తెలంగాణ ఉద్యమం :-
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక సకల జనుల సమ్మెలో భాగంగా హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉద్యోగులతో సమావేశమై, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించడం జరిగింది.
“జీతం కోసం కాదు.. జీవితం కోసం తెలంగాణ!” అని నినదిస్తూ సాగిన ఆ చారిత్రాత్మక పోరాట ఘట్టాన్ని స్మరించుకుంటూ..
తెలంగాణ సాధన కోసం ప్రజలంతా ఏకమై సాగించిన మహోద్యమాన్ని, రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలను, పోరాటాలను మరోసారి నెమరువేసుకుంటూ…
– వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
#TelanganaMovement #SakalaJanulaSamme
సాగర హారానికి (30.09.2012) నేటితో 14 ఏండ్లు:-
తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం సాగిన ఉద్యమంలో సాగర హారం ఒక కీలక ఘట్టం. ఆంక్షలను, నిర్బంధాలను ఎదురించి లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన ఉద్వేగభరితమైన ఉద్యమ సందర్భం అది.
ఈ చారిత్రక కార్యక్రమానికి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు సుమారు 15 గంటల పాటు నిర్విరామంగా సభకు అధ్యక్షత వహించడం జరిగింది.
బస్పవాయు, రబ్బర్ బుల్లెట్లకు, వాటర్ క్యానన్లకు సైతం బెదరకుండా ఉద్యమకారులు సాగర హారంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నినదించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో సాగర హారం ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం.
- వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి
#SagaraHaram #TelanganaMovement #TelanganaMarch
కార్మిక ఎన్నికలో BRS పార్టీ విజయం.
అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR Technologies Ltd కంపెనీ లో భారత రాష్ట్ర సమితి నుండి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారి పై గెలుపొందారు.
#MTARltd
#MTAR
హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.
#JubileeHillsWithBRS #jubileehillsbypoll
ఈత చెట్టు మీది నుండి పడి హైదరాబాద్ కాచిగూడ లోని సాయి కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన గడ్డం రాములు గౌడ్ గారిని మరియు సబ్ స్టేషన్ లో ప్రమాదవశాత్తు ఇన్సులేటర్ తలపై పడి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడూరు గ్రామానికి చెందిన ఆర్టిజన్ శ్రీహరి గౌడ్ గారిని మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు నవంబర్ 29 వ తేదీన చేపట్టిన దీక్షతో, తెలంగాణలో అన్ని వర్గాల నుండి జరుగుతున్న ఆందోళనలకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ అనివార్యం అని భావించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించి, తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు, ప్రాణాలే పణంగా పెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం విజయతీరలకు చేరిన ఈ రోజు... విజయ్ దివస్
#VijayDiwas
బెయిల్ పై విడుదలైన మా సోదరుడు వి శ్రీకాంత్ గౌడ్ గారిని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మహబూబ్ నగర్ లోని ఇంటి వద్ద పరామర్శించి, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఏమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి , మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు ఉన్నారు.
నాడు అధికారం ఉన్నా నేడు అధికారంలో లేకున్న ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నిత్యం ప్రజా నాయకుడిగా పేద ప్రజలకు అండగా నిలిచే నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు...
@BRSparty@KCRBRSPresident@KTRBRS@VSrinivasGoud