జనసేన పార్టీ అధ��యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ దేశరాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ��ామాన్య జనసైనికులు, వీర మహిళల నుండి వారి పనితీరు పరిశీలించి హ్యాండ్ పిక్ చేసి మరీ నియమించారు. ఈ ప్రక్రియ ద్వారా రాజకీయాలలో సామాన్యులకు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే గొప్ప అవకాశాన్ని కల్పించనున్నారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భ��వించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
Watching the grand statue of Netaji Subhash Chandra Bose standing tall and resolute right at the center of the C-Hexagon, India Gate is an unforgettable sight. It feels as though his fierce patriotism and invincible spirit are actively guarding the soul of our nation.
#IndiaGate #Delhi
Respect is earned through actions, not demanded through words!
It was @PawanKalyan sir’s actions, sincerity and commitment towards the nation that has brought Viswaguru, Honourable PM @narendramodi to his residence as a mark of love and mutual respect.
#ModiMeetsAandhi
2014 2026
జనసేనాని శ్రీ @PawanKalyan గారి ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
• తొలిరోజు నుండి అమరావతి చట్టబద్ధత కోసం, భవిష్యత��తులో ప్రభుత్వాలు రాజధాని మార్చకుండా పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేయాలని గళమెత్తిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• 2019–2024 కాలంలో రాష్ట్ర రాజధాని అంశంపై తీవ్ర గందరగోళం నెలకొని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో, అమరావతిని ఎవరూ మార్చలేరు అని శపథం చేసి, అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించారు.
• రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు కూటమి ఏర్పాటు చేసి, ప్రజలకు ధైర్యాన్ని నింపి, నేడు పార్లమెంట్లో అమరావతిని రాజధానిగా ఆమోదం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
• ఇచ్చిన మాట కోసం రాజకీయంగా తాను తగ్గి… ప్రజలను గెలిపించి, నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు.
#PawanKalyanAneNenu
#HistoricAmaravatiResolution
A new light has entered our lives. We are beyond happy to share that we’ve been blessed with a Baby Boy.
Thank you for all the prayers and well-wishes!
- Kalyani & Sandeep Panchakarla
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే 100 సభ్యత్వాలు పూర్తి చేసిన మా భీమిలి నియోజకవర్గ ‘సాధక్’ దేవర శివ గారికి అభినందలు తెలియచేస్తున్నాను.
@PawanKalyan@mnadendla@NagaBabuOffl#JanasenaUdyami
"జనసేన ఉద్యమి" జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా అర్ధం చేసుకుని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, అధినేత శ్రీ @PawanKalyan గారి అడుగుజాడల్లో నడిచేందుకు, జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకునేవారు.
ఇప్పుడే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో "జనసేన సాధక్" ను కలిసి సభ్యత్వం నమోదు/రెన్యువల్ చేసుకోండి.
#JanasenaUdyami
ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం
•తీర ప్రాంత మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు
•మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం
•త్వరలో పిఠాపురం వేదికగా ప్రకటన
ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సమగ్�� ప్రణాళికను రూపొందించాము. అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రణాళికలకు రూపం ఇచ్చాం. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీ కాకినాడ కలెక్టరేట్ లో మత్స్యకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించాం. తీర కాలుష్య నివారణ, కోత నివారణ, మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతులలో వేట, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, ఇలా మత్స్యకారులు జీవితాలకు భద్రత, భరోస��� కల్పించేందుకు అవసరం అయిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రణాళికలో పొందుపర��చాము. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడంతోపాటు వ్యవసాయ అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం.
వివిధ శాఖల ఉన్నతాధికారులు, మెరైన్ ఫిషరీస్ నిపుణులు, జిల్లా అధికారుల సహకారంతో రూపొందించిన ఈ ప్రణాళికను వచ్చే పిఠాపురం పర్యటనలో ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిర్దుష్ట లక్ష్యంతో రూపొందించిన ప్రణాళిక - ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
- @PawanKalyan
@PMOIndia @AndhraPradeshCM @CollectorKakin1 @PIB_India @IPR_AP @pibvijayawada
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడే ప్రారంభం
• జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభం కానున్న తొలి దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం
• "Membership to Leadership"
సభ్యత్వం నుండి నాయకత్వం దిశగా నడిపించేలా ��నసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
• పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరూ "ఉద్యమి"
• సరికొత్త రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పుడే మీ స్థానిక "సాధక్" (క్రియా వాలంటీర్) ను సంప్రదించి "ఉద్యమి" సభ్యత్వం నమోదు చేసుకోండి.
#JanasenaUdyami
అందరిలోనూ ఎనర్జీ ఉంటుంది, పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎనర్జీని సరైనమార్గంలో ఛానలైజ్ చేస్తే మంచి పౌరులుగా ఎదుగుతారు.
పిల్లలకు వారంలో కనీసం మూడు రోజులైనా ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్ , కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో శిక్షణ ఇవ్వాలి.
నాలుగు గోడల మధ్య చదివీ చదివీ ప్రైవేట్ ఇన్స్టి��్యూషన్ పిల్లలు చాలామంది స్ట్రెస్ గురవుతున్నారు, మానసిక, శారీరక ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, స్ట్రెస్ తట్టుకోలేని కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గేమ్స్ ఆడడం వలన కొంత స్ట్రెస్ తగ్గుతుంది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్లేగ్రౌండ్స్ ఉంటాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో చాలావరకు ప్లేగ్రౌండ్స్ ఉండవు.
“Common Play Ground System” CPGS అనే విధానం ప్రవేశపెట్టి ZP పభ్లిక్ స్కూల్స్ , మునిసిపల్, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మినిమం ఫీస్ Pay చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి, శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలి.
ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీస్ అమౌంట్ పబ్లిక్ స్కూల్స్ లో సానిటరీ స్టాఫ్ , ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్ , ��్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత, అవగాహన కూడా ఏర్పడుతుంది.
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ తరం పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
శ్రీ నరేంద్ర మోదీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయస్సులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే యోగాచేస్తారు. ఆరోగ్యంగా, ఉ���్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖల బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధనను కొనసాగిస్తున్నారు. ఇటీవల “టైగర్ ఆఫ్ మార్టియల్ ఆర్ట్స్” అనే అంతర్జాతీయ బిరుదును అందుకున్నారు.
“ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలి..” అని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా.? కేవలం పుస్తక పురుగుల్లాగా వదిలేస్తున్నామా
చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ , మార్షల్ ఆర్ట్స్ , సెల్ఫ్ డిఫెన్స్ , యోగా వంటి కార్యక్రమాలు కూడా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌర��� ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా కోరుతున్నాను, జై హింద్!
-శ్రీ కె. నాగబాబు,
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
జనసేన నాయకుల మానవతా దృక్పథం
ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల సంద��ప్ రూ. 50 వేలు, శ్రీ విశ్వక్ సేన్ రూ. 50 వేలు ఆర్థిక సహాయం
ఉపాధి కల్పించిన శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు శ్రీ పుక్కాల రాజశేఖర్ కుటుంబానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డా.పంచకర్ల సందీప్ రూ.50 వేలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ శ్రీ విశ్వక్ సేన్ రూ.50 వేలు మొత్తం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా జనసేన నాయకుల మానవతా దృక్పథం మరోసారి నిరూపితమైంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంకు విచ్చేసిన శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు సమక్షంలో చెక్కులను అందజేశారు. శ్రీ పుక్కాల రాజశేఖర్ సతీమణి శ్రీమతి హరిప్రియ ఇటీవల ఎచ్చెర్ల పర్యటనలో శ్రీ నాగబాబు గారిని కలిసి.. సంబంధం లేని ఘర్షణలో తన భర్తను హత్యచేశారని, కుటుంబ పోషణ భారంగా ఉన్నదని మొరపెట్టుకున్నారు. అప్పటికప్పుడు కొంత ఆర్థికసహాయం అందజేసిన శ్రీ నాగబాబు గారు ఉపాధి అవకాశం కల్పించారు. శ్రీమతి హరిప్రియ ఫిబ్రవరి నుంచి ఉద్యోగంలో చేరనున్నారు. మానవతా దృక్పథంతో జనసైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ పంచకర్ల సందీప్, శ్రీ విశ్వక్ సేన్ లను శ్రీ కె. నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు.
‘నా సేన కోసం నా వంతు’గా
జనసేనకు శ్రీ @NagaBabuOffl గారు, సన్నిహితులు రూ. 48 లక్షలు అందజేత
జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో 2026 నూతన సంవత్సరం సందర్భంగా జనసేన ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు శ్రీ కె.నాగబాబు గారు, ఆయన సన్నిహితులు “నా సేన కోసం నా వంతు"గా జనసేన పార్టీకి రూ.48 లక్షలు డీడీ రూపంలో అందజేశారు. చంద్రునికో నూలుపోగుగా శ్రీ @PawanKalyan గారు ప్రజలకు చేస్తున్న సేవల్లో తాము సైతం భాగమవ్వాలనే ఆలోచనతో ఈ ఏడాది కూడా జనసేన పార్టీకి మా వంతుగా రూ.48 లక్షలు డీడీల రూపంలో అందజేసినట్లు, త్వరలో మరో రూ.2 లక్షలు ��ూడా డీడీ ద్వారా పార్టీకి అందజేయనున్నట్లు తద్వారా రూ.50 ��క్షలు సమకూరుతాయని శ్రీ కె.నాగబాబు గారు వెల్లడించారు. జనసేన పార్టీ కోశాధికారి శ్రీ రత్నం గారికి డీడీలు అందజేశారు. జనసేన నాయకులు డా.సందీప్ పంచకర్ల, జనసేన శ్రేయాభిలాషులు శ్రీ శ్రీనాథ్, శ్రీ కంద వెంకటేశ్వర రావు, శ్రీ భరణి, శ్రీ విజయ్, శ్రీ కల్కి రాజా, శ్రీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Andhra Pradesh Pollution Control Board conducts review meeting with stakeholders after AQI levels fall into ‘moderate to poor’ category; committees to assess dust concentration levels and identify hotspots.
Dr. P. Sandeep, Board Member, APPCB, informed that at present only one Continuous Ambient Air Quality Monitoring (CAAQM) station has been installed and is operational at the main hotspot near the RTC Complex, and that additional CAAQM stations need to be set up to obtain representative air quality data for the entire city.
He requested that surprise inspections be conducted to verify Pollution Under Control (PUC) certificates of RTC buses and government vehicles.
#APPCB
https://t.co/hP1EGTwoKX