ఈ రోజు ఇందిరా పార్కులో జరిగిన భవన నిర్మాణ రంగాల కార్మికుల న్యాయబద్దమైన ధర్నాలో పాల్గొన్నాను.
ఈ లోకాన్ని నిర్మించిన భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కార్మికులు, తమకు జరిగిన అవమానానికి నిరసనగా వేలాది మందితో ధర్నా చేస్తుంటే,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి (గుంపు మేస్త్రీ )విమానాల్లో తిరుగుతున్నారు.
మీరు ఇలాగే వదిలేస్తే ఈ పేద కార్మికులు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్లాడుకునే ప్రమాదం ఉంది.
మీరు ఎలాగూ చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్లు అమలు చేసి న్యాయం చేయరు. పైగా కార్మికుల వెల్ఫేర్ బోర్డు ప్రైవేటు పరం చేస్తున్నారు.
చివరికి కార్మికులను ప్రశాంతంగా పని చేసుకోనివ్వరా?
ప్రభుత్వమే చొరవ తీసుకొని, రెండు వర్గాల మధ్య గొడవగా మారకముందే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.
@BRSparty@TelanganaCMO
BIG ALERT 🚨
I along with Former minister Sri Singireddy Niranjan Reddy ,Ex MLA Sri Jaipal Yadav will address media today.
Subject:
Debunking Lies of CM Revanth Reddy on Palamuru-RangaReddy Irrigation Schemes
Time: 1 PM
Venue: Telangana Bhavan, Hyd
Please Stay Tuned to Know the Truth. 🙏🙏🙏
మేము - మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ గారు మరియు నేను - నేడు మీడియాతో మాట్లాడబోతున్నాం.
విషయం:
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పచ్చి అబద్ధాలను బయటపెట్టడం
సమయం: ఈ రోజు 1 గంటకు
స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్
సత్యం మాత్రమే తెలుసుకోవాలనుకునేవారు అందరూ ట్యూన్ అయి ఉండండి.
ధన్యవాదాలు 🙏🙏🙏
క్రీడాకారులను కూడా మోసం చేస్తరా కాంగీస్ ??? మీ లాగే మీరిచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినయి. చీటింగ్ కేసు పెట్టాలె మీ అందరి మీద.
పడిగ తేజేష్ అనే ఈ యువకుడు యువకుడు స్కేటింగ్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో సుమారు 174 పథకాలు సాధించాడు. తెలంగాణ పేరును ప్రపంచ నలుదిశల వ్యాపించేలా చేశాడు. ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఓషియానియా (Australia and NZ) ఛాంపియన్షిప్ గేమ్స్ కావచ్చు ఖేలో ఇండియా కావచ్చు ఇలా అనేక ఛాంపియన్షిప్ గేమ్స్ లో అతను ప్రతిభను కనబరిచి మన తెలంగాణకు బంగారు,సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ సాధించి పెట్టాడు. కానీ మీరు ఇతనికి ఇచ్చిన ₹5,00,000 చెక్కు కూడా బౌన్స్ అయింది.
అయితే 2025 స్పోర్ట్స్ డే రోజు స్వయంగా రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు ఐదు లక్షల చెక్ ఇచ్చి,అతనితో ఫోటో దిగి, ఇప్పటికి పది నెలలు గడిచింది!!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ ప్రకటించి, క్రీడల్లో తెలంగాణ యువతను ఒలంపిక్స్ వరకు తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తామని చెప్పారు.
అవసరమైతే ప్రతి నియోజకవర్గానికి మినీ స్టేడియం కట్టించి యువతను క్రీడారంగం వైపు ఎక్కువ ఆసక్తి చూపేలా చేస్తామని కూడా చెప్పారు.
అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని కూడా హైదరాబాద్ కు పిలిపించి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మీరు కూడా అతనితో కలిసి ఫుట్ బాల్ ఆడారు.
మీరు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తేజేష్ అనే క్రీడాకారునికి అక్షరాల కోటి 55 లక్షల రూపాయలు రావాల్సి ఉండే.
తెలంగాణ ప్రభుత్వం మరి ఏ విధంగా తెలంగాణలో ఉన్న యువతను ఒలంపిక్స్ వరకు పంపించగలుగుతారండి రేవంత్ రెడ్డి గారు.
మీరు మెస్సీతో ఆడటానికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు కానీ, ఒక యువకుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకున్న పొలాన్ని తాకట్టు పెట్టి మరి ఆ యువకున్ని, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తే ప్రభుత్వము నుండి మీరు అందించాల్సిన సహకారం ప్రోత్సాహం ఇదేనా?
మీ స్పోర్ట్స్ పాలసీ ఇదేనా? మీకు మెస్సీ హైదరాబాద్ వచ్చి ఇలాగే క్రీడాకారులను మోసం చేయమని చెప్పారా?
వెంటనే తేజేష్ కు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రావలసినటువంటి డబ్బుల విడుదల చేయాలి.
తేజేష్ తో పాటు మిగతా తెలంగాణ క్రీడాకారులు ఎవరైతే నేషనల్ లెవెల్ లో గాని, ఇంటర్నేషనల్ లెవెల్ లో గాని ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారో, వాళ్లందరికీ మీరు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఇవ్వాల్సిన పారితోషకం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం వెంటనే ఇవ్వాలి.
లేదంటే క్రీడాకారులందరితో కలిసి మేము మీ మోసపూరిత ప్రభుత్వాన్ని ఫుట్ బాల్ ఆడవలసి వస్తుంది.👊👊👊⚽️⚽️⚽️
జై తెలంగాణ✊
@TelanganaCMO@AuthorityIndia@Vakiti_srihari@revanth_anumula
ఒకవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తానని రేవంత్ రెడ్డి పొంకనాలు కొడుతుండు,
మరోవైపు మన రాష్ట్ర పోలీసులు చేయలేని పనులను
మహారాష్ట్ర పోలీసులు నెలల తరబడి మాటువేసి పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేసి, నేరస్తులను పట్టుకుంటున్నారు.
మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్లు?
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
🌏 Greetings to everyone on the occasion of World Environment Day.
♻️ With each passing day in this technologically advanced and modern world, the need and imperative to protect our Mother Earth are becoming increasingly important.
🌳 On this World Environment Day, let us also recollect the remarkable green transformation that took place in Telangana under the leadership of KCR garu 👇
🌱 Through Haritha Haaram, a massive greening initiative, the BRS government planted more than 290 crore saplings across Telangana.
🪴 Alongside this, thousands of sustainable green spaces such as Urban Forest Parks, Theme Parks, Palle Prakruthi Vanalu, Pattana Prakruthi Vanalu, and others were developed.
📈 The results spoke for themselves. Between 2015 and 2021, forest cover grew from 19,854 sq km to 21,214 sq km - a 6.85% increase, while overall greenery increased by 7.7%.
➡️ While India's overall green cover grew by just 0.22% (1,540 sq km), Telangana alone added 3.07% (632 sq km).
➡️ Thanks to these efforts, Hyderabad emerged as a global model for urban greening, earning prestigious international recognitions, including the World Green City Award and Tree City of the World status.
➡️ KCR garu also introduced a '10% Green Budget' policy, mandating that 10% of local body funds be allocated for greening efforts.
Let us strive and pledge to protect our Mother Earth on this Environment Day.
రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ లో అన్నదాతల హననం అడ్డూఅదుపు లేకుండా జరుగుతనే ఉన్నది. దీన్ని అడ్డుకుంటాం 👊
ఒక వైపు రైతు బంధు, భీమా, మద్దతు దర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తూ, మరో వైపు రైతులకు ఉన్న భూములను కూడా బలవంతంగా గుంజుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికి వత్తాసు పలుకుతున్నారు కొందరు అధికారులు. మీరు సంతకం పెట్టే ప్రతి ఫైలు రేపు రానున్న @BRSparty ప్రభుత్వం లో తప్పకుండా పరిశీలించబడుతుంది.
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి తదితర హైదరాబాదు పరిసర జిల్లాలలో ఈ దౌర్జన్యం మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
దీని వెనక వినిపిస్తున్న పేర్లు మన ఫోర్ బ్రదర్స్ మరియు రెవెన్యూ మంత్రి వర్యులు.
HMDA రీజియన్ లో ఉన్న రెవెన్యూ యంత్రాంగం అంతా రెండు వర్గాలుగా విడిపోయింది అని అధికారులు చెప్తున్నారు. ఒకటి CM వర్గం రెండోది RM వర్గం అంట. లావాదేవీలు, పంపకాలు సరిగా జరగకపోతే వెంటనే @TelanganaACB ను ఉసిగొల్పుతున్నారు. షామీర్ పేట తహసీల్దార్ ఇటీవలే ACB ట్రాప్ కూడా అయింది.
ఎందుకు ఇంత లంచాలు తీసుకుంటున్నారు అని ‘కొంత మందిని’(అందరు కాదు) అడిగితే మేం లక్షలు ఇచ్చి వచ్చాం అని కొందరు చెప్తే, మరి కొంతమంది మాకు BOSS నుండి టార్గెట్ ఉంది అని చెప్తున్నారు. వాళ్ల భద్రత దృష్ట్యా పేర్లు చెప్పడం లేదు. అన్ని ఫైళ్లు సరిగా ఉన్నా ఉన్నతాధికారులు RM తో ఒక మాట చెప్పించండి అని చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఈ అవినీతి నిరోధక శాఖ (ACB) వాళ్లకు ఈ బిగ్ బాసులు ఎందుకు కనిపిస్తలేరో సమజైతలేదు!!!! ఇప్పుడు మీకు దొరుకుతున్న చిన్న చేపలకు(Accused Officers) కు లై డిటెక్టర్ పరీక్షలు చేయండి. అసలు దొంగలు దొరుకుతరు.
ఇటీవల మా బీఆరెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు కూడా పెద్దషాపూర్ 1000 కోట్ల కుంభకోణాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేశారు. వెంటనే తేలుకుట్టిన దొంగల్లా అధికారులు మేల్కొన్నారు.
మరో వైపు గతంలో రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ లు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేసి షామీర్ పేటలో పలు గ్రామాల్లో వందల ఎకరాల రైతుల భూములను ప్రైవేటు రిసార్టు లకు కట్టబెడుతున్నారు మేడ్చల్ జిల్లా అధికారులు!
బొమ్రాస్ పేట లాంటి మరి కొన్ని గ్రామాల్లో రైతుల భూములను రికార్డులు సరిగా లేవంటూ 22A (నిషేధిత భూములు) జాబితాలో చేర్చారు. ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీళ్లు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. అతి త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తాం.
వీళ్లందరికీ న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగిస్తాం ✊ లంచాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే ఏ అధికారినీ వదలం. ఈ లాంటి వారికోసం అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కాలాపానీ లాంటి జైలును నిర్మిస్తాం. అందులో మీ ‘బాసులకు’ ప్రత్యేక సౌకర్యాలు ఉండబోతున్నవి.
Get Ready. Pack Your Bags!
#SaveFarmersFromCongress
@revanth_anumula@INC_Ponguleti@KTRBRS@chmallareddyMLA@TelanganaCMO@TelanganaDGP
నిన్న జూన్ 2 నాడు ఉద్యోగులు పీఆర్సీ కోసం ఆశగా ఎదురుచూశారు..
కానీ రేవంత్ రెడ్డి నిరాశనే మిగిల్చిండు.
ఆరు డీఏలను పెండింగ్లో పెట్టిన ఏకైక ప్రభుత్వం.. ఈ కాంగ్రెస్ మాత్రమే.
ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఆర్టీసీ కార్మికులు, జీహెచ్ఎంసీ కార్మికులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.
మోసమే కాంగ్రెస్ నైజం, అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్.
మోసపు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే HMWS&SB యూనియన్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాంబాబును గెలిపించాలి.
రాంబాబు ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీ వెనుక ఉన్నట్లే.
650 మందిని రెగ్యులరైజ్ చేశాం, వందల మందికి ప్రమోషన్లు ఇచ్చాం..
రాంబాబు గారిని గెలిపిస్తే, మీ సమస్యలకు మేం అండగా ఉంటాం!
- HMWS&SB గేట్ మీటింగ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు మరియు ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి హాజరైన, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు..
@BRSparty@KTRBRS@BRSHarish@RSPraveenSwaero
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
బాబాసాహెబ్ డా.బిఆర్ అంబేద్కర్ సాక్షిగా..
తెలంగాణ అమరవీరుల సాక్షిగా..
తెలంగాణలో రైతాంగాన్ని రక్షించుకుంటాం.
అమ్మాయిల పై జరిగే అఘాయిత్యాలను అడ్డుకుంటాం.
చదువుకునే పిల్లల పసిప్రాణాన
లను కాపాడుకుంటాం.
రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను పోరాడి
సాధించుకుంటాం.
అక్రమార్కుల చేతిలో అన్యక్రాంతమవుతున్న పేదల భూములను రక్షించుకుంటాం.
తెలంగాణ సహజ వనరులను సంరక్షించుకుంటాం.
తెలంగాణ లో తిరిగి కెసిఆర్ పాలన తెచ్చుకుంటాం.
మా శ్వాస తెలంగాణ.
మా వాదం అభివృద్ధి.
మా లక్ష్యం ప్రజాసంక్షేమం.
జై తెలంగాణ
*దయచేసి ఈ రోజు ఈ కింది ప్రతిజ్ఞ ను మీరు చేయండి. పది మంది తో చేయించండి.
🙏
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ములుగు పట్టణంలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి గులాబీ జెండా జాతీయ జెండా ఆవిష్కరించిన @brsparty ములుగు జిల్లా నాయకులు నాయకులు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా నాయకులు
@bhukya_jampanna_ గారు..
కేటీఆర్ జడ్జి, ప్రవీణ్ కుమార్ పోలీస్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
నేను పోలీస్, కేటీఆర్ జడ్జి అయి ఉంటే.. నువ్వు చేసిన నేరాలకు నిన్ను ఈపాటికే జైలులో వేసే వాళ్ళం.
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ,
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
@RSPraveenSwaero@KTRBRS