మాడుగులపల్లి మండలం గజలాపురం మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు యళ్లబోయిన శేఖర్ గారి చిన్నారుల నూతన పట్టువస్త్రాలంకర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు @YSRCParty తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను.
2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విజ్ఞప్తి.
My message to the people of Andhra Pradesh for the upcoming Assembly and General elections 2024.
#VoteForFan
నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన @YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.