డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే.
ముఖ్యమంత్రికి మంద కృష్ణ మాదిగ బహిరంగలేఖ.
గౌరవ ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి శ్రీ A . రేవంత్ రెడ్డి గారికి సామాజిక ఉద్యమ నమస్కారాలు.
విషయం: మాజీ ఐపిఎస్ అధికారి,దళితుడైన డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (అడిషనల్ డిజిపి రిటైర్డ్ ) గారి సెక్యూరిటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరి కాదు. ఆ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది...
ఇటీవల నాలుగు రోజుల క్రితం చట్ట విరుద్దంగా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా,నోటీసులు ఇవ్వకుండా,ఎలాంటి స్పష్టమైన కారణాలు చూపకుండా పోలీసు అధికారులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ చేసి తన సెక్యూరిటీని తొలగిస్తున్నాం,బుల్లెట్ ప్రూఫ్ వాహనం తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం.
ప్రస్తుతం డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే తమ ప్రభుత్వం ఇలాంటి దిగజారుడు చర్యకు పాల్పడుతుందని ఎమ్మార్పీఎస్ బలంగా నమ్ముతుంది.
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 1995 లో ఐపిఎస్ అధికారిగా ఉద్యోగం సాధించి, 26 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం, మన దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై తెగించి పని చేశారు.
ఆయన పని చేసిన కాలంలో దేశానికి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురైనా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి చాకచక్యంగా,వినూత్నమైన రీతిలో నియంత్రిస్తూ తనదైన పద్దతిలో పని చేయడం జరిగింది
ఈ క్రమంలో చట్ట వ్యతిరేక శక్తులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టార్గెట్ చేసుకొని, పలుమార్లు అతనిపై హత్యాయత్నాలు జరిపిన విషయం ప్రభుత్వానికి తెలుసు
అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనంతపురంలో ఎస్.పి గా పని చేసిన కాలంలో ఫ్యాక్చనిస్టులను ఉక్కుపాదంతో అణచి వేశారు
2003 లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తండ్రి అనారోగ్యబారిన పడినపుడు, ఎలాగైనా తండ్రిని చూడడానికి అతను వస్తాడని భావించిన కొన్ని రాజ్యాంగ, చట్ట వ్యతిరేక శక్తులు ప్రవీణ్ కుమార్ గారిపై హత్యాయత్నానికి ప్రయత్నించారని స్వయంగా ఆనాటి పోలీసు అధికారులే అధికారికంగా ధృవీకరించారు
అంతేకాకుండా, కరీంనగర్ ఎస్.పి గా పనిచేసిన కాలంలో కూడా ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తులు ఎస్.పి ఆఫీస్ పేల్చేసి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంతం చేయాలని కుట్ర పన్నినట్టుగా పోలీసు అధికారులే చెప్పారు
2012 తర్వాత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల సెక్రటరీగా పని చేసి వేలాది మందిని డాక్టర్లు,ఇంజనీర్లు,పైలెట్లు గా తయారుచేయడమే కాకుండా వందలాది మందిని విదేశాలకు పంపి ఉన్నతవిద్యను అందించేందుకు తీవ్రంగా కృషి చేశారు
2019లో గురుకులాల సెక్రటరీగా ఉన్న సమయంలోనే , కొన్ని అసాంఘిక శక్తులు దామోదర సంజీవయ్య భవన్ లో ఉన్న కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించి ప్రవీణ్ కుమార్ ను అంతమొందించే దుర్మార్గానికి ఒడిగడితే పోలీసు అధికారులే దాన్ని ఛేదించి ప్రవీణ్ కుమార్ ను జాగ్రత్తగా ఉండాలని సూచించారు
ఇలాంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు X కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది
కేవలం ప్రవీణ్ కుమార్ గారికి మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణ హాని ఉందని, నాటి ఇంటెలిజెన్స్ అధికారి ప్రస్తుత హైదరాబాద్ సిపి గౌరవ సజ్జనార్ గారే నివేదికలు ఇవ్వడం జరిగింది.
ప్రవీణ్ కుమార్ గారు తన 26 ఏళ్ల పోలీసు ఉద్యోగంలో భాగంగా ఆయన చేసిన సేవలను గుర్తించి,రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ అవార్డు,పోలీసు విభాగంలో అత్యున్నత శౌర్య పథకం ఇచ్చింది.
ప్రస్తుతం 30 సంవత్సరాల తన పోలీసు జీవితం పూర్తి చేసుకున్న అనంతరం తన ప్రాణాలకు ముప్పు లేదంటూ,అకారణంగా, ఉద్దేశ్యపూర్వకంగా సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించడం అంటే, ఆయన ప్రాణాలను ప్రభుత్వమే ప్రమాదంలో పడేస్తుందని అర్థమవుతుంది.
ఒకవేళ తమ ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ముందే తెలిస్తే, ప్రవీణ్ కుమార్ లాంటి అధికారులు ప్రాణాలకు తెగించి పోరాడేవారు కాదు కదా! ఒకవేళ ఇపుడు తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీని తొలగిస్తే భవిష్యత్ లో ఏ అధికారి కూడా చట్టం కోసం,దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసేందుకు సిద్దంగా ఉండరు అనేది గుర్తించాలి.
ఎలాంటి హోదా లేకపోయినా,వారికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికి అనర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తున్న విషయం సమాజానికి తెలుసు.దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అధికారుల సెక్యూరిటీ తొలగించి,చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడే వారికి సెక్యూరిటీ ఇవ్వడం సరైనదేనా అని ఎమ్మార్పీఎస్ ప్రశ్నిస్తుంది.
@RSPraveenSwaero
Strongly condemn the arrest of three journalists during the festival. Congress rule in Telangana reminds of Emergency days every single time
It is unfortunate how @TelanganaDGP is hell bent on treating journalists like criminals
You could have served them notices and called them for an investigation. Going into journalists homes in the dead of the night is definitely a stretch!
I demand immediate release of the arrested journalists. None of the sections are nonbailable, so why did the Telangana police decide to terrorise the journalists and their families with these midnight arrests
I request Telangana DGP to follow the due legal process and not play into dirty politics of Congress party and its lousy leadership
P.S: Who is the actual source of the leak in this episode ? Do you think a pro Govt TV channel will telecast a story without active support from Mr. 30% ?
గురుకుల గాలిలో వెలిగిన దీపం ఆయనే...
గుర్తింపు లేకున్న విద్యార్థిలో
మహా భవిష్యత్తు చూసిన నేత ఆయనే..
ఎంతటి చీకటైనా
“విద్యే విమోచనం” అని చెబుతూ
దారి చూపిన దీపస్తంభం...
సామాజిక న్యాయం కోసం
సాహసంగా ముందుకు నడిచిన
ఒక యోధుని పుట్టినరోజు ఇది...
#HappybirthdayRSP@RSPraveenSwaero
అణచివేతల నీడలో పెరిగిన జాతికి
వెలుగై వచ్చిన పేరు- ప్రవీణ్ కుమార్
కన్నీటి గీతలు ఉన్న చోట
ఆశల అక్షరాలు రాసిన నాయకుడు.
పేదవాడి చేతిలో అక్షరాన్ని పెట్టి
ఎవరెస్ట్ శిఖరానికే దారి చూపించాడు;
బందీలైన కలలను విడిపించి
ప్రపంచాన్ని చదివే నడక నేర్పించాడు
@RSPraveenSwaero#HappyBirthdayRSP
All the very best to Capt. Shubhanshu Shukla as he is going to be the second Indian to go to the space at 4PM today. Feeling lucky to witness two landmark moments in the history of Indian space program. First one was of Rakesh Sharma and now Capt. Shukla. Jai Hind.🇮🇳🫡
సిర్పూర్-పెంచికల్ పేట లో కాంగ్రెస్ నాయకుడు రాచకొండ కృష్ణ ధన దాహానికి దౌర్జన్యాలకు మరో పేద రైతు రాజశేఖర్ బలయ్యాడు. ఈ రోజు న్యాయం కోసం రైతులందరూ పొలం పనులన్నీ వదిలేసి ధర్నా చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. బాధితుడికి వెంటనే కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి.
సిర్పూర్ నియోజకవర్గం లో మరియు రాష్ట్రంలో వ్యాపారస్తుల ఆగడాలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి. రాజశేఖర్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. ఎంత నిరాశ ఉన్నా రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని మనవి 🙏.
@TelanganaCMO@revanth_anumula@BRSparty@BRSHarish@KTRBRS@TelanganaCS@TelanganaDGP
#Justice4Farmers
#CongressAntiFarmers
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం @revanth_anumula పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయం.
26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18 న హెల్త్ సెక్రటరీ, డిఎంఇ NMC ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం.
ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం ఈరోజు కమిటీ వేయడం హాస్యాస్పదం.
పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారూ.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా?
మీ పరిపాలన వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారుతున్నది.
NMC రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖను మీకు పంపిస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 26 మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కాపాడండి.
తక్షణమే మెడికల్ కళాశాలలకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి .
ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థులు జీవితాలను నిలబెట్టండి.
@TelanganaCMO@DamodarCilarapu@TelanganaCS
#CongressFailedTelangana
అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..
కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ సీఎం, ఈ వైఫల్యాల కాంగ్రెస్ సర్కారు గుర్తుపెట్టుకోవాలి
ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడు
చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను.
అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉంది
ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా ?
లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్దం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నా
ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి
జై తెలంగాణ
Deeply saddened and shocked to know this most tragic accident.
Air travel is supposed to be the safest among all modes of travel, but series of tragic incidents recently are kind of shattering this faith.
Hope all manufacturers, airlines, and regulators take a serious note of this and launch a full scale investigation.
May be aircraft manufacturers have to embed balloons like it is done @SpaceX dragon capsule as an emergency measure. This at least will ensure some soft landing some where…(loud and naive thinking)
However, no cheating as it was done in case two crashes of Boeing Max-400 by simply paying $1 Billion. Justice needs to be done irrespective of nationality.
My prayers for all the families of victims.
🙏🙏🙏
@DGCAIndia@Boeing@Airbus@embraer@Bombardier@narendramodi@KTRBRS@airindia
ఈ రోజు పీసీ ఘోష్ కమీషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి @BRSparty సీనియర్ నాయకులు, మాజీ మంత్రి @BRSHarish గారి వాంగ్మూలాన్ని ప్రత్యక్షంగా చూసిన.
జడ్జి గారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో ఓపికగా, చక్కటి లాజిక్కు మరియు స్పష్టమైన సాక్ష్యాధారాలతో హరీష్ రావు గారు సమాధానాలిచ్చిన సరళి చాలా గొప్పగా ఉంది. This speaks volumes about his depth in the subject.
కమీషన్ల కాంగ్రెస్-బీజేపీ మంత్రులైతే మొదటి ప్రశ్నకే ముచ్చెమటలు పట్టి, మూర్ఛ వచ్చి పడిపోయే వారు. 🤣
పేద పిల్లల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు గా మారిన కాంగ్రెస్ మనువాద పాలన గురించి నేను నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. దయచేసి చదవండి, నచ్చితే షేర్ చేయండి, మీ కుటుంబాల్లో చర్చించండి. ప్రచురించిన ఎడిటర్ గారికి ధన్యవాదాలు.
🙏
This is utterly shameful.
Neither school children nor patients are safe in @INCIndia’s Telangana.
All surveillance systems have crashed under this Commission Sarkar.
రేవంత్ రెడ్డి గారు,
మీరే మంత్రిగా ఉన్న సాంఘీక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఒక IAS అధికారి, డా. అలుగు వర్షిణి గారు దళిత విద్యార్థులు సంపన్న వర్గాల నుండి రాలేదు కావున హాస్టల్స్ లో వారి టాయిలెట్స్ వాళ్లే శుభ్రం చేసుకోవాలి, వాళ్ల వంటలు వాళ్ళే చేసుకోవాలి, ఇందులో తప్పేముంది అని బహిరంగంగా హుకుం ఇచ్చారు. దీన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను బయటకు గెంటేయండి అని చెబుతున్నారు.
ఈ లాంటి ‘మంచి’ అలవాట్లు విద్యార్థులకు భవిష్యత్ లో చాలా బాగా పనికొస్తాయని వారు గట్టిగా సమర్థించుకుంటున్నారు కూడా. పైగా దీన్ని రాజకీయం కూడా చేయొద్దు అని వారు హెచ్చరిస్తున్నారు.
మీ ఆదేశాలు లేకుండా ఏ అధికారి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. తరతరాలుగా మా టాయిలెట్లు మేం కడుక్కుంటూనే ఈ నిచ్చెనమెట్ల సమాజం టాయిలెట్లు కూడా మేమే కడుగుతున్నాం. అయినా ఇన్ని గొప్ప మనువాద సంస్కరణలు మా పేద విద్యార్థులకేనా?
మీ పిల్లలు చదివే కార్పొరేట్ స్కూల్స్ లో కూడా అమలు చేయాలని మీ అధికారులకు చెప్పండి.
అలాగే ముఖ్యమంత్రి గా, సంక్షేమ మంత్రిగా, సంపన్న వర్గాల ప్రతినిధిగా మీరు కూడా మీ టాయిలెట్ ఈ రోజు నుండే కడుక్కోండి, మీ మంత్రులతో, అధికారులతో కడిగించండి, గంధా భవన్ లో మీ సహచరులతో కడిగించండి. ప్రతి రోజూ ఆ ఫోటోలను వీడియోలను తెలంగాణ ప్రజలతో షేర్ చేసుకోండి.
రేవంత్ రెడ్డి గారి బంగళాకు ఈ రోజు నుండి పోవడం మానేయాలని హౌస్ కీపింగ్ సోదరులకు మనవి.
ప్రతిరోజూ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి కాంగ్రేసు ప్రభుత్వం అడుగడుగునా తూట్లుపొడుస్తున్నా, నిలదీయకుండా నిస్సిగ్గుగా అందులో బానిసలుగా కొనసాగుతున్న మా ఎస్సీ ఎస్టీ సోదరులకు (@Bhatti_Mallu@DamodarRajanar1 తో సహా) ఈ పోస్టు అంకితం.
జై భీం. జై తెలంగాణ.
We condemn the orders of @revanth_anumula’s @INCTelangana government which mandates that the dalit students clean their own toilets in welfare schools as they are not from ‘posh society’ in the name of civilising them.
These orders of an IAS Officer, Dr Alugu Varshini ji are utterly outrageous and reflect the manuvadi mindset of many in bureaucracy. She is even threatening the parents who question such ‘reformatory’ orders!!!
All these are happening under the very nose of @RahulGandhi ji who is talking of human dignity by holding the Constitution everyday and @kharge ji who claims he is a Dalit and is also the president of AICC.
@BRSparty@PTI_News@ANI@IASassociation@TelanganaCMO@TelanganaCS@ambedkariteIND@NationalDastak@TheBluePen25@DalitDastak@Murali_IASretd@KRajuINC@BRSHarish@KTRBRS
మాదాపూర్ లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది!
మొన్న రక్తపు గాయాలతో బాధితులు రాత్రి 330AM కు కాల్ చేసినా స్పందన లేదు.
FIR 18 గంటల తరువాత చేశారు. బాధితులే పాపం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నయం చేయించుకున్నారు.
ఇంతవరకు ఒక్క నిందితున్ని కూడా అరెస్టు చేయలేదు. ఈ మాఫియా గ్యాంగ్ మీద ఇంతకు ముందే ఒక కేసు ఉంది. ఆ కేసులో కూడా వాళ్లు ఎవరూ అరెస్టు కాలేదు. ఎందు కంటే వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. (రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి లాగ అన్న మాట) అంత వరకు మన పోలీసులు అరెస్టు చేయరు.
సరిగ్గా ఇప్పుడు కూడా మళ్లీ అదే జరగబోతుంది. వాళ్లు మారణాయుధాలతో దాడి చేసి, సీసీటీవీలు ధ్వంసం చేసి ఆధారాలు లేకుండా చేసి, ఇక్కడ ఉంటే చంపేస్తామని బెదిరించినా వాళ్లను ‘దేశంలో నంబర్ వన్ పోలీసు’ అయిన మన తెలంగాణ పోలీసులు ముట్టుకోరు. వాళ్లు పక్కా గా స్టే తెచ్చుకుంటారు.
ఇప్పటికీ నేరస్తులు బాధితులను ఫోన్లలో బెదిరిస్తూనే ఉన్నారు. వాళ్ల మీద పీడీ యాక్ట్ పెట్టాలన్న ఆలోచన కూడా మన పోలీసులకు రాదు. ఇక ప్రధాన మీడియాకు ఇది కనిపించే అవకాశమే లేదు. అది ఎప్పుడూ దళితులకు ఆమడ దూరంలో ఉంటది.
అసలు విషయం :ఇక్కడ నిందితులు శ్రీనివాస్ రెడ్డి -కవితా రెడ్డి మరియు ఇతర గూండాలు
బాధితులు-వెంకయ్యలు, ఎల్లయ్యలు, పుల్లయ్యలు.
జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశాలు అంటే పోలీసులకు నవ్వులాటగా ఉంది. హైకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ భేఖాతర్!! చేష్టలుడిగిన పోలీసు అధికారుల పై ఇంతవరకు చర్యలు లేవు!!!
బుద్దపూర్ణిమ నాడే నిర్మల్ లో దళితుల మీద దాడి జరిగింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడా దళితులకు రక్షణ లేదు.
ఇక్కడ @Bhatti_Mallu డిప్యూటీ సీయంగా ఉన్నా, రాజనర్సింహ మినిస్టర్ గా ఉన్నా దళితులకు ఒరిగింది శూన్యం. BIG ZERO. మీకు ధమ్ముంటే @revanth_anumula ని నిలదీసి దళితులను కాపాడండి, లేదా వెంటనే రాజీనామా చేసి రాజకీయాల్లో నుండి తప్పుకోండి.
@kharge ji you have cheated Dalits of Telangana by promising them security in Chevella Declaration.
@RahulGandhi you continue to cheat all the poor in this country by tolerating goondagiri of your cronies like @revanth_anumula .
Will Justice BR Gavai’s elevation as Chief Justice of India make any difference to the lives of marginalised in this country that is intoxicated with ManuDharma?
Keeping fingers crossed.
@TelanganaDGP@TelanganaCMO@TelanganaCS@PTI_News@ANI@ambedkariteIND@v6velugu@TNEWS@BRSparty
ఇది కౌటాల మండలం వీరవెల్లిలో పరిస్థితి.
నీళ్ల బోర్ పాడైపోయింది. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు.
పేదలు ఇల్లు ఇల్లు తిరిగి కొన్ని నీళ్లు కావాలని అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది.
గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి @meeseethakka గారు ప్రస్తుతం ఈ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా ఉన్నరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాలిస్తున్నడు. ఆయనకు ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టింపు లేదు.
ఏం చేస్తున్నరు మరి?
కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వడం కూడా చేతకాకపోతే ఎందుకు గద్దె మీద ఇంకాకూర్చున్నరు @revanth_anumula ?
మళ్లీ ఈయనను కోసుకొని తినమని చెప్తున్నాడు!!!
@TelanganaCMO
Deeply saddened and anguished by the tragic loss of lives in the horrific terrorist attack in Pahalgam, Jammu & Kashmir.
My heartfelt condolences to the families of the tourists who lost their lives.
I strongly condemn this cowardly act of violence and urge the Government of India to ensure justice for the victims' families.