విశాఖపట్నం నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం, ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి బస్సులో ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో 65 వినతులు అందాయని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరంలో, జీవీఎంసీ అదనపు కమీషనరు డి.వి.రమణ మూర్తి తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సత్వర పరిష్కారం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మేయర్ పేర్కొన్నారు.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam