#HappyDiwali
పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు పండుగలను అత్యంత ఘనంగా, సంబరంగా చేసుకుంటారు. ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. చీకట్లను తరిమేసి వెలుగులు పంచే దీపావళి పండుగను ఉండవల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని...దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని...ప్రజలకు ప్రతి రోజూ పండుగ కావాలని దేవుడిని ప్రార్థించాను. రాష్ట్రాన్ని ప్రగతి వెలుగులతో నింపేందుకు చేస్తున్న ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు, ప్రజల సహకారం కోరుకుంటూ అందరికీ మరో సారి దీపావళి శుభాకాంక్షలు.