సామాజిక ఉద్యమకారులు,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, సామాజిక న్యాయం కోసం సుమారుగా 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ, సబ్బండ వర్గాలకు సమ న్యాయం జరగాలని అహర్నిశలు కృషి చేస్తున్న పద్శ శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
Happy Birthday, Anna garu🙏🏼
కేసీఆర్ గారు 'Man of Ideas'.. ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తి. ఇంత చిన్న చిన్న విషయాలు.. అంటే, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, గన్మెన్లను తీసేయండి, బదిలీలు చేయండి అనే పనులు ఆయన అసలు పట్టించుకోరు. అట్లాంటివి ఆయన దృష్టికి కూడా రావు!
#KCR#RSP#Telangana#KCRVisionary@RSPraveenSwaero
"నేను హిందువుని కాను" అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నాపై మొదటి నుంచి దాడులు చేస్తున్నది BJP. అయినా వాటిని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు.
మలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసేలా పంపించాను. రాజకీయాలను రాజకీయాలుగా, అభివృద్ధిని అభివృద్ధిగా చూడాలనే నమ్మకం నాది.
నేను బండి సంజయ్ గారిని ఒక్కసారి కూడా కలవలేదు. కానీ నాపై లేని వీడియోలను మార్ఫింగ్ చేసి గంటల్లోనే దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. నన్ను "టెర్రరిస్ట్", "అర్బన్ నక్సల్" అని ముద్రవేశారు.
ఇది విమర్శ కాదు, వ్యక్తిత్వ హననం.
— డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ IPS.
#RSPraveenKumar #BRS #Telangana
🔥 భయ దహనం 🔥
భయం అనేది ఒక మానసిక వేదన.
భయంతో మనిషి ఏ పని చేయలేడు.
భయం ఆందోళనకు మూల కారణం.
భయం మనిషిని నిర్జీవుడిగా మారుస్తుంది.
భయం మనిషి కలలను, ఆలోచనలను చంపేస్తుంది.
ముఖ్యంగా పేద వర్గాలు, అణగారిన వర్గాలను అణచివేయడానికి భయం ఒక పెద్ద ఆయుధంగా ఉపయోగపడుతోంది.
నేటికీ కూడా MRO ఆఫీస్ నుండి Collector ఆఫీస్ వరకు పేద ప్రజలు చెప్పులు విప్పి, చేతులు కట్టుకొని తమ సమస్యలు చెప్పడానికి కూడా భయపడుతున్నారు.
ఈ భయం వల్లే పేదవారు,బలహీన వర్గాలుగా మారుతున్నారు.
మనలో ఉన్న భయాన్ని, ఆత్మన్యూనత భావాన్ని సమాధి చేయనంతవరకు
ఈ సమాజంలో మనం గుర్తింపు పొందలేం,
ఏమి సాధించలేం.
ఒక్కసారి ఆలోచించండి
👉 Jyotirao Phule గారు సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడకపోతే
👉 Savitribai Phule గారు మనకు చదువు నేర్పకపోతే
👉Dr. B. R. Ambedkar గారు మనకు రాజ్యాంగం రాయకపోతే.ఈరోజు మనం బానిసలుగా బ్రతికే వాళ్ళం.
ఆనాడు ఆ మహనీయులు
"భయ దహనం" చేశారు
కనుగనే కుల వివేక్షత,దోపిడీ
అవమానాలతో పోరాడి
ఈరోజు మనకు అనేక హక్కులు
కల్పించి,బ్రతికే స్వేచ్ఛను ఇచ్చారు.
అందుకే ప్రతి సంవత్సరం భీమ్ దీక్షలో భాగంగా ఏప్రిల్ 13న జరిగే ముగింపు సభలో
“భయ దహనం” చేస్తాం.
నిన్న భీం దీక్ష ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని భయ దహనం చేసిన డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సార్ గారు.
భయాన్ని దహనం చేద్దాం.!
స్వాభిమానం తో జీవిద్దాం.!!
@RSPraveenSwaero
#భయదహనం
#Swaeroism
భారతదేశాన్ని లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనది.
డాక్టర్ అంబేద్కర్ దార్శనికత మూలంగానే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది.
ఆ మహనీయుని పట్ల కృతజ్ఞతగా, తెలంగాణ గడ్డపై దేశంలోనే అరుదైన రీతిలో 125 అడుగుల అంబేద్కర్ గారి మహా విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు!
జై భీమ్ ✊🔥
మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు.
సిర్పూర్ నియోజకవర్గం లో కొండ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆటో ఎక్కలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నట్లు గమనించిన డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించారు. అక్కడే ఆగి స్వయంగా ఆటోను నెట్టి పైకి ఎక్కేలా సహాయం చేశారు.
సార్ చూపించిన ఈ మానవత్వానికి అక్కడున్న ప్రజలు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. నాయకుడిగా మాత్రమే కాకుండా, సాధారణ మనిషిగా ప్రజల కష్టాల్లో భాగస్వామి అవుతూ సహాయం చేయడం నిజమైన నాయకత్వానికి నిదర్శనం అని స్థానికులు అభినందించారు.
@RSPraveenSwaero@KTRBRS@BRSparty
ఫ్లాష్! ఫ్లాష్ !
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్....
బిఆర్ఎస్ పార్టీలో చేరిన డాక్టర్ సురంజన్
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన మంగళవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ సురంజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఆదరణ లేదని, జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులే కరువయ్యారని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ నెరవేర్చడం లేదని అన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎదురు ఉండదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి, KDCC మాజీ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, మాజీ MPP వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు భాస్కర్, దిలీప్,రమేష్ పాల్గొన్నారు.
లాగుల తొండలు ఇడుస్తా, పేగులు మేడకేస్కొని తిరుగుతా అనే సంస్కృతి మా బిఆర్ఎస్ పార్టీ కి లేదు మా నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ తెలంగాణ సమాజానికి ఆ బాష నేర్పలేదు..
-బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
@RSPraveenSwaero@KTRBRS
ఆకలి చావుల అంచున కాగజ్ నగరి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు:
సాక్షాత్తు సీయం @revanth_anumula గారి శాఖ లోనే కార్మికుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మిగతా శాఖల పరిస్థితిని అవలీలగా ఊహించుకోవచ్చు. గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోతే వీళ్ళు ఏం తిని బతుకుతారు కాంగీస్?
మీకు ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ లో కనీసం ఒక్క శాతం అన్నా ఈ పేదల జీవితాల మీద ఉంటే బాగుండు.
Municipal Sanitation workers of Kagaznagar town of Telangana are the brink of starvation because @TelanganaCMO has not been paying their wages for the last six months! Some of the workers are diabetics and have other morbidities, but none in the government have sympathy for these poor souls.
@BRSparty@KTRBRS@BRSHarish@ANI@PTI_News@etvtelangana@RTVnewsnetwork@NtvTeluguLive@TNEWS@ntdailyonline@kharge@RahulGandhi@cdmatelangana
తెలంగాణ లో రెండేళ్ల @INCTelangana పాలనలో రోజూ చిద్రమైతున్న పసిబిడ్డల భవిష్యత్ కు సజీవ సాక్ష్యం జగిత్యాల లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఈ పేద దళిత బిడ్డలకు జరిగిన అవమానం. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ‘అంటరానివాడని’ ఎలా క్లాస్ బయట కూర్చోబెట్టి అవమానించారో , ఈ రోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల బిడ్డలను అలాగే అవమానిస్తున్నారు.
సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మణ్ గారి ఇలాకాలోనే ఇంత ఘోరం జరుగుతుంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితిని ఊహించుకోవచ్చు.
BAS నిధులు రిలీజు చెయ్యనందుకు అర్జంటుగా సీయం @revanth_anumula@Bhatti_Mallu@minister_adluri లపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసి జైలుకు పంపాలి.
ఎస్సీ ఎస్టీ మంత్రులైనా సరే వీళ్లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ మరియు సంక్షేమశాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి.
@NCPCR_@TelanganaCMO@TelanganaCS@TelanganaDGP
#TelanganaSinking #AntiDalitCongress
Attack on hon’ble Chief Justice of India, Justice BR Gawai in an open court by an alleged ‘Sanatani’ advocate is utterly condemnable. If this can happen to the Chief Justice in broad daylight, imagine what kind of havoc such woke minds are playing with ordinary citizens in the country!
This is a symptom of a deeper malaise in which vulnerable citizens are being constantly brainwashed by retrogressive and fundamentalist forces in various forms in this country.
This is a high time that all internal security agencies like IB, NIA, CBI, and state intelligence agencies keep a tight check on such radicalisation in any religion.
If unchecked, this virus polarises society and causes irreparable damage to all democratic institutions and throws India into dark ages again. A diverse nation like India can’t just afford this.
Jai Hind.
#IstandWithJusticeGawai
Throwing shoe at Chief Justice of India while chairing the proceedings in open court is a ‘Cognizable Crime’, irrespective of the fact whether the attacker is a lawyer or not. The act done by the disgruntled advocate also attracts the ‘Contempt of Court’ proceedings.
The CJI should get a Criminal case registered under SC/ST Atrocities act & also initiate Contempt of court proceedings. CJI cannot brush aside the incident- as it is a crime against the society, crime against the Nation and tyrannical act against the constitution.
My questions:
If the attacker is a common man would the courts be as benevolent as they are towards this Sanatani lawyer in this hon’ble Justice Gawai case?
Who is ruling the country- religion or constitution?
#JusticeGawai
#Equality
#Justice
#fraternity
అస్తిత్వం,ఆత్మగౌరవం కోసం గెరిల్లా యుద్ధాన్ని నడిపి, జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసులందరినీ ఏకం చేసి, పశువుల కాపరులపై సుంకం విధించిన అసఫ్ జాహీ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన గిరిజనోద్యమ యోధుడు కొమురం భీమ్ వర్థంతి నేడు.
అస్థిత్వం ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ స్ఫూర్తితో కొట్లాడి మన హక్కులను కాపాడుకుందాం.
మన భూములు లాక్కుంటూ, మన గిరిజన బిడ్డలను జైలుకు పంపుతూ,మన ఆడబిడ్డలపై అటవీ అధికారులతో దాడులు చేయిస్తూ,మన ఆదివాసుల పేరుతో భూములను ఆక్రమించి, దోచుకునే దొంగల భరతం పడుదాం.
ఆ మహనీయుని ఆశయాలను కొనసాగిద్దాం.
జై కొమురం భీం
జై తెలంగాణ.
సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ బిజెపి పార్టీలను వదిలేసి,కేసిఆర్ పాలనలోనే మా బతుకులు మారుతాయని స్వచ్ఛందంగా గులాబీ కండువాలు కప్పుకొని పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న ప్రజలు.
రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామం గులాబీ మయం కాబోతున్నది.✊
జై తెలంగాణ.
@BRSparty@KTRBRS
#SirpurFirst
సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు మీరు బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రోడ్ల మీదికొచ్చి కొట్లాడుకుంటున్నరు బాగానే ఉంది కానీ…
తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు గత నాలుగు నెలల నుండి జీతాలు రాక హాహాకారాలు చేస్తున్నారు తెలుసా? వాళ్ల కుటుంబాలు ఆకలి చావుల అంచుల్లో ఉన్నాయి!! ఆకలి తో ఉన్న ఉద్యోగులు పేద ఎస్సీ పిల్లలకు చదువెట్లా చెప్తరు??
ముందు వెళ్లి డిప్యూటి ముఖ్య మంత్రి @Bhatti_Mallu గారి దగ్గర కూర్చుని వారి జీతాలు పడేటట్టు చూడండి. మీ మంత్రులకు జీతాలు వచ్చినపుడు ఈ చిరుద్యోగులకు కూడా రావాలె కదా?
మీ మంత్రులకు తన్నుకునే సమయం ఉన్నది కానీ ఉద్యోగుల తండ్లాట పట్టించుకునే బాధ్యత లేదా @revanth_anumula గారు?
@TelanganaCMO@TelanganaCS@TGSWREIS
ఈ దేశ రాజకీయాల్లో,అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని,సామాజిక న్యాయం పాటించాలని రాజ్యాంగబద్ధంగా పోరాడిన మహనీయులు.
మన ఓటు మనమే వేసుకొని రాజ్యాధికారం చేపట్టాలని సూత్రీకరించిన యోధుడు మాన్యవర్ కాన్శీరాం గారి వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం.
జై భీం
జోహార్ కాన్శీరాం.