“iTDP తెలంగాణ” ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమితులు అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, శ్రీ నన్నూరి నర్సిరెడ్డి గారి “సన్మాన మహోత్సవం”
వేదిక: జల వాయు విహార్ కమ్యూనిటీ హాల్, కూకట్పల్లి
తేదీ: 08-12-2024, సమయం: ఉదయం 10:00 గంటలకు 👇
“చెప్పుచ్చుక కొడతా” “…… పుట్టావా”
అని అత్యంత అభ్యంతకరంగా ఆనాటి శాసనమండలి అధ్యక్షులు శ్రీ షరీఫ్ గారిని ఉద్దేశించి జుగుప్సాకరంగా అవమానకరంగా సభ్య సమాజం విస్తుపోయేలా, నాటి మంత్రివర్యులు, నేటి శాసనమండలి ప్రతిపక్ష నాయకులు అయిన బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు. పోడియం ఎక్కి మరీ మైనారిటీ వర్గానికి చెందిన గౌరవాధ్యక్షుడినే శాసనమండలి సాక్షిగా కొట్టబోయారు.
“సౌ చూహా ఖాకే బిల్లి హజ్ నిక్లా”
(తెలుగులో…వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు వెళ్ళింది’) అన్న సామెతను ఉటంకించానని, తద్వారా నేను ముస్లింల మనోభావాలను దెబ్బతీశానని నిస్సిగ్గుగా బురద చల్లుతున్నారు. ‘హజ్ యాత్ర’, ‘కాశీ యాత్ర’ పదాలను అన్ పార్లమెంటరీ పదాలుగా నిర్వచించి హిందూ ముస్లిం వర్గాల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
‘బరితెగించిన కోడి బజార్లో గుడ్డుపెట్టిందట’
అలా ఉంది వైసీపీ నాయకుల ప్రవృత్తి.
మంత్రి గారు చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. శాసన సభ అనుమతి లేకుండా నయా పైస ఖర్చు పెట్టకూడదు ప్రభుత్వం. ఇది చట్టరిత్యా నేరం.
మరి ఈ రు.600 కోట్లు సభ అనుమతి లేకుండా ఖర్చు చేసిన అధికారులు ఎవరు? ఒక వేళ జగన్ చెయ్యమన్నా అధికారులు రూల్స్ అతిక్రమించి ఈ పని చెయ్యకూడదు. ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్-లో ఏ అధికారులు ఈ నేరానికి పాల్పడ్డారు? వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఈ తప్పు జరగకుండా ఎటువంటి సంస్థాగత మార్పులు చేస్తున్నారు?
లేక ఇది వైసీపీ మీద బురదజల్లి ఇంటికి పొయ్యి పడుకునే కార్యక్రమమా?
దొంగ దొంగతనం చేశాడు కథ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. దొంగను ఏం చేస్తారు? దొంగతనం భవిష్యత్తులో జరక్కుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? వీటికి సమాధానాలు కావాలి ప్రజలకు.