నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విజ్ఞాన మందిరం (గ్రంథాలయం) ను ప్రారంభించాను. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తకం పఠనం ద్వారానే వ్యక్తులు విజ్ఞానవంతులవుతారు. అంబేద్కర్ గారు అవిశ్రాంత పుస్తక పఠనం చేసినందునే మనకు రాజ్యాంగంతో సహా ఎన్నో గొప్ప గ్రంధాలను అందించారు.
అంబేద్కర్ లేదా మరెవ్వరైనా మహనీయుల విగ్రహాలకన్నా వారి పేరుతో అదే ఖర్చుతో చక్కటి గ్రంథాలయాలను నిర్మిస్తే సమాజంలో మరెందరో ఆవిష్కర్తలు, జ్ఞానులు పుట్టుకొస్తారు.
Inaugurated Ambedkar Vigyan Mandir (Public Library) established with the donations of villagers under the guidance of Swaeroes Network in Salura of Nizamabad District of Telangana. Truly impressed with the collection of books in such an interior and border village! Hope every village goes Salura way.
#Aksharam #Aarogyam #Arthikam
#Swaeroes
#Ambedkar
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గంగాపూర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాను. దేశంలో అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం కోసం ప్రజల పక్షాన #BSP నిరంతరం పోరాడుతున్నది.
గత 75 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న ఆధిపత్య పాలకులు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయకుండా, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నైనా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.
#Socialjustice
2. बिहार के दो बार मुख्यमंत्री रहे देश के ऐसे महान व्यक्तित्व श्री कर्पूरी ठाकुर जी को देर से ही सही अब भारत रत्न की उपाधि से सम्मानित करने के केन्द्र सरकार के फैसले का स्वागत। देश के इस सर्वोच्च नागरिक सम्मान के लिए उनके परिवार व सभी अनुयाइयों आदि को हार्दिक बधाई एवं शुभकामनाएं।
మీడియా ప్రకటన
తేదీ:21-01-2024
సైదాపూర్
👉 బొడిగె గాలన్న మృతి తీరని లోటు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త మాజీ పీపుల్స్ వార్ నేత,తెలంగాణ ఉద్యమకారులు గాలన్న మృతి తీరని లోటని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లిలో బొడిగె శోభ కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ గాలన్న చిన్నతనం నుంచే పేద ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ, వామపక్ష ఉద్యమాలలో పనిచేశారని గుర్తచేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గాలన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
#IamRSP #BSP4Telangana @RSPraveenSwaero@BITCELL_BSP
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి (PJTSAU) చెందిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ 12 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపాము.
ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి నూతన వంగడాలను సృష్టిస్తూ,ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అందించిన వర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేపడితే అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతిని అరుదైన వృక్ష జాతులు, పక్షులు,జంతువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఖజానాలో ఇంకా డబ్బులుంటే కొత్త హైకోర్టును వేరే ప్రదేశంలో కట్టండి. హైదరాబాదు చుట్టుపక్కల చాలా ఖాళీ భూములు గుట్టలల్ల ఉన్నయి.
హైకోర్టు నిర్మాణానికి #BSP ఏమాత్రం వ్యతిరేకం కాదు. కానీ ముఖ్యమంత్రి @revanth_anumula గారు రాష్ట్ర మంత్రివర్గంతో సహా అగ్రివర్సిటీలో పర్యటించి, విద్యార్థులతో ప్రొఫెసర్ల తో చర్చలు జరిపితే తప్ప అక్కడి సమస్యలు అర్దం కావు.
అందుకే తక్షణమే ప్రభుత్వం https://t.co/artLfmUBzf.55 ను రద్దు చేసి, వర్సిటీ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టును నిర్మించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
Stood by Telangana Agriversity Students in solidarity who have been fighting to save precious flora and fauna in their university lands from the Government. Nobody objects to the government’s decision to build a new high court, if it is done on a barren land (with minimum destruction) which is close to Hyderabad. But why only the lands of biodiversity parks and botanical gardens which were painstakingly nurtured for decades by the students and scientists?
Is it because you want to slowly make this area a real estate hub close to Shamshabad Airport? Already some land is given to Prestige Group!
Is it because the voice of students here can be silenced easily as they are from Bahujan communities surviving on government scholarships?
If public purpose is the only cause for acquisition of university lands, why can’t the government acquire govt lands which are aplenty close to airport. Govt doesn’t want to explore such possibility because it wants to hand over such lands to sharks aka real estate companies who build ultra-luxurious villas for the high and mighty.
I request hon’ble high court to strike down GO 55 and ask the government to come up with a fresh proposal for land acquisition for new high court building, if it still has money in its coffers.
@TelanganaCS@TelanganaCMO@PjtsauIndia
హై కోర్టు నిర్మాణనికై వ్యవసాయ విద్యార్థుల భూములా ?
👉 విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా బీఎస్పీ.
👉ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ భూములను కాపాడుకునేందుకు రేపు ( 20-01-2024 ) న, ఉదయం 10 గంటలకు క్యాంపస్ కు విచ్చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు.
విశ్వ విద్యాలయ భూముల్ని కాపాడుకుందాం!
వ్యవసాయ పరిశోధనలకు అండగా నిలబడుదాం!!
#IamRSP #BSP4Telangana #VR99 #BSP4Students @BITCELL_BSP @BSP4Telangana
பகுஜன் சமாஜ் கட்சியின் தெலுங்கானா மாநிலத் தலைவரும், பகுஜன் மக்களிடம் அர்ப்பணிப்போடு பணியாற்றி வரும் மரியாதைக்குரிய
டாக்டர் R.S.பிரவீன் குமார் அவர்களை மரியாதை நித்தமாக சந்தித்தோம்.
அவர் எங்களோடு பல்வேறு செய்திகளையும்,
మనువాద పార్టీలు మన ఓట్ల కోసం భయపడుతూ పొత్తులతో పోరాటం చేస్తుంటే, ఆ ఎత్తుగడలను చిత్తు చేసి మన బహుజన ఉద్యమ జనచైతన్యం కోసం పోరాడుతున్న #Behenji మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి.
సంక్రాంతి సంబరాలలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గం డోర్పల్లిలో నియోజకవర్గ స్థాయి 'క్రికెట్ టోర్నమెంట్'ను ప్రారంభించాను. గత ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన 'గ్రామీణ క్రీడా ప్రాంగణం’ లేకున్నా స్థానిక క్రీడాకారులు చెరువునే క్రీడా మైదానంగా మార్చుకొని క్రీడల్లో రాణిస్తున్నారు. యువతతో కాసేపు క్రికెట్ ఆడి వారిలో క్రీడా స్పూర్తిని అలవర్చుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించాను.
#BSP4Telangana
#Cricket
మీడియా ప్రకటన
తేదీ: 13-01-2024
చింతలమానేపల్లి
👉కొమురం భీమ్ స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
👉పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
👉ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కంపెనీలు
👉ఆసిఫాబాద్,కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుపాలి
'జల్ జంగిల్ జమీన్ హమారా’ అంటూ తుపాకీ చేతపట్టి నిజాం సైన్యంతో పోరాటం చేసి అశువులు బాసిన ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించాకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. చింతలమానేపల్లి మండలం అంబగట్టలో ఆదివాసీ సంఘాలతో కలిసి పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు నివసించే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదాని,అంబానీలు అక్రమంగా మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు స్థిరనివాసం కూడా లేని దుస్థితిలో బతుకుతున్నారని ఆవేదన చెందారు.తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
కొమురం భీమ్ పోరాడి సాధించిన హక్కులను,చట్టాలను ఆధిపత్య పాలకులు తుంగలో తొక్కి అన్యాయం చేస్తున్నారని,పేసా చట్టం, 1/70, జీఓ నంబర్ 3 లాంటి హక్కులను, చట్టాలను ఆదివాసీలకు చెందకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆదివాసీ గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగాలు కల్పించే జీవో 3 ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఆదివాసీలకు జరిగే అన్యాయాలపై ఆధిపత్య పాలకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు.కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలన్నారు. పులిని చంపారనే అనుమానంతో పశువుల కాపరులైన ఆదివాసీలను నిర్బంధించి ఫారెస్ట్ అధికారులు చిత్రహింసలకు గురిచేసే జైలు పాలుచేశారని అన్నారు. పసి పిల్లలను కూడా పోలీసులు నిర్బంధించడం విచారకరమన్నారు.
#IamRSP #BSP4Telangana #VR99 #KomaramBheem @RSPraveenSwaero@BITCELL_BSP @BSP4Telangana