ఈరోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో గౌరవ మినిస్టర్ హరీష్ రావు గారు మరియు మిర్యాలగూడ గౌరవ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి 4 సంవత్సరాల పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం సాధించిన విజయాలు మరియు ప్రభుత్వ పథకాలు ప్రాజెక్ట్ రూపంలో ప్రధానం చేయ���ం జరిగింది.@BRSHarish @EDRBRS @TelanganaCMO @KTRBRS @TelanganaCS @SmitaSabharwal @balkasumantrs @VSrinivasGoud
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్దీకరణ గురించి ప్రకటన చేసినందుకు గౌరవ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది పాలకుర్తి మండలం జనగామ జిల్లా.@EDRBRS@BRSHarish@KTRBRS@TelanganaCMO@TelanganaCS
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదార��� శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.