పిఠాపురానికి రూ. 1,500 కోట్ల అభివృద్ధి.
దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు.
#PawanKalyanForPithapuram
307Cr - Multi-village drinking water scheme
200Cr - Underground drainage system
80Cr - AIIB-funded water works in Gollaprolu
100Cr - Road development works
118Cr - Long-awaited Pithapuram ROB
₹323 Cr - Uppada coastal protection wall
ALL TIME RECORD 🦁🔥
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం
•దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యం
•ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి
•రూ.200 కోట్లతో రహదారులు.. రూ.470 కోట్లతో తాగునీటి పనులు
•రూ.225 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. రూ.323 కోట్లతో ఉప్పాడకు రక్షణ గోడ
•రూ.86 కోట్లతో ఆసుపత్రులు, ఆరోగ్య వసతుల అభివృద్ధి
•పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సభలో శ్రీ @PawanKalyan గారు
‘మన కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక. నాకు కృతజ్ఞత చాలా ఎక్కువ. కష్టాల్లో ఉన్న మనిషికి అండగా నిలబడటం నా స్వభావం, నా గుణం. ఈ విలువలను ఈ నేల నేర్పింది. ప్రజల అభివృద్ధే మన ప్రధాన లక్ష్యం. ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి, వాటిని తీర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దాం. వారి ఆశలు, ఆకాంక్షలకు తరువాత ముందుకు తీసుకెళ్దాం. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నా క్యాంపు ఆఫీసును పిఠాపురంలో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. తాజాగా మరో రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. పిఠాపురాన్ని కేవలం ఒక నియోజకవర్గంగా కాకుండా, అభివృద్ధికి నమూనాగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన గెలుపు రాష్ట్ర అభివృద్ధి కే కాకుండా దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచిందని చెప్పారు. మంగళవారం పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పిఠాపురం నియోజక వర్గంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిని కళ్లముందు చూస్తున్నాం. వివిధ రంగాల్లో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్లాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా, పిఠాపురం భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ ముందుకు సాగుతున్నాం.
•600కు పైగా సీసీ, బీటీ రోడ్లు పూర్తి చేశాం
అధికారం చేపట్టిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికే రూ.200 కోట్లకు పైగా నిధులు వెచ్చించి, ఇప్పటికే 600 కు పైగా సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ రోజు మరో 202 రహదారులను ప్రారంభించాం. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో దాదాపు రూ.10 కోట్లతో నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ఆధునీకరించి, 97 వేల మందికి తాగునీటి భరోసా కల్పించాం. గ్రామాల్లో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో దాదాపు రూ.320 కోట్లతో, పట్టణాల్లో అమృత్ 2.0, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సహకారంతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో దాదాపు రూ.140 కోట్లతో తాగునీటి పనులు చేపడుతున్నాం.
- ఆరోగ్య వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం
పిఠాపురంతోపాటు పరిసర నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా రూ.34 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం, ఇప్పటికే పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. యు.కొత్తపల్లి, చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుర్వేద డిస్పెన్సరీ ఏర్పాటు చేశాం. రూ.7 కోట్లతో 26 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరు గ్రామ ఆరోగ్య కేంద్రాలను పిఠాపురం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (పాడా) నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రూ.45 కోట్లతో కాకినాడ జీజీహెచ్ లో ఆంకాలజీ బ్లాక్ , అధునాతన లీనియర్ యాక్సిలరేటర్ పరికరం, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం.
•రూ. 225 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
పిఠాపురం ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచేందుకు రూ.34 కోట్లతో ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టాం. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ సహకారంతో 48 భజన మందిరాలు నిర్మిస్తున్నాం. రూ.2 కోట్లతో శ్రీ కుంతీమాధవస్వామి ఆలయ కోనేరు పునరుద్ధరిస్తున్నాం. పక్కనే ఉన్న రథాలపేటలో మారెమ్మ గుడిని పునర్నిర్మించి, ఖాళీ ప్రదేశాన్ని సుందరవనంగా అభివృద్ధి చేస్తున్నాం. గత పర్యటనలో పిఠాపురం పట్టణంలో మురుగు, చెత్త సమస్యను చూశాను. రూ.225 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోజుకు 72 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 40 టన్నుల తడి చెత్త శుద్ధి ప్లాంట్ ను, 5 చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నాం. మొగలి సూర్యుడి చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించాం. కాలుష్య నియంత్రణ మండలి నిధులతో బేలింగ్ మెషిన్ కాంపాక్టర్ అందుబాటులోకి తెచ్చాం.
•రూ.323 కోట్లతో ఉప్పాడ తీరానికి రక్షణ కవచం
గతంలో పిఠాపురంలోకి అడుగుపెట్టగానే కనిపించిన డంపింగ్ యార్డ్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపాం. పాదగయ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో రూ.1.83 కోట్లతో సుందరమైన నగరవనాన్ని అభివృద్ధి చేశాం. అలాగే రూ.6 కోట్లతో 11 గ్రామీణ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను ఎన్నాళ్లుగానో వేధిస్తున్న సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్తున్నాం. రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాం. దీనికి సంబంధించిన డిజైన్, సర్వేను ఐఐటీ మద్రాస్ పూర్తి చేసింది, ఇక నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నాం. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారితో పలుదఫాలుగా మాట్లాడి అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేయగలిగాం. ఈ ప్రయత్నానికి జనసేన పార్టీ చేసిన త్యాగాలు, సంపాదించుకున్న విశ్వసనీయత, గుడ్‌విల్ కూడా కీలకంగా నిలిచాయి. పిఠాపురం ప్రజలు అందించిన ఘన విజయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బలాన్ని అందించడమే కాకుండా, ఉప్పాడ తీర ప్రాంత ప్రజల చిరకాల సమస్య అయిన రక్షణ గోడ నిర్మాణానికి కూడా మార్గం సుగమం చేసింది
•రూ. 118 కోట్లతో ఆర్ఓబీకి ఆమోదం
మన పిఠాపురం నడిబొడ్డున పీఎం గతి శక్తి పథకం కింద రూ.118 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ఆమోదం లభించింది. అలాగే దాదాపు రూ. 100 కోట్లతో ఆయుష్ మెడికల్ కాలేజ్, సాస్కి నిధులతో రూ.100 కోట్లతో రోడ్ల అభివృద్ధి, అమృత్ భారత్ పథకం కింద రూ.37 కోట్లతో పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. అలాగే పాడా నిధులతో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ద్వారా రూ.20 కోట్లతో ఆధునిక బస్సు స్టాండ్, రూ.3 కోట్లతో 4 స్మార్ట్ కిచెన్లు, చేపల మార్కెట్, సిసి డ్రైన్లు, పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పంచాయతీ భవనాలు, ఉప్పాడ చేనేత కమ్యూనిటీ హాళ్లు , అంగన్వాడీ కేంద్రాలు వంటి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తున్నాం.
•రూ.4 కోట్లతో ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల అభివృద్ధి
ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థుల కోరిక మేరకు, ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి, సుమారు రూ. 4 కోట్లతో కొత్త భవనాలు, కాంపౌండ్ వాల్స్, అదనపు తరగతి గదులు, ప్లే గ్రౌండ్ లెవెలింగ్ పనులు చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి, గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, గౌరవ గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, గౌరవ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా గారికి, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఠాపురం అభివృద్ధి ప్రతి అడుగులో కనిపించాలి, ప్రతి కుటుంబం ముందుకు సాగాలి, మన పిల్లల భవిష్యత్తుకు పిఠాపురం ఒక బలమైన పునాదిగా నిలవాలి. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తూ, పిఠాపురాన్ని మరింత గొప్పగా, మరింత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు నా ప్రయాణం ఆగదు” అన్నారు. (1/8)
👉 ₹307 Cr —Multi-village drinking water scheme
👉 ₹200 Cr —Underground drainage system for Pithapuram
👉 ₹80 Cr —AIIB-funded water works in Gollaprolu
👉 ₹100 Cr —Road development works
👉 ₹118 Cr —Long-awaited Pithapuram ROB
👉 ₹323 Cr —Uppada coastal protection wall
#PawanKalyanAneNenu #JSPWorks
పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
Live Link: https://t.co/izg2eSLQw0