తెలంగాణ నిరుద్యోగ బిడ్డల పక్షాన నిలబడ్డందుకు న్యాయ వ్యవస్థకు మరోసారి ధన్యవాదాలు🙏. గ్రూప్-1 రెండవ సారి రద్దు కావడానికి ముమ్మాటికి కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణం. ఆనాడే బీయస్పీ డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమీషన్ని ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.
ఇంక టైం వేస్టు చేయకుండా…
1. @TSPSCofficial మొత్తం కమీషన్ అర్జంటుగా రాజీనామా చేయాలి. (డా.జనార్దనరెడ్డి గారు, మీకు ఏ మాత్రం నైతిక విలువలున్నా స్వచ్ఛందంగా వైదొలగి పోలీసులకు నిజం చెప్పాల్సిందిగా కోరుతున్నా)
2. కమీషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించిన తరువాతనే మిగతా పరీక్షలను నిర్వహించాలి.
3. కొత్తగా వచ్చిన 270 OMR షీట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
4. SIT ఇన్వెస్టిగేషన్లో కమీషన్ ఛైర్మన్,సభ్యులు మరియు SO వెంకటలక్ష్మిలను నిందితులుగా చేర్చాలి.
5. ఈ కేసును CBI కు అర్జంటుగా అప్పగించాలి.
6. అందరు అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి.
7. నవంబర్ లో జరగనున్న గ్రూప్-2 మరియు మిగతా పరీక్షలన్నీ కొత్త కమీషన్ హాయాంలోనే జరగాలి. ఈ కమీషన్ పై ప్రజలకు విశ్వాసం లేదు(ఒక్క KCR కుటుంబానికి తప్ప)
8. Gr-1 కుంభకోణంలో @TelanganaCMO మరియు #KTR పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలి.
9. గత గ్రూప్-1 ప్రిలిమ్స్ టాపర్ ఎవరో ముఖ్యమంత్రే స్వయానా వెల్లడించాలి.
పైవన్నీ జరగనిచో లక్షలాది నిరుద్యోగ బిడ్డలూ, వారి కుటుంబాలు తెలంగాణ లో @BRSparty ఎమ్మెల్యేలను తిరగనివ్వద్దని కోరుతున్నాను.
నిరుద్యోగ మిత్రులారా, దయచేసి నిరాశ పడకండి- మన బహుజనరాజ్యంలో పారదర్శకంగా నిజాయితీగా పరీక్షలను నిర్వహించుకుందాం. This is my promise to you all.✊
#KCRFailedTelangana
#LiberateTelangana
#VR99
@BSP4Telangana
కవిత గారు లిక్కర్ స్కాంలో బయటపడడానికి మహిళలందరిని వేసుకొని తిరిగితిరి. మహిళ రిజర్వేషన్స్ కావాలని కోట్లాడితిరి అందులో ఒక్కరైనా MLA టికెట్ కు హర్హులు లేరా.... మీ నాన్న దగ్గర కొట్లాడి మహిళలకు MLA టికెట్స్ ఇప్పించగలరా......?
బహుజన రాజ్య స్థాపన పూల బాట కానే కాదు. ఇందులో వానొచ్చినా, వరదొచ్చినా మడమ తిప్పడు ఉండదు. నాయకులపైనా, ప్రజల కైనా ఇదే వర్తిస్తది. అంతిమంగా త్యాగమే జయిస్తుంది.
कल ज़ोरदार बारिश में भी चला बसपा का मीटिंग। #Choppadandi#Telangana#BSP
కెసిఆర్ గారు మీరు గర్వంగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ముంపు ప్రాంతాలను కూడా సరిగా గుర్తించక పోతిరి. మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మీరు సేకరించిన భూమికంటే రెట్టింపు ప్రాంతం ముంపుకు గురవుతోంది. ఈ విషయాన్ని రైతులు మీకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్నది లేదు. రైతులను గోసపెట్టకండి. జర ఇప్పుడైనా పట్టించుకోని వారి సమస్యను పరిష్కరించండి. లేకపోతే గద్దె దిగండి.
*మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాము . అతను గొప్ప ఉపాధ్యాయుడు, శాస్త్రవేత్త మరియు ప్రజల అధ్యక్షుడు. అతను సరళమైన & వినయపూర్వకమైన జీవితాన్ని గడిపాడు మరియు తన పని మరియు దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. 🙏🙏
బ్రాహ్మనేతరులందరికీ రిజర్వేషన్స్ డే శుభాకాంక్షలు:
దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తన రాజ్యంలో 1902 july 26 నాడు బ్రాహ్మనేతర కులాలకు 50% రిజర్వేషన్లను ప్రవేశపెట్టి, ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసిన బహుజనోద్యమ మహనీయుడు చత్రపతి సాహు జి మహారాజ్ గారికి ధన్యవాదాలు
BSP అధినేత్రి జాతీయ అధ్యక్షురాలు ఇటువంటి చారిత్రక నిర్ణయం తీసుకున్న బెహన్జికి ధన్యవాదాలు🙏
NDA,INDIA కూటమిలతో చేరబోము
మాయావతి స్పష్టత ఇచ్చింది
తరతరాలుగా పాలితులుగా ఉన్న మనం,పాలకులు కావడమే BSP పార్టీ లక్ష్యం
బహుజన ప్రజలు ఒకసారి ఆలోచించండి
#BSP@Mayawati@RSPraveenSwaero@bspindia
బీసీ PM అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కూడా BC లకు అన్యాయం ఎందుకు జరుగుతుంది?
2018 నుండి ఈ నెల 17వరకు నియమించబడిన 604 జడ్జిలలో బీసీలకు దక్కింది కేవలం 11.92% అంటే సామాజిక న్యాయం ఎక్కడ ఉంది?
SC Category = 18 (2.98 %)
ST Category = 09(1.49 %)
OBC Category =72(11.92 %)
ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు BJP పాలిత రాష్ట్రాల్లో అనేకంగా చోటు చేసుకుంటున్నాయి? వీటి వెనకాల వారి ధర్మం ఏమిటో... ఎవరి అండ చూసుకొని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనం ఆలోచించాల్సిందే...
పాపం కెసిఆర్ గారి మనవడు హిమాన్షు చాలా వరకు నిజాయితీగా మాట్లాడిండు. తెలంగాణలో పదేళ్లుగా శిథిలావస్థకు చేరిన విద్యావ్యవస్థ గురించి స్వయానా ముఖ్యమంత్రి కుటుంబం నుండే ఒకరు ముందుకు వచ్చి అమాయకంగా నిజం చెప్పడం స్వాగతిస్తున్నా. ఆగర్భ శ్రీమంతులు చదివే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాజెక్టు(CAS) లో భాగంగా ఈ సోషల్ వర్క్ చేసిన ఈ బాలుడిని, ఆ టీచర్లను ప్రశంసించాల్సిందే….
కానీ….
దీనంతటికీ తాత గారే స్ఫూర్తి అని ఆ బాలుడితో చెప్పించి రాజకీయం చేయడం బాగా లేదు. పాపం అభం శుభం తెలియని పసివాడిని రాజకీయాలకోసం వాడుకున్నట్లుగా అనిపిస్తుంది. 1300 మంది విద్యార్థి యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో, పేద విద్యార్థులు చదివే పాఠశాల ఆవరణలో పందులు సంచరించడం మాత్రం తాతగారి ఘనతే. కమీషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కాకుండా, అదే డబ్బు విద్య కోసం ఖర్చు చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు.
మన తాత,తనయుడు (#KTR) కలిసి ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా ఉన్నాయని చెప్పించడం కూడా లోతైన రాజకీయ ప్రయోజనాలు దాగున్నై. ప్రజల్లో అసహనం,వ్యతిరేకత పెరిగినప్పుడల్లా దోపిడీ పాలకులు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారు. ఒకపక్క ప్రభుత్వం విఫలమైందని చెబుతూనే మరోపక్క సొంతంగా 'పాకెట్ మనీ' తో మేమే అభివృద్ధి చేయగల మానవతావాదులం చూపించే ప్రయత్నం కూడా నేటి స్వార్థ రాజకీయాల్లో భాగమే.
పదేళ్ల పాలనలో హిమాన్షుకు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి తెలవనివ్వకపోవడం మన దురదృష్టం. తాత గారిని చూడాలని ఐఐఐటి బాసర విద్యార్థులు 15 రోజులు ధర్నా చేసినా కనబడలేదు. గుండె కరగలేదు. నిన్న సిర్పూర్ లోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కూడా తాతగారిని చూడాలని వారి బాధలు చెప్పుకోవాలని ఉందని నాతో చెప్పారు. టీచర్లు వారికి తిండి లేదని పాఠశాలకు రావద్దంటున్నారని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలంగాణలో ఈ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితుల గురించి తాతకు,తనయునికి పూర్తిగా తెలుసు, కానీ మనుమడికి చూపించరు. ఒక వేళ తెలిసినా ఆ బాబును నిజం చెప్పనివ్వరు.
అందుకే బహుజన వాలంటీర్ గా మాతో పాటు కలిసిరా హిమాన్షు. తాత, తనయులు నీకంట కనబడకుండా దాచిపెట్టిన ఒక చీకటి ప్రపంచాన్ని నేను నీకు చూపిస్తా.
నీ లాగే పాఠశాలలను అభివృద్ధి చేయాలని చాలా మందికి ఉంది కానీ, నీకు వచ్చినంత త్వరగా వాళ్లకు సిఎస్ఆర్ (CSR) నిధులు రావు😊నిజాయితీ చేసినా దాతలు సహకరించడం లేదు. పని చేసినా పత్రికల్లో కవరేజీ కూడా రాదు.
చిన్న పిల్లలను బయటకు తీసుకొచ్చి తాత,తనయులు చేస్తున్న స్వార్థ రాజకీయాల గురించి త్వరలోనే ఈ బాబు తెలుసుకుంటాడని ఆశిస్తున్నా. అందరి తెలంగాణ, కొందరి తెలంగాణ గా మాత్రమే ఎందుకు మారిందో శోధించే ప్రాజెక్టును కూడా తీసుకోవాలని ఓక్రిడ్జ్ స్కూల్ కు సలహా ఇస్తున్న. లేక పోతే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అవుతుంది.
జైభీం. జై తెలంగాణ.
ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన రంగ చరిత్రలో భారతదేశ పేరు నిలిచిపోయేలా చంద్రయాన్-3 యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ALL THE BEST ISRO *బహుజన రాజ్యంలో మన బిడ్డలు రాకెట్లు తయారు చేయబోతున్నారు!* డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ BSP రాష్ట్ర అధ్యక్షులు - తెలంగాణ రాష్ట్రం
@RSPraveenSwaero
@BSP4Telangana
@BITCELL_BSP
మన పిల్లల కోసం, భవిష్యత్తు తరాలకోసం.....
"కలుద్దాం,🤝 నిలుద్దాం, గెలుద్దాం "
- రాజా మహేంద్ర వర్మ
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి
బహుజన్ సమాజ్ పార్టీ - తెలంగాణ
@bsptelangana@rspraveenkumar@bitcell@BspChevella
రాజ్యాంగం రద్దు అయితే,మళ్ళీ పశువుల కన్నా హీనంగా చూడబడుతాం..! మన స్త్రీలఫై లైంగిక దాడులు జరుగుతాయి... అందుకే మన రాజ్యం స్థాపించుకుందాం. రాజ్యాంగం రక్షించుకుందాం.
ముఖ్యమంత్రి అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో.. BC లకు 70 MLA సీట్లు.
దశాబ్దాలుగా అన్ని మనువాద రాజకీయ పార్టీలు బహుజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప, ఏనాడూ (BC) ఈ వర్గాలకు రాజకీయ వాటా ఇవ్వడానికి ముందుకు రాలేదు.రాజకీయ పార్టీ ల ముసుగులో సంపన్న వర్గాలు ప్రజా స్వామ్యాన్ని " *ధనస్వామ్యం* "గా కుటుంబస్వామ్యంగా, కులస్వామ్యంగా మార్చారు. వారసత్వ రాజకీయాలతో దేశ పురగతి అడ్డుకున్నారు
@bsptelangana@rspraveenkumar@bitcell@bspchevella
నాటి ఉమ్మడి పాలనలో గల్ఫ్ సోదరుల కష్టాలు ఎలా ఉన్నాయో నేడు స్వరాష్ట్ర పాలనలో కూడా వారి జీవిత కష్టాలు అలానే ఉన్నాయి.వారిని పట్టించుకునే హృదయం BRS పార్టీలో ఎవరికి లేదు.పొట్ట చేతపట్టుకుని పోయి ఆలి పిల్లలకు దూరంగా ఏజెంట్ల చేతుల్లో మోసపోతు పస్తులతో కాలం గడుపుతున్న గల్ఫ్ సోదరులను అదే గల్ఫ్ దేశాల్లో కంపెనీలు పెట్టించి ఓనర్లను చేయబోతున్నాడు మన నాయకుడు @RSPraveenSwaero గారు. ఈ విషయం మీ గుండెల మీద రాసిపెట్టుకోండి.
@BSP4Telangana