్రికల్లో లీకులు ఇప్పించి కావాలనే కాలయాపన చేస్తున్నారు.
కేసు నమోదు (FIR) చేయకుండా ఈ దర్యాప్తు ఏ విధంగా చేస్తారు?
నాకు నీవు-నీకు నేను:
చీటికి మాటికి SIT వేసే రేవంత్ రెడ్డి ఈ పొంగులేటి కుంభకోణం విషయం లో సిట్ వేయకపోవడం అంటే ‘మనిద్దరం కలసిదోచుకుందాం-పరస్పరం కాపాడుకుందాం’ అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. FIR లేకుండా ఆధారాలు ఏ విధంగా సేకరిస్తారు? దీనికి సంబంధించి ఇంతవరకు ఒక జీవో విడుదల కాలేదు, సైబర్ క్రైమ్ లేదా ఇతర పోలీస్ శాఖల సహకారం తీసుకున్న దాఖలాలు లేవు. సదరు మంత్రి గారు ఇప్పటికీ మౌనం వీడటం లేదు! సమాచార శాఖ మంత్రే సమాచారం తొక్కిపెడితే ఇంక ఎవరికి చెప్పుకోవాలి?
22,000 భూముల బదలాయింపులో లబ్దిదారుల్లో కాంగ్రెస్ నేతలు, రేవంత్-పొంగులేటి మనుషులు-వాళ్ల మాఫియా లు ఉన్నందునే వాళ్ల కాల్ డేటా రికార్డులు విశ్లేషించకుండా, దొంగలను అదుపులోకి తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో పోలీసు కేసులు కావలసింది, కానీ కాలేదు. పైగా భూభారతిలో కొన్ని ఫీచర్లను ఆపేసి నేరం ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తున్నారు.
పొంగులేటి గారు వెంటనే రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరిస్తేనే నిజాలు బయటికి వస్తాయి. మీరు రాజీనామా చేసి నేరం ఒప్పుకునే దాకా మేం ఈ పోరాటం కొనసాగిస్తాం 👊✊.
జై హింద్ 🇮🇳🫡
జై తెలంగాణ
@TelanganaCMO@INC_Ponguleti@revanth_anumula@BRSHarish@KTRBRS@BRSparty
#BhuBharathiScam
#RevenueFiles
#Scamgress
కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో హనుమకొండ జిల్లా పరకాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
సీయం రేవంత్ గారు,
అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు.
ఆరు మందిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని. వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు!!!
ప్రజలారా,
షాబాదు పట్టణంలో పోక్సో కేసులో నిందితుడు రాజ్ కుమార్ చేతిలో 6 మంది అమాయకులు నిన్న రాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.
నేరం జరిగి 55 రోజులయినా ఇంతవరకు పోలీసులు నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. నిందితుడు ఆరు మందిని పాశవికంగా చంపి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. పోలీసులు అంతా రేవంత్ రెడ్డి గారిని వారి సోదరులను కాపాడడంలో బిజీగా ఉన్నారు. పేద ప్రజల ను కాదు.
బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం కోసం షాబాద్ కు పోదామని బయలుదేరితే చేవెళ్ల లో పోలీసులు నన్ను మరియు కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీసు స్టేషన్ లో బంధించారు.
మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ గార్లను కూడా అరెస్టు చేశారు.
ఎందుకింత భయం సీయం గారు? వెంటనే రాజీనామా చేయండి. బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి.
@TelanganaDGP@KTRBRS@revanth_anumula@BRSparty
#TelanganaSinking
#PocsoCase
నా లాగా దేశ భద్రత కోసం ఎదురొడ్డి పోరాడిన పోలీసు అధికారుల బాధను అర్థం చేసుకున్న గౌరవ తెలంగాణ హైకోర్టు కు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏼🙏🏼
నా లాగా కోర్టును ఆశ్రయించలేక లోలోపల కృంగిపోతున్న పోలీసులు ఎందరో…!
విధి నిర్వహణలో అత్యున్నత సాహసాలు ప్రదర్శించిన అధికారులకు రక్షణ కవచం అన్నది ఒక హోదానో లేదా ఆభరణమో కాదు, కారాదు. రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా మాకు కల్పించిన ప్రాథమిక హక్కు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు తమ భుజాలపై వేసుకోవలసిన బాధ్యత.
వాన జోరుగా కురుస్తున్నప్పుడు గొడుగు కావాలనిపిస్తుంది. వాన వెలిసి ఎండ వచ్చిన వెంటనే అదే గొడుగు భారంగా అనిపిస్తుంది. ఇప్పుడు సీయం రేవంత్ గారికి, డీజీపీ గారికి మేము ఎండలో గొడుగు లాగా కనిపిస్తున్నాం! కేవలం నా మీద అక్కసుతో వందల మంది పోలీసు అధికారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారు.
మీరు మీ హంగులు, ఆర్భాటాలు, మహాసభలు,మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కల్పిస్తున్న అధికారిక రక్షణకు అయ్యే ఖర్చుల ముందు మా భద్రత ఖర్చు ఏ పాటిది కాంగ్రెస్ నాయకులారా? మీకొక న్యాయం, పోలీసులకు మరొక న్యాయమా?
గండిపేట గ్రేహౌండ్స్ భూములను కబ్జా చేసినంత ఈజీ కాదు కీకారణ్యంలో కోంబింగ్ సీయం గారు.
ఆ రోజుల్లో ఇంటి నుండి బయటికెళ్తే మళ్లీ క్షేమంగా ఎప్పుడు తిరిగొస్తామో తెలియని పరిస్థితి. ఎండాకాలంలో దట్టమైన అడవుల్లో నీళ్లు దొరక్క మూత్రం తాగిన రోజులున్నవి. బలిమెలలో 40 మంది కమాండోలు చనిపోయిన రోజున వారి కుటుంబాలను ఓదార్చడానికి ముఖ్యమంత్రులు రాలేక మమ్మల్ని పంపించారు! ఈ పరిస్థితులు మీ కర్థం కావు. మీ చుట్టూ ఉన్న అధికారులు కొందరు వాళ్ల స్వార్థం కోసం మీకసలు విషయం చెప్పరు. మీరేం వినాలనుకుంటే వాళ్లు అదే చెబుతారు.
మీ లాంటి రాజకీయ నాయకుల రక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం భార్య పిల్లల్ని వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేశాం.
మొదటి 15 సంవత్సరాల్లో ఏ నాడు కుటుంబాలతో సినిమాలకు కానీ, షాపింగుకు కానీ, పిక్నిక్ లకు కానీ, చివరికి అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఊర్లకు వెళ్లలేదు. రాష్ట్రంలో శాంతి కోసం, మారణహోమం ఆగాలి అనే లక్ష్యంతో చచ్చిపోతాం అని తెలిసినా సాయుధులైన నక్సలైట్లతో చర్చలు జరపడానికి దండకారణ్యంలో రాత్రింబవళ్లు తిరిగాం.
ఈ విధంగా డ్యూటీ చేయడం వల్ల మాకు ఒక పైసా జీతం పెరగలేదు, ఒక గజం భూమి కూడా ఎవరూ ఇవ్వలేదు.
ఈ రోజు మీ ఆదేశాల మేరకు మీ తరపు న్యాయవాదులు మా అభ్యర్థనకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదిస్తున్న తీరు చూస్తుంటే మీకు మా పట్ల ఎంత పగ, వివక్ష, ద్వేషం, చులకనభావం ఉందో సులభంగానే అర్థమవుతోంది!!!
మాకు ఎలాంటి ముప్పు వాటిల్లినా ముమ్మాటికీ బాధ్యత వహించాల్సింది తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి-డీజీపీలే.
మీ లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారు ముఖ్యమంత్రులవడం ఈ రాష్ట్రం దురదృష్టం. ఈ విషయం ముప్పై సంవత్సరాల ముందే తెలిసుంటే ఐపీయస్ లో చేరే వాన్ని కాదేమో!
సీరియస్లీ!
జైహింద్ 🇮🇳🫡
రెండు చేపల కథ చదవండి.
నేను అవినీతికి వ్యతిరేకం.
చట్టం అందరినీ సమానంగా చూడాలని కోరతాను(Disclaimer)
అయితే..
చిన్న చేపల కొక న్యాయం-తిమింగలాలకు మరో న్యాయం ఉండకూడదు,
సీయం రేవంత్ గారు.
బంజారలకు-మాల మాదిగల కు ఒక న్యాయం, భీమ్ రెడ్డికి మరో న్యాయం ఎట్లా ఉంటది???
యధావిధిగా ఈ రోజు తెలంగాణ లో మరో అవినీతి చేప ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వలలో పడిందని ప్రెస్ నోట్ ఇచ్చారు. కంగ్రాట్స్ ఆఫీసర్స్. 💐💐💐
ఈ చేప పేరు కొర్ర దిలీప్ నాయక్,చేర్యాల తహసీల్దార్. ఈయన ఎస్టీ లంబాడి(బంజారా) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పాపం ఇతని బీపీ నార్మల్ 120/80 ఉన్నందు వల్లనేమో మీరు, గౌరవ కోర్టు ఇతన్ని చంచల్ గూడ జైలుకు పంపించి ఉంటారు. బహుశా ఎస్టీ(ST) ఎమ్మెల్యేలు అందరూ గాఢ నిద్రలో ఉండి, సీయం గారి దగ్గరికి పోయే సాహసం చేసి ఉొండరు..
గత రెండు నెలల క్రితం ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన విద్యుత్తు శాఖ ఇంజనీరు ఇరుగు అంబేద్కర్ ను సీయం రేవంత్ అల్లుడి క్రషర్ కు వట్టినాగుల పల్లిలో కరెంటు అక్రమ పర్మిషన్ అడుగుతే ఇవ్వనందు వల్ల ₹ 200 కోట్ల ఆస్తులున్నయని బదునాం చేసి, ఏసీబీ దాడులు జరిపి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టి 38 రోజులు జైలులో ఉంచారు.
ఇప్పుడు ఆ లెక్కలన్నీ తప్పని తలపట్టుకుని ఏం చేయాలో పాలుపోక కూర్చున్నారు మీ అధికారులు!! పాపం ఈయన గురించి ఏ ఎస్సీ ఎమ్మెల్యే-మంత్రి కూడా సీయం దగ్గరికి పోయి గొంతెత్తి నిలదీయలేదు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా అంబేద్కర్ కు జరిగిన అన్యాయం మీద సీయం తో మాట్లాడలేదు, ఎందుకో మరి?? మదిర ప్రజలారా ఇతన్ని ఈ సారి మన గూడేలకు వచ్చినపుడు గళ్ళ పట్టి గట్టిగా నిలదీయండి.
కాళేశ్వరం సీఈ హరిరాం(ST), ఆర్టీవో కిషన్ నాయక్ (ST) , సబావత్ రాంచందర్(ST) (పశు సంవర్ధక శాఖ డైరెక్టర్-ఈయన దగ్గర కనీసం ఒక రూపాయి కూడా దొరక లేదు- రెండున్నర సంవత్సరాలుగా పోస్టింగ్ లేక రోడ్ల మీద ఉన్నాడు) కనకయ్య సీఐ (SC) , సుచరిత (SC)తహసీల్దార్, నరహరి (BC) ఇలా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అధికారులు వందలాది మందిని అవినీతి అధికారులని ముద్ర వేసి తెలివిగా అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 మరియు 13 లను పెట్టి కనీసం 60 రోజులు చంచల్ గూడ జైలులో బంధించారు. డీఎస్పీ భీంరెడ్డి లాగా వీళ్లకూ షుగర్ బీపీలు ఉన్నాయి. వీళ్లకు లేనిదల్లా కులం, గాఢ నిద్రలో ఉండి, చేతకాని ఎస్సీ మంత్రులు ఎమ్మెల్యేల అండ.
డా. రాంచందర్ నాయక్ (ST-కొడంగల్ వాసి) మరియు పోలీసు అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావులు ఏ పాపం చేశారో ఎవరికీ తెలియదు. సీయం చెప్పగానే వాళ్లను జైల్లో 60 రోజులు బందీగా ఉంచారు. వాళ్ల వద్ద ఏం దొరకలేదు. కొడంగల్ రాజా వారికి కోపం వచ్చింది. అంతే!
అక్రమ కేసులో జైలు నుండి గుండె రోగం తో అనారోగ్యంతో బయటికి వచ్చిన భుజంగ రావు, అదనపు ఎస్పీని మళ్లీ అక్రమ ఆస్తుల కేసు పెట్టి జైలుకు పంపించారు రేవంత్ రెడ్డి గారు.
కాళేశ్వరం సీఈ మురళీధర్ ENC (70 సం ల వయసు) 60 రోజులు అక్రమ ఆస్తుల కేసులో జైలులో ఉంచారు. వీళ్లందరికీ 35(3) BNSS కింద నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది, కానీ రేవంత్ రెడ్డి వద్దన్నడని ఇవ్వలేదు ఏసీబీ అధికారులు.
మరి దాదాపుగా ₹300 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నాయని మీ ఆదేశాల మేరకే పనిచేసే ఏసీబీ అధికారులే అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి మీడియాకు రిలీజ్ చేసి, డీఎస్పీ ‘సంకిరెడ్జి భీంరెడ్డి’గారిని చక్కగా స్టేషన్ బెయిల్ ఇచ్చి మరీ ఇంటికి సాగనంపారు రేవంత్ గారు!!!
పాపం డీయస్పీ భీం రెడ్డి గారి బీపీ 170/120 ఉంది కావున ఇప్పుడు మళ్లీ ఆయన్ను జైలుకు పంపమని నేను అడగడం లేదు…
కానీ…
డీఎస్పీ భీంరెడ్డి గారిపై చూపిన ప్రేమ జాలి కనికరం మిగతా మా బహుజన బిడ్డ లైన వారిపై చూపలేదు కావున, మా బిడ్డ లను కూడా వెంటనే జైలు నుండి విడుదల చేయండి. వారికి మళ్లీ పోస్టింగులు ఇవ్వండి. వారు తప్పు చేసినట్లుగా కోర్టు లో మీరు నిరూపించ గలిగితే వాళ్లకు శిక్ష ఎలాగూ పడుతుంది.
చివరిగా…
దమ్ముంటే తిమింగలాలనే మింగే తెలంగాణ వీర తిమింగలాలు - రేవంత్-పొంగులేటిల ₹1000000000000
లక్ష కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని బహిర్గతం చేయండి.
సొర చేపలు, చిన్న చేపలు అన్నీ వెంటనే సర్దుకుంటాయ్. మసకబారిన మీ అనిశా (ACB) ప్రతిష్ట మళ్లీ తిరిగి వస్తుంది.
జై భీం..జై తెలంగాణ… జై భారత్
***అన్నీ సర్దుకున్నాక, ఐదు రోజుల తర్వాత, డీఎస్పీ భీం రెడ్డిని అరెస్టు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని కులం పలుకుబడి, బలవంతుల పైరవీల ఆధారంగా కాకుండా, నిజమైన అవినీతి పరులనే కూలంకషంగా పరిశోధించిన తరవాత నే కేసులు పెట్టి జైలుకు పంపండి.
Call ACB at 9440446106, 040-23251555 if you come across corruption by any public servant. CM and his ministers are also public servants.
Jai Hind.
@revanth_anumula@TelanganaACB@Telangana@BRSparty@KTRBRS@BRSHarish
I will brief the media on the “Lies which were told by Congress Ministers” today from Telangana Bhavan at 5 PM today.
Please stay tuned to know the truth.
Thank you for attention in this matter.
Satyameva Jayate
రేవంత్ గారు,
మీ లంచగొండి ప్రభుత్వం ఎంత తొండి చేసినా మేము మొండి గానే పోరాడతాం.
మాకు ప్రజలు ముఖ్యం
మీకు పైసలు ముఖ్యం.
బహిరంగ చర్చకు రమ్మని సవాలు విసిరింది మీరే. రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది మీరే.
ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం ఆ సవాలు స్వీకరించి చర్చకు మేం సిద్దం అని వేదికను,విధివిధానాలను, తేదీలు వారం రోజుల కిందటే ప్రకటించాం.
ఇన్ని రోజులు నిద్ర పోయి, నిన్న సడన్ గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు, గన్ పార్క్ అన్నారు. నువ్వు కాదు, కేటీఆర్-హరీష్ రావులు మాత్రమే రావాలి అన్నారు. ఇక జూపల్లి కృష్ణ రావు గారు ఏకంగా తెలంగాణ భవన్ కే వస్తా అని అంటే వారి కోసం పుష్ప గుచ్చం మరియు శాలువాతో వేచి చూశాం.
అయినా సరే అని మీ ఆహ్వానం మేరకు నేను, హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు మిగతా నాయకులం అందరం ఆధారాల ట్రంకు పెట్టెతో గన్ పార్క్ కు బయలుదేరితే పోలీసులతో మమ్ములను అరెస్ట్ చేసి కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇంకా కేటీఆర్ గారు జూపల్లి గారి కోసం అప్పుల పై చర్చకు సిద్ధం గా భవన్లో వేచి చూస్తున్నారు.
మీరు ఇప్పటికైనా ఆధారాలతో కంచన్ భాగ్ కు రండి. అంతే తప్ప దయచేసి తొండి చేయకండి. మీ రాజీనామా పత్రాలను మేమేమీ అడగం. ఈ రాజీనామా నిర్ణయాన్ని మీ నైతికతకే వదిలేస్తున్నాం.
మంత్రులు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ గార్లు మీకు చాలా విషయాలు తెలియనివ్వకుండా సీయం రేవంత్-పొంగులేటి లు మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. మీ ద్వారా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది.
ఇప్పటికైనా మేం చర్చకు సిద్ధంగా ఉన్నం. జీవో 17 ను వెంటనే రద్దు చేయాలి. తెలంగాణ బిడ్డలకే తెలంగాణ సంపద చెందాలి. గురుకులాలు, మిగతా పాఠశాలల్లో పునర్వైభవం రావాలి.
జై తెలంగాణ. జై కేసీఆర్
@KTRBRS@BRSHarish@revanth_anumula@Ponnam_INC@azharflicks@Adluri12@BRSparty@TelanganaCMO@TelanganaDGP
#GurukulScam #Telangana