ఈ శ్రమజీవి.. నిజమైన హీరో
శారీరక లోపాలను అవరోధాలుగా భావించకుండా, కుటుంబాన్ని పోషించేందుకు ఓ వ్యక్తి చేస్తున్న అలుపెరగని పోరాటం ఎందరికో ఆదర్శం. కఠిన పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా, తన బాధ్యతలను నెరవేరుస్తున్న ఆయన పట్టుదల స్ఫూర్తిదాయకం.
From Lelle Suresh wall.
పీడితుల పిల్లన గ్రోవి
నాగన్న అమర్ హై!
----------------------
ఒక గాయకుడు ఎందుకు పాడతాడు? పాటలు ప్రత్యేకంగా ఒక గొంతుని కోరుకుంటాయా? పాటలు ఎలా పలుకుతాయి? ఎవరు రాసినా, కన్నతల్లి గర్భంలా ఎవరు మోసి జన్మనిచ్చినా, పాట పెరిగి పెద్దదై జీవించేది గాయకుడి గొంతులోనే. పసితనాన్ని, బాల్యాన్ని, యవ్వనాన్ని, వృద్దాప్యాన్ని మరియు మరణాన్ని ఆపై అమరత్వాన్ని పలికించేది ఆ గొంతు తడితోనే.
నాగన్న గాయకుడు. అరుణోదయ పాటలు కోరుకున్న ఆత్మీయ గొంతుక. నాగన్న గొంతు పీడితుల పిల్లన గ్రోవి. నాగన్న ఎన్నో పాటలని ప్రాణప్రదంగా పలికించాడు. లాలిగా, జోలగా, లయగా, గోదావరి లోయగా, పోరుగా, నక్సల్బరీ హోరుగా, ఎరుపు దిక్కుగా, నెత్తుటి జెండగా, అడవి మల్లెగా, అరుణోదయగా పాడుతూనే వున్నాడు.
పాటలు ఎన్నో కదా! ఒక గాయకుడు ఎన్ని సార్లు తన కోసం పాడుకుంటాడు? తన కోసం కొన్ని, జనం కోసం కొన్ని, తన జన కోసం మరి కొన్ని పాడుకుంటాడా? ఏమో! తెలియదు. కాని, పాట ఏదైనా గాయకుడి గొంతులో ఒక దృశ్యం వుంటుంది. పక్షిలా, పక్షుల గుంపుల్ని మోస్తున్న మహా వృక్షంలా గాయకుడు కదులుతూ, మెదులుతూ కనిపిస్తాడు. ఒంటరిగా, తుంటరిగా, ముసి ముసిగా, మసి మసిగా, కన్నీళ్ళలా, కాలిపోతున్నట్టు, గాలి ఆగి పోతున్నట్టు ఉంటాడు. దగ్గరగా వొస్తాడు. కళ్ళ మీదికొచ్చి, మసకబార్చి రెప్పపాటులో దూరమవుతాడు. మనసులో భావాలని, భావోద్వేగాలని తాకి కొత్త సముద్రాల్ని సృష్టిస్తాడు. సప్త స్వరాల ఆరోహణ-అవరోహణల కెరటాలుగా వినిపిస్తాడు.
నాగన్న గాన కెరటం. నాజార్ లా, కానూరి తాతలా, అరుణోదయ రామారావులా మన మనసులో కూర్చొని గుండెల్ని కెలుకుతుంటాడు. “కొమ్మల్లో రెమ్మల్లో కమ్మంగా పాడేటి నల్లాని ఓ కోయిలమ్మ, నల్ల నల్లాని నా కోయిలమ్మ” అంటూ వెంటపడతాడు. పాట వెంట పాట. నాగన్నది పాటల జీవితం. నాగన్నగొంతు పాటల ప్రవాహం! ఆ ప్రవాహం అడవిలా అందంగా వుంటుంది. అమరత్వంలా రమణీయంగా వుంటుంది. నాగన్నకు ఆయన గొంతు ఒక ఆభరణం. రాజకీయ విశ్వాసం, నిర్మాణ నిబద్దత ఆయనకు అవార్డులు. విప్లవ ఆరాటం, పోరాటం ఆయన వ్యక్తిత్వం. నాగన్న అస్తిత్వానికి పునాది ఆయన తోడబుట్టిన మధుర స్వరం. పీడిత ప్రజల విముక్తి ఆయన స్వప్నం. ఆ స్వప్నాన్ని సజీవంగా ఆలపించే అరుణోదయ నాగన్న జీవితం ధన్యం. నాగన్న పాట అమరం. నాగన్నకు జోహార్లు!
----
లెల్లే సురేష్
unexpected Crossover of the Day!
KTR Anna x Prabhas Anna Combo! 🔥💥
KTR Anna ప్రభాస్ అన్న కి కాల్ చేయడం...
ఆ బ్యాక్గ్రౌండ్ లో బాహుబలి BGM రావడం... Next Level 🥵😍
Waiting for the full episode! 💥
#KTR#Prabhas#Under18
తెలంగాణ జర్నలిస్టు KVR ను అరెస్ట్ చేసిన తీరు చూస్తే షాక్ వేస్తోంది..!
జర్నలిస్టు అంటే నేరస్థుడా..? ఇంత దౌర్జన్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది..?
ప్రశ్నించే గొంతులను భయపెట్టాలని చూస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టు KVR కి అన్ని విధాలా అండగా నిలవాలి.
జర్నలిస్టుపై దౌర్జన్యం ఆపాలి..!
జై తెలంగాణ ✊
పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ కార్యకర్తకు ఈ క్లిష్ట సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మా @BRSparty మరియు మన @KTRBRS రామన్న గారిని కోరుచున్నాము.🙏🏻
రంగారెడ్డి జిల్లా,ఆమనగల్ మండలం, శెట్టిపల్లి గ్రామనికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త మాడ్గుల జంగయ్య(బైండ్ల) గారు 2007లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దశలోనే తన గ్రామంలో తొలిసారిగా పార్టీ జెండాను ఎగరవేసి,పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన కార్యకర్త.(1)
ఇడుపు కాగితం అంటే ఏదో కొత్త పదం కాదు…
పెండ్లి అయినంక భార్యాభర్తలు కలిసి ఉండలేమంటే,
నలుగురు పెద్దలు కూసోని మాట్లాడి,
సర్ది చెప్పి,
ఇంకా కుదరకపోతే ఇద్దరి అంగీకారంతో రాసుకునే కాగితమే “ఇడుపు కాగితం”.
కోర్టులు, లాయర్లు అందుబాటులో లేని కాలంలో తెలంగాణ పల్లెల్లో పెద్దల సమక్షంలో జరిగిన సామాజిక పరిష్కారం.
తెలంగాణ బతుకులు,
తెలంగాణ ఆచారాలు తెలియనోళ్లకు
ఇడుపు కాగితం కూడా విచిత్రంగానే కనిపిస్తుంది!
హాస్పిటల్ లో "అడ్మిట్" అయ్యే ముందు "పది" సార్లు ఆలోచించండి.?
మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె "హాస్పిటల్" లో అడ్మిట్ కావద్దు.
ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు.
అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.
చాలా మంది కమర్షియల్ అయిపోయారు.
హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి.
పైకి కనిపించేంత అందమైనది కాదు.
మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా "అబద్ధాలు" అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.
డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం "అబద్దం". ముప్పై శాతమే నిజం.*
SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.
ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు.
అదేదో హోటల్ అనుకున్నాడు.
అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.
రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు.
శవాన్ని ఇచ్చారు.
దాసరి నారాయణ రావు, జయలలిత....
ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు.
నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, "భయంకర"మైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.?
తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు.
వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు
అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. "అది" తప్పు.
అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది?
ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??
అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు "బ్రతికే" అవకాశం ఉన్న మనిషి ఆయన.
అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి.
సెకండ్ opinion తీసుకోండి.
ఊరకే జొరబడ వద్దు.
అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది.
ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.
కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి.
ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు.
హాస్పిటల్ కు పోతే రేపే ....
జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.
అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.....
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు మృతి
హైదరాబాద్ – అల్వాల్ MES కాలనీలో చెట్లు నరుకుతుండగా విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ తో మృతి చెందిన సూర్యనారాయణ అనే దినసరి కూలి
సూర్యనారాయణకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు సమాచారం
గంగా నదిలో స్నానం చేశారని.. దళితులని ఘోరంగా కొట్టిన బ్రాహ్మణులు
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఘటన
అందరిలాగే.. తామూ గంగా నదిలో స్నానం ఆచరించేందుకు వెళ్లిన ఇద్దరు దళితులు
ఈ విషయం తెలిసిన వెంటనే.. కర్రలు చేత పట్టి నది వద్దకు చేరుకున్న బ్రాహ్మణులు
దళితులను బయటకు రప్పించి.. ఏమాత్రం కనికరం లేకుండా కర్రలతో వారిపై విచక్షణారహితంగా దాడి
చిన్న పిల్లల చేత కూడా కర్రలు ఇచ్చి.. వాళ్లతో ఇద్దరిని కొట్టించిన వైనం
దళితులంటే ఎందుకంతే చిన్నచూపు..? అందరూ సమానమేనని అంబేద్కర్ రాజ్యాంగం రాశాక కూడా ఈ వివక్ష ఏంటి?
ఆ ఇద్దరిపై ఎటాక్ చేసిన పూజారి సహా అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ.. డిమాండ్ చేస్తున్న జనం
उत्तराखंड मे Ketan lal को जातिवादियों ने बेरहमी से शरीर मे कील ठोककर मार गिराया
गुनाह ये था कि केतन और सवर्ण लड़की एक दूसरे से प्रेम करते थे
सारे हिंदुत्वादी इस घटना पर चुप क्यों है?
ఖమ్మం ఘటన గుండెను కలచివేసింది… 💔
12 ఏళ్ల చిన్నారి…
వేసవి సెలవులు ఆనందంగా గడపాలని తాతయ్య ఇంటికి వెళ్లింది.
కానీ ఒక కామాంధుడి క్రూరత్వం ఆమె జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది.
ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రి మంచంపై మృత్యువుతో పోరాడుతోంది.
కలలు కనాల్సిన కళ్లలో భయం కనిపిస్తోంది.
ఆ పాపకు న్యాయం జరగాలి.
నేరస్థుడికి చట్టం ముందు అత్యంత కఠినమైన శిక్ష పడాలి.
ఖమ్మం చిన్నారికి న్యాయం చేయండి. ✊
ఈ దేశంలో రాజులు మారారు, రాజ్యాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి.!
కానీ సామాన్యుడికి అండగా నిలిచింది ఒక్క భారత రాజ్యాంగమే మాత్రమే.📖
చేతిలో "భారత రాజ్యాంగం" ఉంటే పేదవారి గొంతు కూడా అధికారాన్ని ప్రశ్నిస్తుంది, చరిత్రను కదిలిస్తుంది.
Because of Indian Constitution.
Power of BabaSaheb.
“ఈ దేశంలో రాజులు మారారు…
ప్రభుత్వాలు మారాయి…
వ్యవస్థలు మారాయి…
కానీ సామాన్యుడికి అండగా నిలిచింది ఒక్క రాజ్యాంగమే!” ✊🔥
చేతిలో రాజ్యాంగం ఉంటే…
పేదవాడి గొంతు కూడా అధికారాన్ని ప్రశ్నిస్తుంది.
అణగారిన వాడి అడుగు కూడా చరిత్రను కదిలిస్తుంది. 🚩
Jai Bhim