Court Movie Main Female Lead Actress Sri Devi about @PawanKalyan Garu
నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు. నాకు ఓటు లేదు కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ చేత జనసేనకి ఓటు వేపించాను ❤️😍
రాజకీయ కార్యక్రమాలు కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా సరే పర్యావరణాన్ని, పరిసరాలను ధ్వంసం చేసేలాగా నిర్వహించకూడదు, వేడుకలు నిర్వహించిన వారు, తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి స్థానికులకు అందించడమే వారికి అందించే గౌరవంగా జనసేన భావిస్తుంది. అంతేకాకుండా "పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం" జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని సమాజంలోనే కాకుండా, పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో అమలు చేస్తూ కార్యక్రమం నిర్వహించిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమాలు చెప్పట్టడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగిన జయకేతనం బహిరంగ సభ అనంతరం, సభా వేదికను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసిన ప్రతీ ఒక్క జనసేన నాయకుడికి, జనసాఈనికులకు, పారిశుధ్య సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ K.K గారి నేతృత్వంలో చిత్రాడ లోని సభా వేదిక ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటుగా ఎలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోకుండా వేరు చేసి తరలించడంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కాకినాడ జిల్లా అధ్యక్షులు, KAUDA చైర్మన్ శ్రీ తుమ్మలపల్లి బాబు గారికి, APMIDC ఛైర్మన్, మంగళగిరి ఇంచార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారికి, ఆముదాలవలస ఇంచార్జి శ్రీ పేదాడ రామ్మోహన్ గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి గారికి, పిఠాపురం నాయకులు శ్రీ చెల్లుబోయిన సతీష్ గారికి, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారికి, చల్లా లక్ష్మి గారికి, కొలా దుర్గ గారికి, సురవరపు సురేష్ గారికి, ఇతర జనసైనికులకు, వీరమహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు.
యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య @KChiruTweets గారి కీర్తిని మరింత పెంచనుంది
సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు. @UKParliament పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క @JanaSenaParty నాయకులకు, జన సైనికులకు, వీరమహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడంలో అనేకమంది వేదిక మీద లేకపోయినా సరే ఎంతో కష్టపడ్డారు, సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది.
ముందుగా ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు, అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీస్ శాఖ @APPOLICE100 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర @dgpapofficial శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ IPS గారికి, @KAKINADAPOLICE వారికి, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన నా కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు.
అలాగే సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ IAS (@CollectorKakin1) గారికి
పార్టీ తరఫున ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమైన వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, జయకేతనం సభ విజయవంతం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసిన గౌ|| మంత్రివర్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారికి, గౌ|| మంత్రి శ్రీ @kanduladurgesh గారికి గౌ|| ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ @tangella_uday గారికి, పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ జిల్లాల నాయకులకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే కార్యక్రమం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలించి, సభాస్థలం ఎంపిక నుంచి, సభ పూర్తయ్య వరకు అడుగడుగునా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ, ఏ విధమైన అసౌకర్యం జరగకుండా నిర్వహించిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ @KSSRaoJSP గారికి, వారి కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు.
సభకు హాజరైన జనసేన శ్రేణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు బృందాన్ని సిద్ధం చేసి, వైద్య సేవలు అందించిన డాక్టర్ సెల్ బృందానికి, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్ సోదరులకు ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు, కార్యక్రమ సారాంశాన్ని చేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ అందించిన సిబ్బందికి ధన్యవాదాలు. జనసేన పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, వివరిస్తూ వివిధ డాక్యుమెంటరీలో రూపొందించి వాటిని ప్రజలకు తెలిసేలా ప్రదర్శించిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం @JSPShatagniTeam టీం బృందానికి ధన్యవాదాలు.
వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనలు నిర్వహించి జనసేన పార్టీ సంస్కృతులను కాపాడే విధానం తెలియజేసేందుకు కృషి చేసిన సాంస్కృతిక విభాగం కమిటీకి, శ్రీ హరీష్ పాయి గారికి, కళాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తునలు తెలియజేస్తున్నాను.
తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అవ్వకుండా వారికి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీ విభాగానికి, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, సౌండింగ్ బృందానికి, ప్రతీ ఒక్క కార్మికుడికి, కార్యక్రమం అనంతరం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నాను.
సభకు స్థలాన్ని అందించిన దాతలకు, సభా వేదిక వద్ద పారిశుధ్య సేవలు అందించిన పారిశుధ్య సిబ్బందికి, వారిని సత్కరించిన గౌ|| MLC పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారికి ధన్యవాదాలు.
కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ, సహకారాలు అందించిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి, నా వ్యక్తిగత భద్రత సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో, ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను.
#JanaSenaJayaKethanam #JanaSena12thFormationDay
జనసేన పార్టీ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని, 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, మంత్రి శ్రీ @naralokesh గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, గౌ|| రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి @PurandeswariBJP గారికి, NDA పక్ష నాయకులకు, ఇతర నాయకులు, చిత్ర పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. @JanaSenaParty రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేయడంతో పాటుగా, సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేసే దిశగా జనసేన పార్టీ అడుగులు వెయ్యనుంది.
#JanaSenaJayakethanam #JanaSena12thFormationDay
ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ @ChouhanShivraj గారి కుమారుల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కు గ్రూప్ ఫోటో సెషన్
సీఎం శ్రీ @ncbn గారు,డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారు, మంత్రులు, శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ పాల్గొన్నారు.
#APAssembly