As a CM, I’ve been seeing cyclones in AP since 1996. I have always believed in the power of technology to provide relief and accelerate fast response in cyclones. This time we were able to use AI to improve forecasting, minimize casualties, and transform relief operations. We have a long way to go, and we will keep working to get better! I’m happy that @theprintindia has recognized our efforts
Disappointed to see my little sister’s plea about inundation in her school, and her request for a new school building. I will get it acted upon immediately. Requesting collector Konaseema to look into this and provide necessary support in the interim to prevent flooding in the school.
@Collectorate_Ks
ఈరోజు పొద్దున్న లేవగానే ఈ షాకింగ్ న్యూస్ కనిపించింది.. WhatsApp లో చాలా మంది పంపించారు.. నిజం కాదేమో అనుకున్నా.., కానీ దాదాపు అన్ని మీడియాల్లో ఇదే న్యూస్.. చాలా షాకయ్యా!
వారి మధ్య ఏం జరిగిందో వారి వ్యక్తిగతం.. ఎవరూ దీనిపై వ్యంగ్యంగా, రాజకీయంగా, విమర్శగా మాట్లాడకపోవడం మంచిది!
కానీ ఆమె పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా మారారు అనేది నిజం. రష్యాలో పుట్టిపెరిగిన మహిళ మన సనాతనాన్ని గౌరవించి, కాలినడకన తిరుమల వెళ్లి, తలనీలాలు సమర్పించి, కుటుంబంతో బాగా కలిసిపోయి.. దాశబ్దకాలం పైగా కలిసున్నాక కూడ ఈ నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా ఆశ్చర్యకరమే!
తప్పు, ఒప్పుల సంగతి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ గారికి వైవాహిక జీవితం కలిసి రాదేమో.. ప్రజా జీవితంలో చురుకుగా ఉంటున్నారు కాబట్టి మరోసారి ఆ ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం!!
#PawanKalyan #PawanKalyanAnnaKonidena #PawanKalyanDivorce #GundusoodhiPINN
నాకు అత్యంత ఆత్మీయుడు, తిరుపతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాసరం భాస్కర్ గారి మరణం బాధాకరం. 1983 నుంచి దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిగా, తిరుపతి టౌన్ అధ్యక్షులుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. భాస్కర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని... ఈ విషాదం నుండి త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఒక్కటి మిస్ అయినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1. అర్హతలు:
- వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి
- ఆ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలి
- ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు
2. కావాల్సిన ప్రధాన పత్రాలు:
- నామినేషన్ ఫారం (Form-III)
- రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలి, అభ్యర్థి + ప్రపోజర్ సంతకాలతో
- ఓటర్ కార్డు (EPIC) జిరాక్స్- మీది + ప్రపోజర్ ది
- ఆధార్ కార్డు జిరాక్స్
- ఓటర్ లిస్ట్ వివరాలు
- మీ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, ప్రపోజర్ ది కూడా
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
- 4-6 కాపీలు
- వయసు ధృవీకరణ పత్రం
- 10th మెమో / బర్త్ సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం
- రిజర్వ్డ్ సీటు అయితే తప్పనిసరి. జనరల్ సీటులో పోటీ చేసినా SC/ST/BC అయితే డిపాజిట్ తగ్గింపు కోసం కావాలి
- నో డ్యూస్ సర్టిఫికెట్- పంచాయతీ కార్యదర్శి నుండి పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని
అఫిడవిట్ / ప్రమాణ పత్రం: నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, చదువు, పిల్లల వివరాలతో, ఇద్దరు సాక్షుల సంతకాలతో
డిపాజిట్ రసీదు: సర్పంచ్‌కు జనరల్ అభ్యర్థులకు ₹3,000, SC/ST/BC అభ్యర్థులకు ₹1,500 45f1
3. ప్రపోజర్ గురించి:
- ప్రపోజర్ అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి
- నామినేషన్‌ను అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్ ద్వారానే ఇవ్వాలి
ముఖ్య సూచన:ఒకటి నుంచి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఒక సెట్లో పొరపాటు వచ్చినా ఇంకోటి ఉంటుంది.
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో…. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి. మన పండుగలు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో, ఐకమత్యంతో మనమంతా ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ దీపాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు
#Diwali2026